New Zealand : ప్రపంచలోని పలు దేశాలు వీసా నిబంధనలు సవరిస్తున్నాయి. మొదట అగ్రరాజ్యం అమెరికా ఈ నిబంధనలు మార్చింది. ఆ తర్వాత యూకే కూడా విసా నిబంధనలు మార్చకపోయినా.. తమ దేశానికి వచ్చే విదేశీయులు చూపాల్సిన డిపాజిట్ లిమిట్ 14 శాతం పెంచింది. ఇక తాజాగా న్యూజిలాండ్ కూడా అమెరికా బాటలో వీసా నిబంధనలు మార్చింది. ఎంప్లాయర్ వర్క్ వీసా, స్పెసిఫిక్ పర్పస్ వర్క్ వీసా పాత్రల కోసం వేతన పరిమితులను తొలగించడం, వలసదారులకు అనుబవ అవసరాన్ని తగ్గించడంతోపాటు కార్మికుల కోసం కొత్త మార్గాలను పరిచయం చేయడం వంటివి ఉన్నాయి.
నిబంధనల్లో మార్పులు
ఎంప్లాయర్ వర్క్ వీసా హోల్డర్లు తమ పిల్లలను న్యూజిలాండ్‌కు తీసుకురావాలనుకుంటే వారు ఏడాదికి సుమారు రూ.25 లక్షల కన్నా ఎక్కువ సంపాదించాలి. ఈ ఆదాయ పరిమితి 2019 నుంచి మారలేదు. వలస వచ్చిన కుటుంబాలు ఆర్థికంఆ బాగా జీవించడానికి ఈ నిబంధన ప్రవేశపెట్టారు. ఇక దేశంలో కార్మికుల కొరత తగ్గించడానికి, వలసదారుల వర్క్ ఎక్స్‌పీరియన్స్‌ను 3 ఏళ్ల నుంచి 2 ఏళ్లకు తగ్గించారు. కొత్త రూల్ మరింత మంది ఉద్యోగా కోసం న్యూజిలాండ్ వెళల్డానికి సాయపడుతుంది.
రెండు కొత్త రూరల్స్..
న్యూజిలాండ్ కాలానుగుణ కార్మికుల కోసం రెండు కొత్త మార్గాలను ప్రవేశపెట్టింది. ఎక్స్‌పీరియన్స్ కలిగిన కార్మికులకు మల్టీ – ఎంట్రీ వీసా మూడేళ్లపాటు అందుబాటులో ఉంటుంది. అయితే తక్కువ నైపుణ్యం కలిగిన కార్మికులకు ఏడు నెలలపాటు సింగిల్ ఎంట్రీ వీసా అందుబాటులో ఉంటుంది. ఇక ఆస్ట్రేలియన్ – న్యూజిలాండ్ స్టాండర్డ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఆక్యుపేషన్స్ స్కిల్ లెవల్స్ 4 లేదా 5 కింద పరిగణించే ఉద్యోగాలు పొందడానికి ఉద్యోగులు రెండేళ్ల మందు వీసా నుంచి మూడేళ్ల వర్క్ వీసాను పొందుతారు. ప్రస్తుతం ఈ ఉద్యోగాల్లో ఉన్నవారు మరో ఏడాది పొడిగింపు కోసం దరఖాస్తు చేఐసుకోవచ్చు. ఇక 2025, ఏప్రిల్ నుంచి ఏదైనా ఇతర పని లేదా స్టూండెంట్ వీసాల నుంచి ఏఈడబ్ల్యూవీకి రావాలనుకుంటే వారికి మధ్యంతర ఉద్యోగ హక్కులు ఇవ్వబడతాయి. ఉపాధిలో ఉండేందుకు తమ కొత్త వీసాల ఆమోదం కోసం ఎదురు చూస్తున్న వలసదారులకు ఇది ఉపయోగపడుతుంది.