https://oktelugu.com/

Kuwaiti Dinar: దినార్‌ నంబర్‌ వన్‌.. డాలర్‌ను దాటేసిన కువైట్‌ కరెన్సీ!

ప్రపంచంలో అత్యంత విలువైన కరెన్సీ అనగానే అందరూ టక్కున అమెరికా డాలర్‌ అంటారు. కొంత వరకు అది నిజమే. కానీ, దానిని మించిన కరెన్సీ కూడా ఉంది. ఈ విషయం చాలా మందికి తెలియదు

Written By: Raj Shekar, Updated On : November 10, 2024 12:22 pm

Kuwaiti Dinar

Follow us on

Kuwaiti Dinar: ప్రపంచంలో అత్యంత విలువైన కరెన్సీ అమెరికా డాలర్‌. ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా లావాదేవీలన్నీ ఈ అమెరికా డాలర్‌ ప్రకారంమే జరుగుతాయి. అందుకే అందరూ అమెరికా డాలర్‌ను విలువైనదిగా పేర్కొంటారు. విలువ ఇస్తారు. అయితే అమెరికా డాలర్‌తో మన కరెర్సీ 84 రూపాయలుగా ఉంది. అంటే అమెరికా ఒక డాలర్‌ ఇస్తే.. మన 83 రూపాయలు ఇవ్వాలన్నమాట. ఇలా అన్ని దేశాలు తమ కరెన్సీని డాలర్‌తో పోల్చుకుని వ్యాపారం చేస్తాయి. అన్నిటికన్నా డాలర్‌ విలువను ఎక్కువగా చూపుతాయి. అయితే అమెరికా డాలర్‌ను ఆదేశ కరెన్సీ దాటిపోయింది. ఆదేశ కరెన్సీ విలువ మన రూపాయి 274తో సమానంగా ఉంది. అంటే అమెరికా డాలర్‌కన్నా మూడు రెట్లు ఎక్కువ.

కువైట్‌ దినార్‌..
గల్ఫ్‌ దేశం కువైట్‌. దీని ప్రధాన ఆదాయ వనరు పెట్రోలియం ఉత్పత్తి. ఇక్కడి నుంచి ప్రపంచంలో చాలా దేశాలకు పెట్రోలియం ఎగుమతి అవుతోంది. కొన్ని కరెన్సీలు ఒక్కో యూనిట్‌ కొనాలంటే ఒకటికంటే ఎక్కువ అమెరికన్‌ డాలర్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అలా చూసినప్పుడు ప్రపంచంలో అత్యధిక విలువ కువైట్‌ కరెన్సీ దినార్‌కు ఉంది. ఇక ఒక యూనిట్‌ భారత కరెన్సీ రూపాయి 274 గా ఉంది. ఇక అమెరికా డాలర్‌ 3.26 ఖర్చు చేయాలి.

ఎలా నిర్ణయిస్తారంటే..
ప్రపంచంలో అత్యంత విలువైన లేదా ఖరీదైన కరెన్సీ టైటిల్‌ను ఏ దేశం కలిగి ఉందో తెలుసుకోవడానికి స్థానిక, అంతర్జాతీయ అంశాల సమగ్ర విశ్లేషణ అవసరం. విదేశీ మారకపు మార్కెట్లలో సరఫరా, డిమాండ్‌ డైనమిక్స్‌ ద్రవ్యోల్బణం రేట్లు, దేశీయ ఆర్థిక వృద్ధి, సంబంధిత సెంట్రల్‌ బ్యాంకు అమలు చేసే విధానాలు, దేశం ఆర్థిక స్థిరత్వం వంటివి ఉన్నాయి. వీటి ఆధారంగానే కరెన్సీ విలువను నిర్ణయిస్తారు. కువైట్‌ వీటిలో అమెరికాను ఎప్పుడో దాటేసింది.