Keeravani: రాజమౌళితో సినిమా చేయాలని ప్రతి హీరో అనుకుంటారు. కానీ ఈ అవకాశం దక్కేది చాలా తక్కువ హీరోలకు మాత్రమే. ఇక ఈ సారి మహేష్ బాబు వంతు వచ్చింది. ఈ ఇద్దరి కాంబోనేషన్ లో సినిమా రాబోతుందంటే జక్కన్న, మహేష్ ఇద్దరి అభిమానులు కూడా ఫుల్ జోష్ లో ఉన్నారు. రీసెంట్ గా మహేష్ బాబు గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. దీనికి త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు. కానీ ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.
ఈ సినిమా ఆశించిన ఫలితాలను దక్కించుకోలేదు కాబట్టి మహేష్ బాబు ఫ్యాన్స్ తెగ ఆందోళన చెందారు. కానీ ఆర్ఆర్ఆర్ వంటి సినిమాతో ప్రపంచమంతటా తెలుగు సినిమా సత్తాను చాటిన జక్కన్నతో మహేష్ బాబు సినిమా చేస్తున్నారని తెలిసి ఇప్పుడు ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు అభిమానులు. ఈ సినిమాను రాజమౌళి ఎలా తెరకెక్కిస్తారు. ? మహేష్ ఈ సినిమాలో ఎలా కనిపిస్తారు. హీరోయిన్ ఎలా ఉంటుంది? అని అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి మహేష్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
లాంగ్ హెయిర్ తో హాలీవుడ్ హీరోలా కనిపిస్తున్నారు హీరో. అలాగే ఈ సినిమా ఆఫ్రికన్ ఫారెస్ట్ నేపథ్యంలో ఉంటుందని జక్కన్న తండ్రి, రైటర్ విజయేంద్ర ప్రసాద్ హింట్ ఇచ్చారు. కాగా మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా మహేష్ బాబు, రాజమౌళి సినిమా నుంచి అప్డేట్ వస్తుందని ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఆగస్టు 9న మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ఎస్ఎస్ఎంబీ 29 నుంచి అప్డేట్ వస్తుందని ఇగర్ గా వెయిట్ చేస్తున్నారు.
రీసెంట్ గా మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి మహేష్ అభిమానులకు ఓ షాకింగ్ విషయం చెప్పారు. ఆయన మాట్లాడుతూ.. మహేష్ బాబు , రాజమౌళి సినిమా కథ ఇంకా లాక్ అవ్వలేదని.. ఈ సినిమా కోసం ఆయన ఇంకాపని మొదలుపెట్టలేదని తెలిపారు. ఇంకా కథ ఫైనల్ అవ్వలేదని కూడా అన్నారు. ఈ వారంలో కథ లాక్ అవుతుందని..కొన్ని టెస్ట్ షూట్స్ జరుగుతున్నాయని పేర్కొన్నారు కీరవాణి. కథ ఫైనల్ అయితే జులై లేదా ఆగస్టు లు పని మొదలు పెడతామని అన్నారు. అంటే మహేష్ బాబు పుట్టిన రోజుకు ఎలాంటి అప్డేట్ ఉండదన్నట్టే. ఇక ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది చివరిలో కానీ.. వచ్చే ఏడాది ప్రారంభంలో కానీ మొదలు అవుతుంది కావచ్చు. మొత్తం మీద సినిమా మాత్రం భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. మరి ఈ కాంబో ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటుందో చూడాలి.