North Korea Missile Test: ఉత్తరకొరియా క్షిపణి పరీక్ష: ఉలిక్కిపడ్డ దక్షిణ కొరియా, జపాన్

North Korea Missile Test: ఆసియా ఖండంలో వివాదాస్పదమైన దేశాల్లో చైనా, ఉత్తర కొరియా, పాకిస్తాన్ దేశాల పేర్లు వినిపిస్తాయి. ఉత్తర కొరియా తన ఆయుధ సంపత్తిని పెంచుకోవడానికి ప్రాధాన్యం ఇస్తోంది. దేశ ప్రజలు ఆకలితో అలమటిస్తున్నా అణు క్షిపణి పరీక్షలు జరపడం ఆ దేశానికే చెల్లింది. దీంతో ప్రపంచం మొత్తం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఉత్తర కొరియా చర్యలను అన్ని దేశాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. […]

Written By: Srinivas, Updated On : September 13, 2021 4:56 pm
Follow us on

North Korea Missile Test: ఆసియా ఖండంలో వివాదాస్పదమైన దేశాల్లో చైనా, ఉత్తర కొరియా, పాకిస్తాన్ దేశాల పేర్లు వినిపిస్తాయి. ఉత్తర కొరియా తన ఆయుధ సంపత్తిని పెంచుకోవడానికి ప్రాధాన్యం ఇస్తోంది. దేశ ప్రజలు ఆకలితో అలమటిస్తున్నా అణు క్షిపణి పరీక్షలు జరపడం ఆ దేశానికే చెల్లింది. దీంతో ప్రపంచం మొత్తం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఉత్తర కొరియా చర్యలను అన్ని దేశాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి.

ఆధునిక సాంకేతిక నైపుణ్యంతో అభివృద్ధి చేసిన మిస్సైళ్లు, వాటిని వినియోగించే ట్యాంకులను కొనుగోలు చేసి వివాదాలకు తెరలేపుతోంది. అత్యాధునిక క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. లాంగ్ రేంజ్ క్రూయిజ్ మిస్సైల్ 1500 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్ ను సునాయాసంగా ఢీకొనే సామర్థ్యం ఉంది. ఈనెల 11,12 తేదీల్లో క్షిపణుల పరీక్షలను నిర్వహించినట్లు తెలుస్తోంది.

దేశాధినేత కిమ్ జొంగ్ ఉన్ ఈ పరీక్షలను తన అధికారిక నివాసం నుంచే పర్యవేక్షించారని తెలుస్తోంది. ఈ పరీక్షలతో దక్షిణ కొరియా ఆందోళన వ్యక్తం చేస్తోంది. సుదీర్ఘ కాలంగా రెండు దేశాల మధ్య శత్రుత్వం ఉన్న నేపథ్యంలో ఉత్తర కొరియా అణు పరీక్షలు నిర్వహించడంపై అంతర్జాతీయ సమాజానికి ఫిర్యాదు చేసేందుకు సిద్దమవుతోంది. క్షిపణి పరీక్షలను నిర్వహించిన అనంతరం అధ్యక్షుడు సంతృప్తి వ్యక్తం చేశారు.

అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రమాణ స్వీకారం తరువాత కిమ్ జొంగ్ ఉన్ సుమారు రెండు గంటల పాటు ఫోన్ లో మాట్లాడుకున్నారు. ఈ ఆరు నెలల సమయంలో లాంగ్ రేంజ్ క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రతికూల పరిస్థితుల్లో కూడా కిమ్ జొంగ్ ఉన్ మిస్సైళ్ల పరీక్షలను చేయడం ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తోంది.

ఆయుధ సంపత్తి పెంచుకోవడానికి కిమ్ జొంగ్ ఇస్తున్న ప్రాధాన్యం పొరుగు దేశాలను కలవరపెడుతోంది. ప్రత్యేకంగా దక్షిణ కొరియా దీనిపై ఆందోళనకరంగా ఉంది. తమ పక్కనున్న దేశం ఇలా పరీక్షలు జరపడం చూస్తుంటే ఏ ఆపద ముంచుకొస్తుందో అనే బెంగ నెలకొంది. దాయాది దేశాలైన దక్షిణ కొరియా, జపాన్ కు నిద్ర లేకుండా చేస్తున్న ఉత్తర కొరియా నిర్వాకంతో ఉలిక్కిపడేలా చేస్తున్నాయి.