https://oktelugu.com/

North Korean: రష్యాకు ఉత్తరకొరియా బలగాలు.. భగ్గుమన్న సౌత్‌ కొరియా.. ఏం జరుగుతోంది?

ఒకవైపు రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం జరుగుతోంది. మరోవైపు ఇజ్రాయెల్, హమాస్, హెజ్‌బొల్లా, ఇరాన్‌ యుద్ధం జరుగుతోంది. ఈతరుణంలో ఉత్తర కొరియా కూడా కయ్యానికి కాలుదువ్వుతోంది. దక్షిణ కొరియాతో చేసుకున్న ఒప్పందాలకు స్వప్తి పలికింది. మరోవైపు అమెరికాపై ఉన్న కోపంతో రష్యాకు సైనికసాయం చేస్తుంది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : October 24, 2024 / 09:43 AM IST

    North Korean

    Follow us on

    North Korean:ప్రపంచంలో ఇప్పటికే యుద్ధ వాతావరణం నెలకొంది. మూడో ప్రపంచ యుద్ధం వస్తుందేమో అన్న ఆందోళన అంతటా నెలకొంది. ఒకవైపు రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం రెండేళ్లుగా కొనసాగుతోంది. మరోవైపు ఇజ్రాయెల్‌–హమాస్, హెజ్‌బొల్లా, ఇరాన్‌ మధ్య యుద్ధం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉత్తర కొరియా కూడా యుద్ధానికి కాలుదువ్వుతోంది. అమెరికాపై ఉన్న కోపంతో రష్యాకు సైనిక సాయం అందిస్తోంది. ఒవైపు అమెరికా ఉక్రెయిన్‌ సాయం చేస్తుండడంతో, ఇదే అదనుగా రష్యాకు ఉత్తర కొరియా సాయం అందిస్తోంది. తాజాగా మరో 1,500 మంది సైనికులను రష్యాకు తరలించింది. ఈ విషయాన్ని దక్షిణ కొరియా గూడచర్య సంస్థ(ఎన్‌ఐఎస్‌) బయట పెట్టింది. ఉక్రెయిన్‌పై యుద్ధం కోసమే వారిని పంపిందని పేర్కొంది. డిసెంబర్‌ నాటికి మరో 10 వేల మందిని రష్యాకు పంపాలని యోచిస్తోందని ఆరోపించింది.

    రష్యాకు సహాయం..
    అమెరికాపై కోపాన్ని తీర్చుకోవడమే లక్ష్యంగా ఉత్తర కొరియా ఇటీవలే దక్షిణ కొరియాతో గతంలో చేసుకున్న శాంతి ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. ఇరు దేశాల మధ్య నిర్మించిన రోడ్లను ధ్వంసం చేసింది. తాజాగా రష్యాకు సైనిక సాయం అందిస్తోంది. 1,500 మంది సైనికులు తాజాగా రష్యాలోని వాదివోస్తోక్‌ పోర్టుకు చేరుకున్నారని ఎన్‌ఐఎస్‌ తెలిపింది. తాజాగా రష్యా రాయబారి జార్జి జినోవిచ్‌తో భేటీ అయిన దక్షిణ కొరియా విదేశాంగ డిప్యూటీ మినిస్టర్‌ కింగ్‌ హాంగ్‌ క్యూన్‌ రష్యాకు ఉత్తర కొరియా బలగాలను పంపడాన్ని ఖండించారు.

    వ్యతిరేకించిన దక్షిణ కొరియా..
    ఉత్తర కొరియాతో రష్యా సంబంధాలను దక్షిణ కొరియా వ్యతిరేకిస్తోంది. ఈ బంధం తమ భద్రతా ప్రయోజనాలకు వ్యతిరేకమని పేర్కొంది. ఉత్తర కొరియా చర్యలు ఇలాగే ఉంటే.. తాము కూడా ఉక్రెయిన్‌కు అత్యాధునిక ఆయుధాలను పంపుతామని హెచ్చరిస్తోంది. ఉత్తర కొరియా ఒక క్రిమినల్‌ దేశమని మండిపడుతోంది. ఇదిలా ఉంటే.. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. ఇటీవలే కిమ్‌ రైలులో రష్యాకు వెల్లి వచ్చారు. కిమ్‌కు ఖరీదైన బహుమతులను అందించాడు పుతిన్‌. తాజా పరిణామాలు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయో అని ఇటు దక్షిణ కొరియా, అటు అమెరికా ఆందోళన చెందుతున్నాయి.