https://oktelugu.com/

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కి రెండోసారి హిట్ ఇవ్వలేకపోయిన ఆ స్టార్ డైరెక్టర్లు…

సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్లను వాళ్ళు స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే వారు చేసే సినిమాల పట్ల ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ ముందుకు సాగుతూ ఉంటారు... ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుతున్న చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకొని ముందుకు సాగుతున్నారు...

Written By: , Updated On : November 10, 2024 / 12:19 PM IST
Pawan Kalyan

Pawan Kalyan

Follow us on

Pawan Kalyan :  పవన్ కళ్యాణ్ తన ఎంటైర్ కెరియర్ లో తీసిన సినిమాలు తక్కువే అయినప్పటికీ ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించుకున్నాడు. ముఖ్యంగా ఆయన అభిమానుల్లో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ అయితే ఉంది. వాళ్ళు ఎప్పుడు చూసినా పవన్ కళ్యాణ్ జపమే చేస్తూ ఉంటారు. కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో తనదైన రీతిలో సక్సెస్ సాధిస్తూ ముందుకు సాగడమే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించి వ్యక్తిత్వాన్ని బట్టి కూడా ఆయనకి చాలామంది అభిమానులు ఉన్నారు. ఇక ఏది ఏమైనప్పటికి ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా పదవి బాధ్యతలను కొనసాగిస్తున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వాటి మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఆయన హీరోగా సినిమాలు చేసిన సందర్భంలో వరుస సక్సెస్ లను అందుకొని ముందుకు సాగిన విషయం మనకు తెలిసిందే. ఇక ఆయన కెరియర్ మొదట్లో చాలామంది టెక్నీషియన్స్ ని కూడా ఎంకరేజ్ చేశాడు. ఆయన వల్ల ఇండస్ట్రీలో పైకి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక ఏది ఏమైనప్పటికి పవన్ కళ్యాణ్ అంటే ప్రతి ఒక్క అభిమానికి అదొక ఎమోషన్ గా మారిపోయింది…ఇక పవన్ కళ్యాణ్ తో సినిమా చేసిన ప్రతి ఒక్క దర్శకుడు మరోసారి అతనితో సినిమా చేయడానికి ఉత్సాహాన్ని చూపిస్తాడు.

అలాగే పవన్ కళ్యాణ్ కూడా అలాంటి దర్శకులను ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. ఇక పవన్ కళ్యాణ్ కి మొదటి సినిమాతో సూపర్ సక్సెస్ ని అందించి ఆ తర్వాత రెండో సినిమాతో భారీ డిజాస్టర్ లను అందించిన దర్శకులు కూడా ఉన్నారు. అందులో మొదటగా కరుణాకరన్ గురించి చెప్పుకోవాలి.

తొలిప్రేమ సినిమాతో సూపర్ సక్సెస్ ని అందించిన ఆయన ఆ తర్వాత బాలు సినిమాతో పవన్ కళ్యాణ్ కి ఒక భారీ డిజాస్టర్ ను అయితే అందించాడు. ఇక పూరి జగన్నాధ్ లాంటి స్టార్ డైరెక్టర్ కూడా ‘బద్రి’ సినిమాతో సూపర్ సక్సెస్ ని అందించి ఆ తర్వాత ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమాతో ఒక ప్లాప్ సినిమాని ఇచ్చాడు.

ఇక వీళ్లే కాకుండా పవన్ కళ్యాణ్ కి మొదటి సినిమాతో సక్సెస్ ని అందించి ఆ తర్వాత రెండో సినిమాతో డిజాస్టర్లని అందించిన దర్శకులు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ మంది ఉన్నారనే చెప్పాలి. ఇక ఆయన కెరియర్ మొదట్లో భీమినేని శ్రీనివాసరావు తో ‘సుస్వాగతం ‘ సినిమా చేసి సూపర్ సక్సెస్ ని అందుకున్న పవన్ కళ్యాణ్ ఆ తర్వాత చేసిన అన్నవరం సినిమా అంత పెద్దగా ఆకట్టుకోలేకపోయింది…