https://oktelugu.com/

Sandeep Vanga : ప్రభాస్ స్పిరిట్ సినిమా మీ ఊహకు అందదు అంటున్న సందీప్ వంగ ఇంటర్వెల్ ఎలా ఉంటుందో రివల్ చేశాడా..?

  కమర్షియల్ సినిమాలకు చెక్ పెడుతూ తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగిన దర్శకుడు సందీప్ రెడ్డివంగా అర్జున్ రెడ్డి సినిమాతో ఆయనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకోవడమే కాకుండా ఇప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీని షేర్ చేయొచ్చు అని మొదటి సినిమాతో నిరూపించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ... ప్రస్తుతం ఈయన డైరెక్షన్లో నటించడానికి ఉన్న ప్రతి ఒక్క హీరో ఆసక్తి చూపిస్తున్నాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు...

Written By:
  • Gopi
  • , Updated On : November 10, 2024 / 12:25 PM IST

    Sandeep Vanga

    Follow us on

    Sandeep Vanga  : ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వస్తున్న ‘స్పిరిట్’ సినిమా ప్రేక్షకుల అంచనాలకు మించి ఉంటుందని దర్శకుడు సందీప్ రెడ్డివంగ కొన్ని కామెంట్లైతే చేస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా ఎలా ఉన్నా కూడా ప్రభాస్ అభిమానులు ఆ సినిమాని మాత్రం భారీ రేంజ్ లో సక్సెస్ చేయడానికి రెడీగా ఉన్నట్టుగా సోషల్ మీడియాలో ప్రభాస్ అభిమానులు రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా సందీప్ రెడ్డి వంగ తన మార్క్ డైరెక్షన్ తో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ‘ఫౌజీ ‘సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ ముగిసిన వెంటనే స్పిరిట్ సినిమా షూటింగ్ లో పాల్గొనడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ కాంబోలో వస్తున్న సినిమా మీద యావత్ ఇండియా మొత్తంలో మంచి అంచనాలైతే ఉన్నాయి. మరి ఈ సినిమాతో పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్న సందీప్ రెడ్డి వంగ ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ప్రస్తుతం ఆయన తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు.

    అనిమల్ సినిమాతో గత సంవత్సరం భారీ సక్సెస్ ని అందుకున్న ఆయన ఆ సినిమాతో దాదాపు 1000 కోట్ల వరకు కలెక్షన్స్ ను అనుకొని ఇక ఇప్పుడు ప్రభాస్ తో చేస్తున్న సినిమాతో భారీ కలెక్షన్లను రాబట్టి ఎలాగైనా సరే ఆయన ఇండస్ట్రీలో నెంబర్ వన్ డైరెక్టర్ గాఎదగాలనే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక స్పిరిట్ సినిమా ఇంటర్వెల్ లో ఒక పెద్ద యాక్షన్ బ్లాక్ ఉంటుందట… ఇది సినిమాకి హైలెట్ గా నిలుస్తుందని ఆయన కొన్ని కామెంట్లైతే చేశారు…

    ఇక మొత్తానికైతే సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సినిమాతో ప్రేక్షకులందరికి ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేయబోతున్నట్టుగా ప్రచారం అయితే జరుగుతుంది. మరి ఆయన ఆ సినిమాతో ఎలాంటి ప్రభంజనాన్ని సృష్టిస్తాడనేది కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఇక ఇప్పటికే సందీప్ రెడ్డి వంగ పేరు చెబితే బాలీవుడ్ ప్రేక్షకులు అభిమానంతో విజిల్స్ వేస్తున్నారు.

    ఇక అక్కడి బాలీవుడ్ మాఫియా మాత్రం కొంతవరకు సందీప్ రెడ్డి వంగను తొక్కేయాలనే ప్రయత్నం చేస్తున్నప్పటికి ఆయన మాత్రం ఎవ్వరికి లొంగడం లేదు. దాంతో ఆయన సినిమాలే అతన్ని స్టార్ లెవెల్ కి తీసుకెళ్తున్నాయని చెప్పొచ్చు… ఇక ఏది ఏమైనా బాలీవుడ్ మాఫీయాకి సరైన వ్యక్తి దొరికాడని కొంతమంది సినీ మేధావులు సైతం సందీప్ రెడ్డి వంగను మెచ్చుకుంటున్నారు..