https://oktelugu.com/

New York: ఆకాశంలో తృటిలో తప్పిన యాక్సిడెంట్‌.. అదే జరిగి ఉంటే.. తీవ్ర నష్టం!

ఒక విమానం ల్యాండింగ్‌ వస్తుండగా మరో విమానం టేకాఫ్‌ అయింది. ఈ సమయంలో రెండు విమానాలు ఒకానొక సమయంలో చాలా దగ్గరగా వచ్చాయి. రెప్పపాటులో రెండు విమానాలు ఢీకొట్టుకునేంత పనైంది. ఫ్లైట్‌ రాడార్‌–24 వెబ్సైట్‌ ప్రకారం, విమానాలు ఒకదానికొకటి నిలువుగా 700–1,000 అడుగుల దూరంలోకి వచ్చాయి. ఈ సమయంలో డెల్టా విమానంలో 76 మంది ప్రయాణికులు ఉండగా, అమెరికన్‌ ఎయిర్లైన్స్‌ విమానంలో 75 మంది ఉన్నారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : July 12, 2024 / 12:15 PM IST

    New York

    Follow us on

    New York: యాక్సిడెంట్లు అంటే మనం సాధారణంగా రోడ్లపై మాత్రమే జరుగుతాయని అనుకుంటాం. చాలా మందికి కూడా ఇదే తెలుసు కానీ టెక్నాలజీ పెరగడంతో మానవుడు రోడ్డు మార్గాలతోపాటు జల, వాయు మార్గాలను కూడా కనుగొన్నాడు. ఒకప్పుడు ఈ మార్గాలు అంతగా రద్దీగా ఉండేవి కావు. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం, పోటీ తత్వంతో వేగవంతమైన జీవనం తప్పనిసరి అవుతోంది. దీంతో వాయు మార్గాల్లో ప్రయాణించే వారి సంఖ్య పెరుగుతోంది. మరోవైపు ప్రపంచ దేశాలు తమ రక్షణ నిమిత్తం విమానాలు, హెలిక్యాప్టర్లు సిద్ధంగా ఉంచుతున్నాయి. గస్తీ నిర్వహిస్తున్నాయి. ఇక ప్రయాణికులను తీసుకెళ్లే విమానాలూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వాయు మార్గంలో రద్దీ పెరుగుతోంది. దీంతో ఆ మార్గాల్లో కూడా యాక్సిడెంట్లు పెరుగుతున్నాయి. ఈ ఏడాదే ఇప్పటి వరకు వాయు మార్గాల్లో మూడు యాక్సిడెంట్లు జరిగాయి. హెలిక్యాప్టర్లు ఢీకాన్నాయి. తాజాగా గాలిలో విమాన ప్రమాదం తృటిలో తప్పింది.

    రెండు విమానాలకు ఒకేసారి అనుమతి..
    తాజాగా న్యూయార్క్‌లోని సిరక్యూస్‌ హాన్కాక్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోట్లు సమీపంలో జూలై 8న తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. ప్రధాన వాణిజ్య విమానయాన సంస్థలకు చెందిన రెండు విమానాలు ఢీకొనబోయాయి. ఎయిర్‌పోర్టులో కంట్రోలర్లు మొదట అమెఇరకన్‌ ఈగిల్‌ ఫ్లైట్‌ ఏఏ5511, పీఎస్‌ఏ ఎయిర్‌లైన్స్‌ నిర్వహిస్తున్న బొంబార్డియర్‌ సీఆర్‌జే–700ను రన్వే 28లో ల్యాండ్‌ చేయడానికి క్లియర్‌ చేశారు. కొద్దిసేపటి తర్వాత వారు డెల్టా కనెక్షన్‌ డీఎల్‌ 5421, ఎండీవర్‌ ఎయిర్‌ నిర్వహిస్తున్న మరో సీఆర్‌జే–700కి అదే రన్‌వే నుంచి బయలుదేరడానికి అనుమతి ఇచ్చారు.

    ఆకాశంలో చాలా దగ్గరగా..
    ఒక విమానం ల్యాండింగ్‌ వస్తుండగా మరో విమానం టేకాఫ్‌ అయింది. ఈ సమయంలో రెండు విమానాలు ఒకానొక సమయంలో చాలా దగ్గరగా వచ్చాయి. రెప్పపాటులో రెండు విమానాలు ఢీకొట్టుకునేంత పనైంది. ఫ్లైట్‌ రాడార్‌–24 వెబ్సైట్‌ ప్రకారం, విమానాలు ఒకదానికొకటి నిలువుగా 700–1,000 అడుగుల దూరంలోకి వచ్చాయి. ఈ సమయంలో డెల్టా విమానంలో 76 మంది ప్రయాణికులు ఉండగా, అమెరికన్‌ ఎయిర్లైన్స్‌ విమానంలో 75 మంది ఉన్నారు. అదృష్టవశాత్తూ ప్రమాదం జరగకపోవడం ప్రయాణికులు క్షేమంగా ఉన్నారు.

    గతంలో ఎయిర్‌ యాక్సిడెంట్లు..
    – ఇదిలా ఉంటే అమెరికాలోనే గతంలో ఎయిర్‌ యాక్సిడెంట్లు జరిగాయి. 2020లో అమెరికాలోని ఇదాహో రాష్ట్రంలో రెండు విమానాలు గాల్లో ఢీకొన్నాయి. తర్వా త కోయర్‌ డీ అలేన్‌ సరస్సులో కూలిపోయాయి. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు మృతిచెందారు. సరస్సులో మునిగిపోయిన విమాన శకలాలను సోనార్‌ సాయంతో గుర్తించారు.

    యుద్ధ విమానాలు..
    ఇక 2019లో రష్యాకు చెందిన ఎస్‌యూ–34 యుద్ధ విమానాలు గాల్లో శిక్షణ పొందుతుండగా ఢీకొన్నాయి. ఈ ఘటన జపాన్‌ సముద్ర తీర ప్రాంతంలో జరిగింది. అయితే ప్రమాదం జరిగిన వెంటనే పైలెట్లు కిందకు దూకేశారు. సముద్రంలో పడిన ఓ పైలెట్‌ ఓ చెక్కను పట్టుకుని సాయం కోసం ఎదురు చూశాడు.

    – 2022లో కూడా అమెరికా టెక్సాస్‌లోని డల్లాస్‌లో రెండు విమానాలు ఢీకాన్నాయి. బీ 17 బాంబర్‌ యుద్ధ విమానం, పీ–63 కింగ్‌ కోబ్రా యుద్ధ విమానం ఢీకొన్నాయి. అయితే బోయింగ్‌ విమానం ప్రయాణిస్తుండగా మార్గం తప్పి కోబ్రా యుద్ధ విమానం వచ్చి ఢీకొట్టింది. దీంతో పెద్ద శబ్దంతో విమానాలు నేలపై కూలాయి.

    విమానాన్ని ఢీకొట్టిన పక్షి..
    ఇక గతేడాది అమెరికాకు చెందిన ఓ విమానాన్ని గాల్లోనే పక్షి ఢీకొట్టింది. బోయింగ్‌ 737 విమానం గాల్లో ఎగురుతుండగా ఒక్కసారిగా ఆ విమానాన్ని పక్షి ఢీకొట్టింది. దీంతో విమానం ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. ఈ విషయం గమనించిన పైలెట్లు ఓహియోలోని జాన్‌గ్లెన్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్‌ చేశారు. అయితే తృటిలో ప్రమాదం తప్పడంలో అంతా ఊపిరి పీల్చుకున్నారు.