Oman: ఒమన్.. భారత్‌తో శతాబ్దాల చారిత్రక సంబంధం కలిగిన దేశం. ప్పటికీ మన దేశం నుంచి వేల మంది ఉపాధి కోసం ఒమన్ వెళ్తున్నారు. పెట్రోలియం ఉత్పత్తే ఒమన్ ప్రధాన ఆదాయం. అయితే ఒమన్‌లో ఆంక్షలు, చట్టాలు కూడా కఠినంగా ఉంటాయి. తాజాగా ఒమన్ ప్రభుత్వం కొత్త చట్టం అమలులోకి తెచ్చింది. 2026 జనవరి 1 నుంచి ఇది అమలులోకి వచ్చింది. పెళ్లి చేసుకునే జంటలు వివాహానికి ముందే తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయించుకోవాలి.
జన్యు వ్యాధుల నివారణ కోసం..
పరీక్షలు జన్యు సంబంధ వ్యాధులను గుర్తించి, హెపటైటిస్, హెచ్‌ఐవీ వంటి సంక్రమణలు భాగస్వామి మధ్య లేదా భవిష్యత్ సంతానానికి వ్యాపించకుండా చూస్తాయి. అయితే పరీక్ష ఫలితాలను మూడో వ్యక్తికి వెల్లడి చేయకూడదని గోప్యతా నియమం విధించారు. ఇది వ్యక్తిగత హక్కులను కాపాడుతుంది.
ముందస్తు పరీక్షలతో ప్రయోజనాలు..
ముందస్తు ఆరోగ్య పరీక్షలతో జన్యుపరమైన లోపాలు, సమస్యలు ముందుగా తెలుస్తాయి. దీంతో చికిత్స తేలిక అవుతుంది. కుంటుంబాల్లో వ్యాధుల భారం తగ్గుతుంది. వైరస్ వ్యాప్తిని కట్టడి చేస్తుంది. ప్రజా ఆరోగ్యాన్ని బలోపేతం చేస్తుంది. పెళ్లి ముందు ఆరోగ్య చైతన్యం పెరిగి, దీర్ఘకాలిక వైద్య ఖర్చులు తగ్గుతాయి. ఇలాంటి నియమాలు ఇతర దేశాలకు మార్గదర్శకంగా మారవచ్చు. ఈ చర్య ఒమాన్‌లో ఆరోగ్య సామాజిక వ్యవస్థను బలపరుస్తుంది.