33-year-old American YouTuber: పులి దేహం బలంగా ఉంటుంది. దాని మీద ఉన్న చారలు అందంగా ఉంటాయి.. ఆ దేహం మీద ఉన్న చారలే పులికి అందాన్ని తీసుకొస్తుంటాయి.. పులి అలా అందంగా ఉందని నక్క కూడా అలా చారలు ఉండాలని ఒంటిపై వాతలు పెట్టుకొందట. ఆ తర్వాత ఒళ్ళు మొత్తం వాచిపోయి చనిపోయిందట.. అందువల్లే ఒకరు చేసిన పనిని మనం చేయాలి అనుకోవద్దు.. అన్నిటికంటే ముఖ్యంగా సినిమా హీరోలు చేసిన పనిని అచ్చం అలానే చేయాలని భావించకూడదు.
సినిమా అనేది బలమైన దృశ్య మాధ్యమం. అందులో అనేక రకాల జిమ్మిక్కులు ఉంటాయి. మనం తెరమీద చూసేదంతా నిజం కాదు.. మనకు ఒక అందమైన ఊహ లోకాన్ని పరిచయం చేయడానికి సినీ నటులు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.. రకరకాల మాయలు చేస్తుంటారు.. అది నిజం అని మనం భ్రమిస్తే అంతకుమించిన మూర్ఖత్వం ఇంకొకటి ఉండదు.. కానీ కొంతమంది అలా ఊరుకోరు. పైగా తమ అభిమాన సినీ నటులు చేసిన పనిని అంతకంటే గొప్పగా చేయాలని భావిస్తుంటారు.. చివరికి ప్రాణాల మీదికి తెచ్చుకుంటారు.. అటువంటిదే ఈ మహిళ ఉదంతం కూడా.
ఆ మహిళది అమెరికా. పేరుపొందిన యూట్యూబర్ కూడా. వయసు 33 సంవత్సరాలు లాగా ఉంటుంది.. అయితే హాలీవుడ్ హీరో టామ్ క్రూజ్ నటించిన మిషన్ ఇంపాజిబుల్ అనే సినిమాలో ఒక డేంజరస్ స్టంట్ చేస్తాడు.. వేగంగా పరుగులు పెడుతున్న విమానం మీద ఎక్కి.. దాని డోర్ పట్టుకొని ప్రయాణిస్తుంటాడు.. చూసేందుకు ఆ సన్నివేశం అత్యంత భయానకంగా ఉంటుంది.. అయితే తను కూడా అలానే వ్యవహరించాలని ఆ మహిళ యూట్యూబర్ భావించింది.. సీ 130 అరె మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ డోర్ పట్టుకొని.. ప్రయాణించింది.. ఆమె ఆ డోర్ పట్టుకొని ఉన్నప్పుడు విమానం వేగం గంటకు 260 కిలోమీటర్లు.. అంతే వేగంతో 600 ఎత్తుకు ఎగిసింది. అంత వేగంలో కూడా ఆ మహిళ ఆవిమానం డోరును అలానే పట్టుకొని ఉంది.. వాస్తవానికి చావు చివరి అంచుదాక వెళ్లి ఉండేదే.. అయితే ఒక రోప్ సహాయంతో బతికి బట్ట కట్టింది. అయితే సోషల్ మీడియాలో సంచలనం సృష్టించడానికి తాను ఇలా ప్రయాణించిందని తెలుస్తోంది.. ఏది ఏమైనప్పటికీ ఆమె ఇలా డేంజరస్ స్టంట్ చేయడం కరెక్ట్ కాదని మెజారిటీ నెటిజన్లు పేర్కొంటున్నారు.
⚡️ American YouTuber (33 years old) recreates one of Tom Cruise’s most dangerous scenes from the Mission Impossible movie!
“Michelle Hary” flew aboard a Lockheed C-130 military aircraft, holding onto its door with just her hands!
The plane reached a speed of 260 km/h and… pic.twitter.com/xnjJwoisqs
— RussiaNews (@mog_russEN) November 4, 2025