Viral Video : మనదేశంలోనే కాదు ప్రపంచ దేశాలలోనూ వివాహం కాని వాళ్లు పెరిగిపోతున్నారు. తమదైన జోడి కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. అయినప్పటికీ వారికి తగ్గట్టు జోడు దొరకకపోవడంతో అలానే జీవితాన్ని సాగిస్తున్నారు. తద్వారా ప్రపంచ వ్యాప్తంగా సంతానోత్పత్తి రేటు పడిపోతుంది. ఐతే ఉగాండా దేశానికి చెందిన ముస అసహ్య కసెరా పరిస్థితి ఇందుకు పూర్తి విభిన్నం. అతడు ఏకంగా 12 మందిని పెళ్లి చేసుకున్నాడు. 102 మంది పిల్లలను కన్నాడు. కసెరా పిల్లలు 578 మందిని కన్నారు. వాళ్ల పేర్లను గుర్తుపెట్టుకోవడానికి కసెరా ఏకంగా రిజిస్టర్ ఏర్పాటు చేసుకున్నాడు. ముస అసహ్య కసెరా ది తూర్పు ఉగాండాలోని ముకిజా అనే గ్రామం. ఇతడికి 17 సంవత్సరాల వయసులోనే తొలి పెళ్లి జరిగింది. ఆమె ద్వారా 8 మంది సంతానం కలిగారు. 20 సంవత్సరాల వయసులో మరో పెళ్లి చేసుకున్నాడు. ఆమె ద్వారా కూడా సంతానం కలిగి. ఇక తర్వాత వరుసగా పెళ్లిళ్లు చేసుకుంటూ వెళ్ళాడు. ఇలా మొత్తం 12 మందిని వివాహం చేసుకున్నాడు. వారి ద్వారా మొత్తం 102 మంది పిల్లల్ని కన్నాడు. ఆ 102 మందికి వివాహాలు చేశాడు. వారు కూడా తమ భాగస్వాముల ద్వారా మొత్తం 578 మంది పిల్లల్ని కన్నారు. మొత్తంగా చూస్తే ఒక గ్రామానికి సరిపోయే జనాభాను మొత్తం ముస అసహ్య కసెరా, అతని పిల్లలు కన్నారు.
జీవనోపాధి ఎలాగంటే..
ఉగాండా అనేది ఆఫ్రికాలోని ఒక పేద దేశం. తూర్పు ఉగాండా దట్టమైన అటవీ ప్రాంతానికి పేరు పొందింది. ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి ఎక్కడెక్కడ నుంచో పర్యాటకులు వస్తుంటారు. వారికి టూరిస్ట్ గైడ్ లుగా ముస అసహ్య కసెరా కుటుంబ సభ్యులు వ్యవహరిస్తుంటారు. వీరు సామూహికంగా వేటకు వెళ్తుంటారు. గ్రామంలో చిన్నచిన్న పనులు చేస్తుంటారు. అటవీని చదును చేసి వ్యవసాయం చేస్తుంటారు. అయితే వీరు ఉండేది మామూలు గృహాలలోనే. ఇప్పటికీ దిగువ మధ్యతరగతి జీవితాన్ని గడుపుతుంటారు. అయితే చదువు విలువ తెలియడంతో..ముస అసహ్య కసెరా తన మనవళ్లను పాఠశాలలకు పంపిస్తున్నాడు. వీరికోసమే ఉగాండా ప్రభుత్వం గ్రామంలో ఒక పాఠశాలను నిర్వహిస్తోంది. ముస అసహ్య కసెరా సంతానం భారీగా ఉండడంతో.. ఇతడికి తూర్పు ఉగాండాలో ప్రత్యేక గౌరవం లభిస్తుంది. మరోవైపు ముస అసహ్య కసెరా మాత్రమే కాకుండా, చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలామంది బహు భార్యత్వాన్ని కొనసాగిస్తున్నారు. అయితే వారికి ముస అసహ్య కసెరా స్థాయిలో మాత్రం పిల్లలు లేరు. ముస అసహ్య కసెరా మద్యం తాగడు. ఇతర దురలవాట్లు లేవు. అతని కుటుంబ సభ్యులకు కూడా ఎటువంటి చెడు అలవాట్లు లేవు. అందువల్లే వారు ఆరోగ్యంగా ఉన్నారు. అంతమంది పిల్లలకు జన్మనిచ్చినప్పటికీ ముస అసహ్య కసెరా, అతని భార్యలు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు. ఇంతమంది జన్మించినప్పటికీ.. ఒకరు కూడా పౌష్టికాహార లోపంతో చనిపోలేదని ముస అసహ్య కసెరా గర్వంగా చెబుతుంటాడు.
ప్రపంచ దేశాలలో సంతానోత్పత్తి రేటు పడిపోతున్నది. అయితే ఉగాండా దేశానికి చెందిన ముస అసహ్య కసెరా ఏకంగా 12 మందిని పెళ్లి చేసుకున్నాడు. 102 మంది పిల్లలను కన్నాడు. కసెరా పిల్లలు 578 మందిని కన్నారు. వాళ్ల పేర్లను గుర్తుపెట్టుకోవడానికి కసెరా ఏకంగా రిజిస్టర్ ఏర్పాటు చేసుకున్నాడు. #Uganda pic.twitter.com/3aHs2sjxIb
— Anabothula Bhaskar (@AnabothulaB) December 26, 2024