Homeఅంతర్జాతీయంNorth Korea: ఉత్తరకొరియాలో కిమ్ మామ మరో ఆదేశం.. అలా పెంచేసుకుంటే ఆరు నెలలు జైల్లో...

North Korea: ఉత్తరకొరియాలో కిమ్ మామ మరో ఆదేశం.. అలా పెంచేసుకుంటే ఆరు నెలలు జైల్లో వేస్తాడట

North Korea: ఉత్తర కొరియా తూర్పు ఆసియాలోని ఒక దేశం . ఇది కొరియన్‌ ద్వీపకల్పం యొక్క ఉత్తర భాగంలో ఉంది. చైనా, రష్యాకు ఉత్తరానయాలు (అమ్నోక్‌) మరియు టుమెన్‌ నదుల వద్ద మరియు దక్షిణ కొరియాకు దక్షిణాన కొరియన్‌ డిమిలిటరైజ్డ్‌ జోన్‌ వద్ద సరిహద్దులుగా ఉంది. ప్యోంగ్యాంగ్‌ ఉత్తర కొరియా రాజధాని. ఉత్తర కొరియా నిరంకుశ నియంతృత్వం మరియు కిమ్‌ కుటుంబం చుట్టూ వ్యక్తిత్వం యొక్క సమగ్ర ఆరాధనతో ఉంది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ దేశం ప్రపంచంలోనే అత్యంత అధ్వాన్నమైన మానవ హక్కుల రికార్డును కలిగి ఉందని పేర్కొంది. అధికారికంగా, ఉత్తర కొరియా ఒక ‘స్వతంత్ర సోషలిస్ట్‌ రాజ్యం. ఇది ప్రజాస్వామ్య ఎన్నికలను నిర్వహిస్తుంది. అయితే, బయటి పరిశీలకులు సోవియట్‌ యూనియన్‌లో ఎన్నికల మాదిరిగానే ఎన్నికలను అన్యాయమైన, పోటీలేని ముందుగా నిర్ణయించినవిగా అభివర్ణించారు . వర్కర్స్‌ పార్టీ ఆఫ్‌ కొరియా ఉత్తర కొరియా అధికార పార్టీ. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 3 ప్రకారం, కిమిల్‌సుంగిజం–కిమ్‌జోంగిలిజం ఉత్తర కొరియా యొక్క అధికారిక భావజాలం. ఉత్పాదక సాధనాలు రాష్ట్ర యాజమాన్యంలోని సంస్థలు మరియు సామూహిక వ్యవసాయ క్షేత్రాల ద్వారా రాష్ట్ర ఆధీనంలో ఉంటాయి .

కిమ్‌ మరో సంచలన నిర్ణయం..
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ పేరు చెప్పగానే కఠిన చట్టాలు గుర్తుకువస్తాయి. చాలా విచిత్రమైన నిబంధనలతో అక్కడి ప్రజల వ్యక్తిగత అభిరుచులను సైతం ఆయన శాసిస్తుంటారు. తాజాగా కిమ్‌ మరో కఠిన నిర్ణయం తీసుకున్నారు. దేశంలో పోనీటెయిల్స్‌ను నిషేధించారు. ఎవరైనా అలాంటి హెయిర్‌స్టైల్‌తో పట్టుబడితే 6 నెలల జైలు శిక్ష తప్పదు. శత్రువులపై యుద్ధంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఫ్యాషన్‌ ఉత్పత్తులు బ్యాన్‌..
మూడు నెలల క్రితం మహిళలు రెడ్‌ లిప్‌ స్టిక్‌ వాడొద్దనే మరో నిబంధనను కిమ్‌ తీసుకొచ్చారు. రెడ్‌ లిప్‌స్టిక్‌ను ఉత్తర కొరియా అధినాయకత్వం పెట్టుబడిదారీ విధానానికి సంకేతంగా భావిస్తోంది. అది కమ్యునిజానికి పూర్తి వ్యతిరేకమని వారి నమ్మకం. ఇప్పటికే ఆ దేశంలో మేకప్‌పై నిషేధం ఉంది. దీన్ని అక్కడి ప్రభుత్వం పాశ్చాత్య సంస్కృతిగా భావిస్తుంది. వీటిని అనుమతిస్తే ప్రజలు క్రమంగా పాశ్చాత్య దేశాల భావజాలానికి ఆకర్షితులవుతారని కిమ్‌ భయం. ప్రజలు నిరాడంబరంగా, సహజంగా ఉండాలని కిమ్‌ ప్రభుత్వం ప్రచారం చేస్తుంది. లిపిస్టిక్‌ వేసుకోవడం ఉత్తర కొరియా నియమాలకు విరుద్ధమని అక్కడి నాయకుల భావన.

ఇవి కూడా..
శరీరానికి అతుక్కుపోయినట్లుగా ఉండే నీలిరంగు జీన్స్, ఆభరణాలు, కొన్ని రకాల హెయిర్‌ స్టైళ్లపై నిషేధం ఉంది. మహిళలు, పురుషులు ప్రభుత్వం అనుమతించిన విధానంలోనే జుట్టును కత్తిరించుకోవాలి. ఇంకొన్ని నిబంధనలనైతే.. కిమ్‌ తనను ఎవరూ అనుకరించొద్దనే ఉద్దేశంతో అమలు చేస్తున్నారు. ఆయన తరహాలో జుట్టును కత్తిరించుకోవడం, నలుపు రంగు ట్రెంచ్‌ కోట్లు ఎవరూ ధరించొద్దనే నిబంధన ఉంది. ప్రభుత్వం విధించిన ఆంక్షలను ఉల్లంఘించిన వారికి ఉత్తర కొరియాలో కఠిన శిక్షలు విధిస్తారు. ఒక్కోసారి భారీ జరిమానా కట్టాల్సి వస్తుంది. జీన్స్‌ ధరించి రోడ్డుపై కనిపిస్తే.. అక్కడే ఆపి మరోసారి వేసుకోవడానికి వీల్లేకుండా కత్తిరిస్తారు. జుట్టు కూడా అంతే.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular