Korea countries : పచ్చగడ్డి వేస్తే భగ్గమనే కొరియా దేశాల మధ్య మరోసారి అగ్గిరాజేసుకుంది. ఎప్పుడు ఏం జరుగుతుందా అని ఆయా దేశాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఇందుకు కారణం ఉత్తరకొరియా చేపట్టిన బెలూన్ ప్రయోగాలే కారణం. చెత్త మోసే ఈ బెలూన్ ప్రయోగాలను పున:ప్రారంభించడంతో ప్రతిస్పందనగా సరిహద్దులో ప్యోంగ్యాంగ్ వ్యతిరేక ప్రచారానికి దక్షిణ కొరియా శ్రీకారం చుట్టింది.
బెలూన్ ప్రయోగాలే కారణం
కాగా, ప్రస్తుతం రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. తాజాగా ఉత్తరకొరియా చేపట్టిన చెత్త మోసే బెలూన్ ప్రయోగాలకు ప్రతీకారం తీర్చుకోవడానికియన ఉత్తరకొరియాలో ప్రచార ప్రసారాలను దక్షిణ కొరియా మొదలుపెట్టింది. ఈ మేరకు ఆ దేశం శుక్రవారం ఒక ప్రకటనను విడుదల చేసింది. ప్రత్యర్థుల మధ్య శత్రుత్వాన్ని పెంచే ప్రచ్చన్న యుద్ద తరహా వ్యూహాలను పున:ప్రారంభించినట్లు తెలిపింది.
సరిహద్దులో ఏం జరుగుతోంది..
దక్షిణ కొరియా జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ గురువారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. గురువారం సాయంత్రం మరియు శుక్రవారం ఉదయం రెండు దేశాల సరిహద్దులో ప్యొంగ్యాంగ్ వ్యతిరేక ప్రసారాలను వినిపించేందుకు ఫ్రంట్ లైన్ లౌడ్ స్పీకర్లను ఉపయోగించినట్లు తెలిపారు. అయితే ఉత్తరకొరియా వ్యవహారాలపై ఈ ప్రసారాలు చేసినట్లు సమాచారం. ఈ ప్రసారాలు ఎలా జరగాయనేది మాత్రం మొదటగా తెలియలేదు. క్షిపణుల ప్రయోగం, అణచివేత కార్యక్రమాలపై ఈ ప్రసారాలు కొనసాగినట్లు తెలుస్తున్నది. దక్షిణ కొరియా ప్రసారాలపై ఉత్తరకొరియా గట్టిగానే ప్రతిస్పందించింది. 2015లో, గత పదకొండేళ్లలో మొదటిసారిగా దక్షిణ కొరియా ఈ ప్రసారాలను ప్రవేశపెట్టినప్పుడు సరిహద్దు వెంట ఉత్తరకొరియా క్షిపణులను ప్రయోగించింది. దక్షిణకొరియా కూడా దీనికి ప్రతిగా స్పందించింది. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కాగా, ఇటీవల కాలంలో ఏడో బెటాలియన్ డే సందర్భంగా ఉత్తరకొరియా గురువారం మధ్యాహ్నం బెలూన్లను వదిలిందని దక్షిణకొరియా సైన్యం ఆరోపిస్తున్నది. మే చివరి నుంచి ఇప్పటివరకు ఉత్తరకొరియా 2వేల కంటే ఎక్కువ బెలూన్లలో వేస్ట్ పేపర్, సిగరెట్ బట్, పేడ, స్క్రాప్ వస్తువులను దక్షిణకొరియాలో వదిలింది. దక్షిణ కొరియా కు చెందిన కొందరు వ్యక్తులు తమ సొంత బెలూన్ల ద్వారా వదులుతున్న కరపత్రాల నేపథ్యంలో ఉత్తరకొరియా ఇలాంటి వాటికి శ్రీకారం చుట్టిందని తెలుస్తున్నది. ఉత్తరకొరియా చివరిసారిగా జూన్ లో ఈ బెలూన్లను వదిలింది. అయితే ప్రాణనష్టం కలిగించే ఎలాంటి పదార్థాలు అందులో లేవు.
ఉద్రిక్తతలు పెరిగేలా..
అయితే ఈ బెలూన్ల రాక నేపథ్యంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్తత తగ్గింపు ఒప్పందం 2015ను వదిలేశాయి. సరిహద్దులో మిలిటరీ డ్రిల్ లను నిర్వహిస్తున్నాయి. ఈ వారం ప్రారంభంలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ యొక్క సోదరి మరోసారి ఈ చెత్త బెలూన్లపై ప్రకటన విడుదల చేసింది. దక్షిణకొరియా భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని నేరుగానే హెచ్చరికలు జారీ చేసింది.ఉత్తరకొరియా భౌతికంగా రెచ్చగొట్టే చర్యలపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇక ప్రస్తుత ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్ తో భేటీ తర్వాత కిమ్ మరింత రెచ్చగొడుతున్నారని దక్షిణ కొరియా ఆరోపిస్తున్నది. యూఎస్ అధ్యక్ష ఎన్నికలకు ముందు ఇలాంటి చర్యలు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు రెండు దేశాల మధ్య మిలటరీ మోహరింపులు, డ్రిల్స్ కొనసాగుతున్నాయి. ఇక ఎప్పుడు ఏ క్షిపణి వచ్చి మీద పడుతుందోనని ప్రజానీకం భయాందోళనకు గురవుతున్నది. ఈ క్రమంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు ప్రపంచ దేశాలు, ఐకరాజ్యసమితి జోగ్యం చేసుకోవాలని డిమాండ్ వినిపిస్తున్నది.