Rapidan Dam: బద్దలైన డ్యామ్.. విరుచుకుపడ్డ వరద.. షేకింగ్ వీడియో వైరల్

మిన్నెసోటాలో బ్లూఎర్త్ కౌంటీలోని ది ర్యాపిడాన్ డ్యామ్ వరద తీవ్రతకు బద్దలైంది. దీంతో అప్రమత్తమైన అధికారులు సమీప ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Written By: Raj Shekar, Updated On : June 25, 2024 5:58 pm

Rapidan Dam

Follow us on

Rapidan Dam: అగ్రరాజ్యం అమెరికాపై ప్రకృతి కన్నెర్రజేసింది. ఒకవైపు అడవులను కార్చిచ్చు దహించివేస్తోంది. మరోవైపు వరదలు పట్టణాలను మంచేస్తున్నాయి. తాజాగా భారీ వర్షాలు, వరదలకు ఓ డ్యామ్‌ బద్దలైంది. వరద జనావాసాలను ముంచెత్తింది. వర్షాలు వరదలకు ఐయోవా, సౌత్‌ డకోటా, మిన్నెసోటా, నెబ్రోస్కా రాష్ట్రాల్లో 30 లక్షల మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

బద్దలైన ది ర్యాపిడాన్‌ డ్యామ్‌..
ఇక మిన్నెసోటాలో బ్లూఎర్త్ కౌంటీలోని ది ర్యాపిడాన్ డ్యామ్ వరద తీవ్రతకు బద్దలైంది. దీంతో అప్రమత్తమైన అధికారులు సమీప ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ ఘటనలో డ్యామ్ కొంత దెబ్బతిన్నట్లు అధికారులు చెబుతున్నారు. డ్యాం నుంచి వస్తున్న వరదతో దక్షిణ మిన్నెసోటా ప్రాంతం ఇప్పటికీ వరదలోనే ఉంది.

అతలాకుతలం..
మరోవైపు వరదలతో ఈ వారాంతంలో ఐయోవాలో వచ్చిన వరదలకు ఓ వ్యక్తి కొట్టుకుపోయాడు. 11 వేల మందికిపైగా నివసించే స్పెన్సర్ నగరం, క్లే కౌంటీలకు వరదల కారణంగా ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. 383 మందిని వరదల నుంచి కాపాడారు. సియోక్స్ నగరానికి చెందిన ఫైర్ మార్షల్ ఈ వరదను తాము ఊహించలేకపోయినట్లు అధికారులు వెల్లడించారు. ఇక్కడ ఒక రైల్ రోడ్ వంతెన వరద ఉధృతికి కుప్పకూలిపోయింది. ఈ వంతెన ఐయోవా – దక్షిణ డకోటాలోని ప్రాంతాలను కలుపుతుంది.

19933 నాటి భయానక పరిస్థితి..
ఇలాంటి వరదలు 1993లో వచ్చినట్లు అధికారులు, ప్రజలు చెబుతున్నారు. నాటి భయానక పరిస్థితులను తాజా వరదలు గుర్తు చేస్తున్నాయని ఐయోవా గవర్నర్ కిమ్ రేనోల్డ్స్ తెలిపారు. భారీ వర్షాలు, ముంచెత్తుతున్న వరదల కారణంగా ఇక్కడ ప్రధాన వ్యాపారాలు మూతపడ్డాయని పేర్కొన్నారు. వరద ముప్పు నేపథ్యంలో ఆస్పత్రులను ఖాళీ చేయించినట్లు వెల్లడించారు. ఈ వారం మొదట్లో నీటి ప్రవాహ తీవ్రత ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

భారీ వర్షాలతో..
సియోక్స్ ప్రాంతంలో భారీ వర్షాలు కురిశాయి. ఇక్కడి విమానాశ్రయంలో ఏడు సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. ఇక ఐయోవాలోని రాక్ ర్యాపిడ్స్ ప్రాంతంలో 11 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇటీవల కాలంలో కురిసిన విడతల వారీగా భారీ కుండపోతలతో ఈ పరిస్థితి తలెత్తినట్లు జోసెఫ్ అనే వాతావరణ నిపుణుడు పేర్కొన్నాడు. ఇప్పటికే నేల పూర్తిగా తేమతో నిండిపోవడంతో భూమిలోకి నీరు ఇంకడం లేదని వెల్లడించారు. దీంతో వరద పెరుగుతోందని తెలిపారు.