Jaishankar
Jaishankar: జై శంకర్ ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్నారు. కొద్ది రోజుల క్రితమే ఆయన లండన్ వెళ్లారు. ఈ క్రమంలో అధికారిక భేటీలో పాల్గొనేందుకు ఆయన లండన్ లోని ప్రభుత్వ కార్యాలయానికి వెళుతుండగా భద్రతా లోపం తలెత్తింది. కొంతమంది ఖలిస్థానీ సానుభూతిపరులు జై శంకర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్కడ కలకలం సృష్టించారు. ఇంతలోనే ఒక వ్యక్తి జై శంకర్ కారు వద్దకు దూసుకు వచ్చాడు. దాడి చేయడానికి ప్రయత్నించాడు. భారత జాతీయ జెండాను అవమానించే విధంగా ప్రవర్తించాడు. దీంతో లండన్ పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. అతడిని అరెస్టు చేశారు. నినాదాలు చేస్తున్న ఖలిస్థానీ సానుభూతిపరులను చెదరగొట్టారు. ఆ తర్వాత జై శంకర్ తన భేటీ లో పాల్గొన్నారు. ఈ సంఘటన లండన్ వ్యాప్తంగా దుమారం రేపింది. దీనిపై భారత్ నిరసన వ్యక్తం చేసింది. సాక్షాత్తు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి పర్యటనలో ఇలాంటి భద్రతా లోపం తలెత్తడాన్ని తప్పుపట్టింది.
Also Read: ఏపీలో నియోజకవర్గాల పెంపు.. కీలక ప్రతిపాదనలతో ఢిల్లీకి చంద్రబాబు!
ఎప్పటినుంచో టార్గెట్ చేశారు
ఇటీవల జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమిపాలైంది. అప్పటినుంచి ఖలిస్థానీ మద్దతుదారులు సామాజిక మాధ్యమాలలో విద్వేష పూరితమైన కామెంట్లు చేస్తున్నారు. అంతకంటే ముందు కెనడాలో ట్రూడో ప్రభుత్వానికి అభిశంసన ఎదురు కావడంతో ఖలిస్థానీ మద్దతుదారులకు ఇబ్బందికర వాతావరణ ఏర్పడింది. ఇక నాటి నుంచి వారు ఏదో ఒక రూపంలో తమ నిరసనను వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇక తాజాగా కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ ను టార్గెట్ చేశారు. ఆయన లండన్ వస్తున్న విషయం తెలుసుకొని.. నిరసన వ్యక్తం చేశారు. ఏకంగా దాడికి ప్రయత్నించారు. భారత జాతీయ జెండాను అవమానించే విధంగా వికృత చేష్టలకు పాల్పడ్డారు. గతంలో రైతు చట్టాలను నిరసిస్తూ ఆందోళనకు పాల్పడిన ఖలిస్థానీ మద్దతుదారులు జనవరి 26 రిపబ్లిక్ డే నాడు జాతీయ జెండా స్థానంలో ఖలిస్థానీ జెండాను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీంతో నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించారు. అంతేకాదు సరిగ్గా మూడు సంవత్సరాల క్రితం పంజాబ్ శాసనసభ ఎన్నికల సమయంలో ప్రచారానికి వెళుతుండగా.. నరేంద్ర మోడీని ఖలిస్థానీ మద్దతు దారులు ఆడుకున్నారు. నాడు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ అప్రమత్తం కావడంతో నరేంద్ర మోడీకి పెను ముప్పు తప్పింది. నాడు ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత “మీ ముఖ్యమంత్రి కి చెప్పండి నేను జాగ్రత్తగా ఢిల్లీ చేరుకున్నానని” అంటూ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ఇప్పుడు జై శంకర్ పై ఖలిస్థానీ మద్దతు దారులు దాడికి యత్నించిన నేపథ్యంలో నరేంద్ర మోడీ ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది.
Also Read: పవన్ ను తిడితే ఎలా.. నష్టమని తెలిసినా ఎందుకలా జగన్!
కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ లండన్ పర్యటనలో ఉండగా ఖళీస్థానీ మద్దతుదారులు అడ్డుకున్నారు.. ఒక వ్యక్తి ఏకంగా జై శంకర్ పై దాడికి ప్రయత్నించి.. జాతీయ జెండాను అవమానించే విధంగా ప్రయత్నించాడు. లండన్ పోలీసులు వెంటనే వారిని అరెస్ట్ చేశారు. #jaishanker #London #India pic.twitter.com/oOMFlVkXg2
— Anabothula Bhaskar (@AnabothulaB) March 6, 2025