Varanasi Record: సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh Babu), రాజమౌళి(SS Rajamouli) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘వారణాసి'(Varanasi Movie) మూవీ కి సంబంధించిన గ్లింప్స్ వీడియో ని గత ఏడాది రామోజీ ఫిలిం సిటీ లో #Globetrotter ఈవెంట్ ని ఏర్పాటు చేసి ఎంత గ్రాండ్ గా నిర్వహించారు అనేది మనం అంత తేలికగా మరచిపోలేము. మహేష్ అభిమానులకు మాత్రమే కాకుండా, మూవీ లవర్స్ కి కూడా ఒక విజువల్ ఫీస్ట్ లాంటి ఈవెంట్ అది. ఈ గ్లింప్స్ వీడియో లో సినిమాలోని షాట్ కేవలం ఒక్కటే చూపించాడు రాజమౌళి. మిగిలిన షాట్స్ మొత్తం అసలు ‘వారణాసి’ ప్రపంచం ఎలా ఉండబోతుంది అనేది AI విజువల్స్ తో చూపించాడు. అందుకు కీరవాణి అందించిన నేపధ్య సంగీతం తోడై ఒక విజువల్ వండర్ ని చూస్తున్న ఫీలింగ్ కలిగింది. అలాంటి అంచనాలను ఏర్పాటు చేసిన ‘వారణాసి’ గ్లింప్స్ ఇప్పుడు మరో అరుదైన రికార్డు ని నెలకొల్పింది.
ప్రపంచం లోనే అతి పెద్ద థియేటర్ గా పిలవబడే ప్యారిస్ లోని లే గ్రాండ్ రెక్స్ థియేటర్ లో ఈ టీజర్ ని నిన్న ప్రదర్శించారు. ఇంటర్నేషనల్ ఆడియన్స్ నుండి ఈ గ్లింప్స్ వీడియో కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ థియేటర్ లో ప్రదర్శింపబడిన మొట్టమొదటి ఇండియన్ మూవీ గ్లింప్స్ వీడియో గా వారణాసి అరుదైన రికార్డుని నెలకొల్పింది. ఇప్పటి వరకు ఈ థియేటర్ లో ప్రదర్శింపబడిన మన ఇండియన్ సినిమాలు కబాలి , బీస్ట్ , బాహుబలి 2, సాహూ, రీసెంట్ గా ఓజీ చిత్రాలు మాత్రమే. ఈ థియేటర్ లో దాదాపుగా 4 వేలమంది పైగా కూర్చోవచ్చు. చాలా అరుదుగా హౌస్ ఫుల్స్ నమోదు అవుతూ ఉంటాయి. ఇక ‘వారణాసి’ గ్లింప్స్ ని ఇక్కడ ప్రదర్శించడాన్ని చూస్తుంటే, రాజమౌళి ఇంటర్నేషనల్ ఆడియన్స్ కి ఇప్పటి నుండే ఈ సినిమాని పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నాడు.
#RRR మూవీ తో ఇంటర్నేషనల్ ఆడియన్స్ కి బాగా దగ్గరైన రాజమౌళి, ఈ సినిమాతో ఇంకా పెద్ద రేంజ్ కి వెళ్లాలని చూస్తున్నాడు. ఈ సినిమాని ఓవర్సీస్ మర్కెట్స్ అన్నిట్లో విడుదల చేయించడానికి ఒక ప్రముఖ హాలీవుడ్ సంస్థ తో కూడా ఆయన ఒప్పందం చేయూస్కున్నట్టు తెలుస్తోంది. ‘అవతార్ 3’ ఎలా అయితే ప్రపంచం లోని అన్ని దేశాల్లో, అన్ని భాషల్లోనూ ఒకేసారి విడుదలైందో, అలాంటి విడుదల ‘వారణాసి’ కి కూడా ఉండబోతుంది అట. ఇక ఓపెనింగ్స్ హాలీవుడ్ సినిమాకు ఏ మాత్రం తక్కువ కాకుండా ఉండేలా చూస్తున్నాడు రాజమౌళి. చూడాలి మరి రాజమౌళి కల నెలవేరుతుందా లేదా అనేది. ఇకపోతే ఈ చిత్రాన్ని 2027 వ సంవత్సరం లో శ్రీరామ నవమి సందర్భంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Premières images du très attendu film de S. S. Rajamouli, #Varanasi, qui arrivera sur grand écran en 2027. #FestivalDeLaBandeAnnonce pic.twitter.com/ZIdRHBpfyn
— Le Grand Rex (@LeGrandRex) January 5, 2026