https://oktelugu.com/

Game changer Movie  : విడుదలకు ముందే 450 కోట్ల రూపాయిలు..’దేవర’ కి రెండింతలు ఎక్కువ..’గేమ్ చేంజర్’ చిత్రానికి పెద్ద సవాల్!

'గేమ్ చేంజర్' చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే అక్షరాలా 450 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రావాలి. సినిమాకి టాక్ వస్తే మొదటి వారం లోనే బ్రేక్ ఈవెన్ అవుతుందని బలమైన నమ్మకం తో ఉన్నారు. ముఖ్యంగా తమిళనాడు మార్కెట్ ఈ చిత్రానికి పెద్ద జాక్పాట్ గా నిలవనుంది

Written By:
  • Vicky
  • , Updated On : January 5, 2025 / 07:00 PM IST

    Game changer Movie 

    Follow us on

    Game changer Movie  : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ చిత్రం మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ ఏ మేరకు జరిగింది?, బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే ఎంత వసూళ్లను రాబట్టాలి?, తెలుగు వెర్షన్ కాకుండా ఇతర భాషల్లో లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీస్ తో పోలిస్తే ‘గేమ్ చేంజర్’ పరిస్థితి ఏమిటి అనేది క్లుప్తంగా ఈ స్టోరీ లో చూద్దాము. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం, ఈ చిత్రానికి ‘పుష్ప 2 ‘ తర్వాత అత్యధిక బిజినెస్ జరిగిందని అంటున్నారు. ‘పుష్ప 2 ‘ చిత్రానికి బ్రేక్ ఈవెన్ అందుకోవాలంటే మినిమం వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టాలి అనే టార్గెట్ ఉండేది. మొదటి వారం లోనే ఆ చిత్రం వెయ్యి కోట్ల రూపాయిల టార్గెట్ ని అందుకొని సంచలనం సృష్టించింది.

    ఇప్పుడు ‘గేమ్ చేంజర్’ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే అక్షరాలా 450 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రావాలి. సినిమాకి టాక్ వస్తే మొదటి వారం లోనే బ్రేక్ ఈవెన్ అవుతుందని బలమైన నమ్మకం తో ఉన్నారు. ముఖ్యంగా తమిళనాడు మార్కెట్ ఈ చిత్రానికి పెద్ద జాక్పాట్ గా నిలవనుంది. ఎందుకంటే అక్కడి ఆడియన్స్ కి ఈ సంక్రాంతికి ‘గేమ్ చేంజర్’ చిత్రం తప్ప మరో ఛాయస్ లేదు. 10 వ తారీఖు నుండి వరుసగా పది రోజుల పాటు సెలవలు ఉన్నాయి. శంకర్ కి అక్కడ స్టార్ హీరో రేంజ్ బ్రాండ్ ఉంది. టాక్ వస్తే కేవలం ఆ ప్రాంతం నుండే 100 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వస్తుందని అంటున్నారు అక్కడి ట్రేడ్ పండితులు. హిందీ లో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కెట్ ని అందుకోవాలంటే కచ్చితంగా వంద కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టాలి.

    హిందీ ఆడియన్స్ కి కూడా ఈ సంక్రాంతికి ‘గేమ్ చేంజర్’ ఒక్కటే ఛాయస్. కానీ అక్కడి ఆడియన్స్ అంత తేలికగా థియేటర్స్ కి కదలరు. వాళ్ళు ఎప్పుడు ఏ సినిమాకి ఎలా కనెక్ట్ అవుతారో ఎవ్వరూ చెప్పలేరు. కానీ అక్కడి ఆడియన్స్ కనెక్ట్ అయితే మాత్రం వసూళ్లు ఆకాశమే హద్దు అనే రేంజ్ లో ఉంటాయి. ఇలా మూడు భాషల్లో ఈ చిత్రానికి మంచి పొటెన్షియల్ ఉంది. టాక్ వస్తే కచ్చితంగా వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టేంత స్టామినా ఈ చిత్రానికి ఉంది.  సెన్సార్ రిపోర్ట్స్ అయితే బ్లాస్టింగ్ రేంజ్ లోనే ఉన్నాయి. ఆడియన్స్ వైపు నుండి కూడా అలాంటి రెస్పాన్స్ వస్తుందో లేదో చూడాలి. ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రానికి ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా 350 కోట్ల రూపాయలకు జరిగింది. ఫుల్ రన్ లో 400 కోట్ల వరకు రాబట్టింది. ‘గేమ్ చేంజర్’ పరిస్థితి ఎలా ఉండబోతుందో చూద్దాం.

    Tags