Homeఎంటర్టైన్మెంట్Thammudu Movie : దిల్ రాజు తమ్ముడు సినిమాపై నెగెటివిటీ ఎందుకింత స్ప్రెడ్ అయ్యింది?

Thammudu Movie : దిల్ రాజు తమ్ముడు సినిమాపై నెగెటివిటీ ఎందుకింత స్ప్రెడ్ అయ్యింది?

Thammudu Movie :స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు(DIL RAJU) బ్యానర్ లో తెరకెక్కిన తమ్ముడు నేడు థియేటర్స్ లోకి వచ్చింది. నితిన్(NITHIIN) హీరోగా దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కించిన తమ్ముడు(THAMMUDU) చిత్రంపై సోషల్ మీడియాలో విపరీతమైన నెగిటివిటీ నడుస్తుంది. నిజంగా సినిమాలో విషయం లేదా లేక కావాలనే నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారా? అనే చర్చ మొదలైంది.

గతంలో ఓ మూవీ టాక్ బయటకు రావడానికి కనీసం ఒకటి రెండు రోజులు పట్టేది. మౌత్ టాక్ ఆధారంగానే జనాలు ఒక సినిమాకు వెళ్లాలా లేదా? అనే నిర్ణయానికి వచ్చేవారు. సోషల్ మీడియా యుగంలో సమచారం వేగంగా చేరుతుంది. యుఎస్ లో ప్రీమియర్ షో పడగానే రివ్యూలు వచ్చేస్తున్నాయి. ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది? సెకండ్ హాఫ్ ఎలా ఉంది? ఓవరాల్ గా సినిమా పరిస్థితి ఏమిటో రివ్యూవర్స్ చెప్పేస్తున్నారు. ట్విట్టర్ ఎక్స్ కామెంట్స్, పోస్ట్స్ ఒక సినిమా ఫలితాన్ని డిసైడ్ చేస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. ప్రతి ఒక్కరు సోషల్ మీడియా వాడుతున్న క్రమంలో మెజారిటీ ఆడియన్స్ ఈ ఆధారంగానే సినిమాలకు వెళుతున్నారు.

Also Read: రాజమౌళి సక్సెస్ సీక్రెట్ వెనక ఉన్న రహస్యం ఇదేనా..?

ఈ క్రమంలో జెన్యూన్, ఫేక్ రివ్యూలు సోషల్ మీడియాలో దర్శనం ఇస్తాయి. ఒక సినిమాను పనిగట్టుకుని పతనం చేసే మాఫియా సైతం తయారైంది. దానికి తోడు యాంటీ ఫ్యాన్స్ ఉండనే ఉన్నారు. కొందరు సినిమా చూడకుండా కూడా అద్భుతం అని, మరికొందరు డిజాస్టర్ అని కామెంట్స్ పోస్ట్ చేస్తారు. పీఆర్ ల సహకారంతో బాగోని సినిమాకు పాజిటివ్ రివ్యూ కామెంట్స్ వేయించి, కనీసం ఓపెనింగ్స్ రాబట్టే ప్రయత్నం చేస్తారు. అదే పీఆర్ మాఫియా బాగున్న సినిమాను కూడా సాయంత్రానికి చంపేయగలదు.

కాగా ఈ మధ్య కాలంలో నిర్మాత దిల్ రాజు చిత్రాల మీద నెగిటివిటీ పెద్ద మొత్తంలో జరుగుతుందనే వాదన మొదలైంది. ఆయన బ్యానర్ లో నిర్మిస్తున్న చిత్రాలను కావాలనే తొక్కేస్తున్నారా? అనే సందేహాలు కలుగుతున్నాయి. ది ఫ్యామిలీ స్టార్ చిత్రాన్ని దారుణంగా ట్రోల్ చేయడంతో పాటు ఫస్ట్ షో పడగానే నెగిటివ్ కామెంట్స్ పెట్టారు. ఫ్యామిలీ స్టార్ సోషల్ మీడియా రివ్యూల మీద దిల్ రాజు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఫేక్ రివ్యూలతో తన సినిమాను చంపేశారంటూ ఆరోపణలు చేశారు. అసలు సినిమా విడుదలైన రెండు రోజుల వరకు రివ్యూలు ఇవ్వకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.

Also Read: చిరంజీవి తర్వాత తన స్థానాన్ని దక్కించుకునే హీరో ఎవరో క్లారిటీ వచ్చినట్టేనా..?

నిజానికి ఫ్యామిలీ స్టార్ ప్రచారం జరిగినంత వరస్ట్ మూవీ కాదు. దానికి డీసెంట్ రేటింగ్ ఇవ్వొచ్చు. డిజాస్టర్ రివ్యూలతో ఫ్యామిలీ స్టార్ ఓపెనింగ్స్ ని దెబ్బ తీశారు. తాజాగా దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కిన తమ్ముడు థియేటర్స్ లోకి వచ్చింది. సోషల్ మీడియాలో తమ్ముడు చిత్రానికి డిజాస్టర్ టాక్ వినిపిస్తుంది. అసలు సినిమాలో ఏం లేదు, స్కిప్ చేయండి అంటూ యూఎస్ రివ్యూవర్స్ కామెంట్స్ పోస్ట్ చేశారు. తమ్ముడు చిత్రాన్ని దిల్ రాజు నిర్మించడం వలనే ఆ స్థాయిలో నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారా? అయితే ఎందుకు అనే సందేహాలు కలుగుతున్నాయి.

దిల్ రాజు మీద పరిశ్రమ కూడా గుర్రుగా ఉంది. డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థపై ఆధిపత్యం సాగిస్తూ బడా హీరోలు, నిర్మాతలను కూడా దిల్ రాజు ఇబ్బంది పెట్టాడనే టాక్ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో మెజారిటీ థియేటర్స్ కలిగి ఉన్న దిల్ రాజు అనుమతి లేకుండా సినిమా విడుదల కాలేని పరిస్థితులు ఉన్నాయి. దానికి తోడు తాజాగా మెగా అభిమానులతో వైరం పెట్టుకున్నాడు. అన్నీ వెరసి తమ్ముడు చిత్రాన్ని సోషల్ మీడియాలో కొందరు టార్గెట్ చేశారనే వాదన వినిపిస్తుంది.

 

RELATED ARTICLES

Most Popular