Financial Planings : ప్రస్తుతం ఉన్న సమాజంలో ఆర్థిక క్రమశిక్షణ ప్రతి ఒక్కరికీ అవసరం. కొన్ని చిట్కాలు పాటిస్తే భావిజీవితం ప్రశాంతంగా ఉంటుంది. అయితే ఇలాంటి సమాచారం తెలుసుకోవడం ఇఫ్పుడు అత్యంత సులభం. అరచేతిలోనే సమస్త సమాచారాన్ని తెలుసుకుంటున్న నేటి జనం, ఆర్థిక చిట్కాలు తెలుసుకోవాలని కూడా ఊబలాటపడుతుంటుంది. ఇక విద్యాభ్యాసం పూర్తయి, జాబ్ కొట్టగానే నేటి యువత ఎంజాయ్ లైఫ్ వైపు దృష్టి పెడుతుంది. ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం కారాణంగా భవిష్యత్ జీవితంలో ఎన్నో చిక్కుల్లో పడి విలవిలలాడుతుంటుంది. రేపటి కోసం ఆలిచించడం మొదలుపెడితేనే, భవిష్యత్ బాగుంటుంది. అందుకే కొన్ని చిట్కాలు తెలుసుకుందాం..
సురక్షిత గమ్యాన్ని చేరుకోవాలంటే క్రమశిక్షణ ఎంతో అవసరం. ఆర్థికంగా ఇబ్బందులు రావొద్దంటే ఇదే ముఖ్యపాఠం.
1. ఇక మొదటగా ఉద్యోగంలో చేరగానే ఎన్నో బ్యాంకులు క్రెడిట్ కార్డును ఆఫర్ చేస్తుంటాయి. ఇదే పెద్ద ప్రమాదం. క్రెడిట్ కార్డులు వాడి, బిల్లు కట్టక పోతే ఇక అంతే. మీ క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది. క్రెడిట్ కార్డు వడ్డీలతో పొదుపు మంత్రం కాస్త అటకెక్కుతుంది.
2. నెలనెలా ఆర్థిక ప్రణాళిక అవసరం. నెలాఖరులోపు తరుచు మనం సమీక్షించుకోవాలి. ప్రస్తుతం మన ఫోన్ లో ఎన్నో యాప్ లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో మన ఖర్చుల వివరాలు, పొదుపు వివరాలు పూర్తిగా నమోదు చేసుకోవాలి. నెలవారీగా మన ఖర్చులను పొదుపు చేస్తే రేపటికి కొంత మిగిలే అవకాశం ఉంటుంది.
3. వస్తున్న ఆదాయంలో కనీసం 20 నుంచి 25 శాతం వరకు పొదుపు చేస్తేనే బెటర్. దీర్ఘకాలికంగా ఇలా చేస్తే మన భవిష్యత్ అవసరాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
4. అత్యవసర నిధిగా కొంత మొత్తాన్ని అందుబాటులో ఉంచుకోవాలి. ఊహించని ఖర్చులు వచ్చిన సమయంలో మనకు ఎంతో ఉపయోగపడుతుంది. ఫిక్స్డ్ డిపాజిట్లు, పొదుపు ఖాతాలు, లిక్విడ్ మ్యూచువల్ ఫండ్లలో వీటిని ఉంచుకోవాలి. మూడు, నాలుగు నెలలకు ఉపయోగపడేలా ఈ నిధి ఉండాలి.
5. దీర్ఘకాలిక పెట్టుబడులపై ప్రధానంగా దృష్టి పెట్టాలి. ఇష్టానుసారంగా ఖర్చు పెట్టే విధానాన్ని విడనాడాలి. జాబ్ లో ఎంటర్ అయినప్పటి నుంచే ఆర్థిక ప్రణాళిక ఒకటి రూపొందించుకోవాలి. ఉద్యోగ విరమణ వరకు ఇలా చేస్తేనే ఆ తర్వాతి జీవితం బాగుంటుంది. ఇక అప్పులతో జాగ్రత్తగా ఉండండి. వ్యక్తిగత రుణాలు తీసుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించడం మంచిది. రుణభారం సాధ్యమైనంత తక్కువగా ఉండడమే మంచిది. ఇది మన వేతనంలో 30 శాతానికి మించకూడదు. పాత అప్పులను తీర్చేందుకు కొత్త అప్పులు. ఇలా పెంచుకుంటూ పోతే ఇక పొదుపు అసాధ్యం. ఇక జీవితభీమా, టర్మ్ ప్లాన్ తీసుకోవడం మర్చిపోవద్దు. మనపై ఆధారపడి ఉన్న వారికి మన తర్వాత ఇది ఒక ఉపశమనం. కనీసం రూ. 5 లక్షల ఆరోగ్య బీమాను తీసుకోవడం ద్వారా వైద్యానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవచ్చు. క్రమశిక్షణతో కూడిన ఆర్థిక ప్రణాళిక మన భావిజీవితానికి ఎంతో ఉపయోగపడుతుంది. భవిష్యత్ లో మనకు ఒక భరోసాను చూపుతుంది. ఆస్థుల సృష్టి లేకుండా చేసే అప్పులు అతి పెద్ద అనర్థదాయకం. ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా నష్టభయం లేని పథకాలు, పెట్టుబడులపై దృష్టి పెడితే లాభాలు ఎక్కువ. అందుకే ప్రతి ఒక్కరూ ఆర్థిక క్రమశిక్షణ అలవాటు చేసుకోవాలి. అందుకే ఈ చిట్కాలు తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరూ కొన్నైనా పాటిస్తే భవిష్యత్ లో వచ్చే ఖర్చులకు కొంత ఉపయోగకరంగా ఉంటుంది.