Bigg Boss fame Sanjana: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ లో ఆడియన్స్ కి మొదటి వారం నుండి బాగా కనెక్ట్ అయిన వారిలో ఒకరు సంజన. నెగిటివ్ అభిప్రాయం తో మొదలై, గేమర్ సంజన అని అనిపించుకుంది. మొదటి రెండు వారాల్లో ఆమె క్రియేట్ చేసుకున్న ఫ్యాన్ బేస్ తోనే ఇన్ని వారాలు సేవ్ అవుతూ వస్తోంది. టాస్క్ ఆడే సమయం వచ్చినప్పుడు తన వైపు నుండి ఎంత ఇవ్వగలదో, అంత ఇస్తూ ముందుకు దూసుకెళ్తోంది. ఈ వారం కూడా నామినేషన్స్ లోకి వచ్చిన సంజన, డేంజర్ జోన్ లో ఉన్నప్పటికీ కూడా సేఫ్ అవుతుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు. ఇదంతా పక్కన పెడితే బిగ్ బాస్ హౌస్ లోకి రాకముందు సంజన ఒక సినీ నటి అనే సంగతి అందరికీ తెలిసిందే. ఈమె మన టాలీవుడ్ లోకి ‘బుజ్జిగాడు’ అనే చిత్రం ద్వారా వెండితెర అరంగేట్రం చేసింది.
ఈ సినిమా లో త్రిష కి చెల్లికి నటించి, అప్పట్లో మంచి మార్కులే కొట్టేసింది. కానీ ఆ తర్వాత తెలుగు లో పెద్దగా సినిమాలు చేయలేదు కానీ, కన్నడ లో వరుసగా సినిమాలు చేసి మంచి గుర్తింపు ని తెచ్చుకుంది. అదే విధంగా కన్నడ బిగ్ బాస్ షో లో కూడా ఈమె ఒక కంటెస్టెంట్ గా పాల్గొని కేవలం రెండు వారాలు మాత్రమే హౌస్ లో కొనసాగింది. అక్కడ కేవలం రెండు వారాలు మాత్రమే కొనసాగిన సంజన, ఇప్పుడు ఈ రేంజ్ పెర్ఫార్మన్స్ ఇస్తూ ముందుకు దూసుకెళ్లడం నిజంగా అద్భుతం అనే చెప్పాలి. ఇదంతా పక్కన పెడితే సంజన గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యాయి. అది చూసిన తర్వాత సంజన లో ఇంత టాలెంట్ ఉందా అని ఎవరైనా ఆశ్చర్యపోక తప్పదు.
వివరాల్లోకి వెళ్తే 2015 వ సంవత్సరం లో ఈమె 104 గంటలు నాన్ స్టాప్ గా సైక్లింగ్ చేసి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కింది. ఈ విషయం ఇప్పటి వరకు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న వాళ్లకు తెలియదు. ఈమె టాస్కులు ఆడలేదని చాలా చిన్న చూపు చూస్తున్నారు. ఎవ్వరూ అవకాశాలు కూడా ఇవ్వడం లేదు. ఒక్కసారి సంజన కి అవకాశం ఇస్తే కచ్చితంగా దుమ్ము దులిపేస్తుంది అని అనడం లో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతానికి ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో భరణి టీం లోకి వచ్చిన సంజన కి ఫిజికల్ టాస్కులు ఆడేందుకు అవకాశం వస్తుందో లేదో చూడాలి.