Chicago: అమెరికాలోని చికాగోలోని ఒక నైట్‌క్లబ్ వెలుపల జరిగిన సామూహిక కాల్పుల ఘటనలో నలుగురు మరణించారు, 16 మంది గాయపడ్డారు. డ్రైవ్-బై కాల్పుల్లో అనేక మందిపై కాల్పులు జరిగాయని పోలీసులు తెలిపారు.ఆర్టిస్ లాంజ్ నైట్‌క్లబ్ వెలుపల రాపర్ మెల్లో బక్జ్ ఆల్బమ్ విడుదల పార్టీ తర్వాత ప్రజలు బయటకు వెళుతుండగా ఈ సంఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.