Mexican President Claudia: అందాన్ని చూడాలి.. ఆ తర్వాత మనదైన లోకానికి రావాలి.. అలాకాకుండా చూసిన అందం మొత్తం మన సొంతం కావాలని కోరుకోకూడదు. ఆ అందాన్ని ఆస్వాదించాలని భావించకూడదు.. ఈ భూలోకంలో పువ్వులు, అమ్మాయిలు అందానికి పర్యాయపదాలు.. పువ్వులంటే చూడొచ్చు.. వాటిని మరింత దగ్గరగా చూడాలంటే కోసుకోవచ్చు. కానీ అమ్మాయిలు అలా కాదు.. ఈ భూమండలంలో ఎంతోమంది అందమైన అమ్మాయిలు ఉన్నారు.. ఆ అందమైన అమ్మాయిలు మొత్తం మన సొంతం కావాలని అనుకోకూడదు.. అందమైన అమ్మాయిలను చూసినప్పుడు నిగ్రహాన్ని పాటించాలి.. ఆ తర్వాత మనదైన లోకంలోకి రావాలి.. అలాకాకుండా ఆ అందమైన అమ్మాయిలను సొంతం చేసుకోవాలని.. ఇంకా ఏదైనా చేయాలని అసలు అనుకోకూడదు..
ఒకవేళ అమ్మాయికి గనక ఇష్టమైతే.. ఆమె మన సాంగత్యాన్ని ఇష్టపడితే.. కచ్చితంగా వివాహం చేసుకొని.. ఆమెతో కలిసి జీవితాన్ని కొనసాగించవచ్చు. స్వర్గసుఖాలను ఆస్వాదించవచ్చు. అలాకాకుండా.. ఇలాంటి బంధాలతో పని లేకుండా అమ్మాయిల అందాన్ని ఆస్వాదించాలని కోరుకోవద్దు. కానీ ఓ వ్యక్తి మాత్రం ఓ అందమైన అమ్మాయిని చూశాడు. తట్టుకోలేక ఆ అందాన్ని ఆస్వాదించాలి అనుకున్నాడు.. చివరికి ఊహించని పరిణామాన్ని ఎదుర్కొన్నాడు..
అమెరికాకు దగ్గరగా ఉంటే మెక్సికో దేశాన్ని క్లాడియా పరిపాలిస్తున్నారు. ఈమె అత్యంత అందమైన మహిళ.. ఇటీవల క్లాడియా కు ఒక దారుణమైన అనుభవం ఎదురయింది. మెక్సికో దేశంలో ప్రజలను కలిసి ముచ్చటించడానికి క్లాడియా బయటికి వచ్చారు. క్లాడియ చుట్టూ పోలీసుల భద్రత ఉంది. అయినప్పటికీ అందమైన క్లాడియాను ముద్దు పెట్టుకోవాలని చూసాడు ఓ వ్యక్తి.. అతనితోనే అతడు ఆగలేదు.. ఆమె శరీరం మీద చేతులు వేసి అసభ్యకరంగా తాగడానికి ప్రయత్నించాడు.. అతడి వ్యవహార శైలి గమనించిన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే వెనక్కి పంపించేశారు. అప్పుడు కూడా అతడు ప్రెసిడెంట్ భుజం మీద చేతులు వేసి.. పిచ్చి పిచ్చి పనులు చేయడానికి ప్రయత్నించాడు.. దీంతో సెక్యూరిటీ సిబ్బంది మరింత గట్టిగా అతడిని వెనక్కి పంపించారు.. అతనిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. తమదైన శైలిలో అతడికి రాచ మర్యాదలు కల్పిస్తున్నారు.
ఈ ఘటన మెక్సికో దేశంలో సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో క్లాడియాకు సెక్యూరిటీని మరింత పెంచారు.. ఆమె ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు.. ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు ఎవరు కూడా తాకడానికి ప్రయత్నించకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.. అంతేకాదు అనుమతి ఉంటే తప్ప ఆమెను కలవడానికి అవకాశం ఇవ్వడం లేదు. అయితే క్లాడియ ను తాకడానికి ప్రయత్నించిన ఆ వ్యక్తికి మానసిక స్థితి సరిగ్గా లేదని తెలుస్తోంది.. పైగా అతడు ఆ సమయంలో మద్యం కూడా తాగి ఉన్నాడని పోలీసులు చెబుతున్నారు.
Crazy Incident in Mexico City
Man tries to kiss, touch Mexico President Claudia Sheinbaum during public greeting.#MustWatch pic.twitter.com/NDJR0p1bl0
— Sumit (@SumitHansd) November 5, 2025