https://oktelugu.com/

Mileage King This Maruti Car: మైలేజ్ కింగ్ ఈ మారుతి కారు.. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి బెస్ట్ ఆప్షన్..

ఆటోమోబైల్ మార్కెట్లో మైలేజ్ కార్లకు ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. కార్ల కొనుగోలు శక్తి మిడిల్ క్లాస్ నుంచే ఎక్కువగా ఉంటుంది. వీరు ఎక్కువగా అధిక మైలేజ్ కార్ల వైపే చూస్తారు. ఈ నేపథ్యంలో కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా మైలేజ్ పైనే దృష్టి పెడుతాయి. ఇప్పటికే మార్కెట్లో మైలేజ్ కార్లు అధికంగానే ఉన్నాయి.

Written By:
  • Srinivas
  • , Updated On : November 4, 2024 / 11:47 AM IST

    Maruthi-Suzuki

    Follow us on

    Mileage King This Maruti Car: ఆటోమోబైల్ మార్కెట్లో మైలేజ్ కార్లకు ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. కార్ల కొనుగోలు శక్తి మిడిల్ క్లాస్ నుంచే ఎక్కువగా ఉంటుంది. వీరు ఎక్కువగా అధిక మైలేజ్ కార్ల వైపే చూస్తారు. ఈ నేపథ్యంలో కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా మైలేజ్ పైనే దృష్టి పెడుతాయి. ఇప్పటికే మార్కెట్లో మైలేజ్ కార్లు అధికంగానే ఉన్నాయి. కానీ ఓ కంపెనీకి చెందిన కారు మాత్రం ఎవర్ గ్రీన్ అన్నట్లుగా ఉంది. మిగతా వాటికి గట్టి పోటీఇస్తూ అత్యధిక మైలేజ్ తో ఆకట్టుకుంటోంది. అయితే ఇది ఓ వైపు మైలేజ్ ఇస్తూ.. మరోవైపు తక్కువ ధరకు అందుబాటులో ఉంది. మరి ఆ కారు గురించి తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ వివరాల్లోకి వెళ్లండి..

    దేశంలో మారుతి కార్లకు ఎప్పటికీ డిమాండ్ ఉంటోంది. సామాన్యులకు అందుబాటులో ఉంటున్న ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయిన కొన్ని కార్లు దశాబ్దాలుగా సేల్స్ ను నమోదు చేసుకుంటున్నాయి. వీటిలో హ్యాచ్ బ్యాక్ తో పాటు ప్రీమియం కార్లు కూడా ఉన్నాయి. కానీ హ్యాచ్ బ్యాక్ కార్లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. మారుతి నుంచి మార్కెట్లోకి వచ్చిన వ్యాగన్ ఆర్, స్విప్ట్ కార్లు ఎవర్ గ్రీన్ గా నిలిచాయి. వీటితో పాటు మరో కారు కూడా అధిక మైలేజ్ ఇస్తూ ఆకట్టుకుంటోంది. అదే Maruthi Celerio.

    పదేళ్ల కిందట Maruthi Celerio మార్కెట్లోకి వచ్చింది. మొదట్లో ఈ కారును ఎవరూ పట్టించుకోలేరు. కానీ మైలెజ్ కోసం చూసిన వారికి ఇది బెస్ట్ ఆప్షన్ గా నిలిచింది. అంతేకాకుండా లో బడ్జెట్ లో అందుబాటులో ఉండడంతో దీనికి డిమాండ్ పెరుగూతూ వస్తోంది. మారుతి సెలెరియో 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలదు. దీనిపై 66 బీహెచ్ పీ పవర్ తో పాటు 89 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్ తో పాటు సీఎన్ జీ వెర్షన్ లో కూడా అందుబాటులో ఉండే ఈ కారు లో బెస్ట్ ఫీచర్స్ కూడా ఉన్నాయి.

    సెలెరియాలో స్మార్ట్ ప్లే టచ్ స్క్రీన్ ఇన్పోటైన్మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ తో పాటు ఫుష్ స్మార్ట్, స్టాప్ బటర్ ఫీచర్ కూడా ఉంది. ఇటీవలె దీని బాహ్య డిజైన్ ను మార్చేశారు. సేఫ్టీ కోసం ఎయిర్ బ్యాగ్స్, ఫ్రంట్ సీట్ ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్స్, హిల్ హోల్డ్ అసిస్ట్, సీట్ బెల్ట్ రిమైండర్, ఏబీఎస్ విత్ ఇబీడీ, రివర్స్ పార్కింగ్ సెన్సార్ వంటి ఫీచర్లు సౌకర్యవంతంగా ఉన్నాయి. సౌకర్యవంతమైన ప్రయాణం కోసం ఇవి అనుగుణంగా ఉండనున్నాయి.

    మారుతి సెలెరియో కారుకు డిమాండ్ పెరుగుతోంది. ఎందుకంటే ఇది లో బడ్జెట్ లో అందుబాటులో ఉంది. ప్రస్తుతం దీనిని రూ.5.36 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. ఇక మైలేజ్ విషయంలో ఇది రారాజుగా నిలుస్తోంది. ఈ కారు లీటర్ పెట్రోల్ కు 25.17 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తోంది. సీఎన్ జీ వేరియంట్ లో 34.43 కిలోమీటర్ల వరకు దూసుకెళ్తుంది. ప్రస్తుతం మార్కెట్లో అత్యధికంగా మైలేజ్ ఇచ్చే కారు ఇదే అని కొందరు కొనియాడుతున్నారు.