Anaswara Rajan: మన టాలీవుడ్ నుండి ఇతర రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ ఉన్న హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu arjun). ఇదేదో పుష్ప సిరీస్ తో ఆయన తెచ్చుకున్న క్రేజ్ కాదు. 2010 వ సంవత్సరం కి ముందే అల్లు అర్జున్ కి నార్త్ ఇండియా మరియు కేరళ లో క్రేజ్ ఏర్పడింది. సోషల్ మీడియా వృద్ధి లో లేని రోజుల్లోనే అల్లు అర్జున్ తన డ్యాన్స్ ద్వారా పాన్ ఇండియా వైడ్ గా పేరు తెచుకున్నాడు. ముఖ్యంగా కేరళలో అయితే అల్లు అర్జున్ కి ఉన్నంత క్రేజ్ అక్కడి స్టార్ హీరోలకు కూడా లేదు అనడం లో ఎలాంటి సందేహం లేదు. అందుకు ఉదాహరణగా ఎన్నో ఉన్నాయి. కేరళ నుండి ఏ స్టార్ హీరో, లేదా హీరోయిన్ ఇక్కడికి వచ్చినా అల్లు అర్జున్ తమ అభిమాన నటుడు అని చెప్తుంటారు. రీసెంట్ గా ఆ జాబితాలోకి అనశ్వర రాజన్ కూడా చేరిపోయింది.
శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరో గా నటించిన రెండవ చిత్రం ‘ఛాంపియన్’ లో హీరోయిన్ ఈమె. ఈ సినిమాకు ముందు కేరళలో పాతికకు పైగా సినిమాలు చేసి అక్కడ స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపుని తెచ్చుకుంది. ఇప్పుడు ఛాంపియన్ చిత్రం విడుదల సందర్భంగా ప్రొమోషన్స్ లో పాల్గొంటున్న అనశ్వర రాజన్, లేటెస్ట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ లో అల్లు అర్జున్ గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆమె మాట్లాడుతూ ‘ నేను మా నాన్నమ్మ తో కలిసి చూసిన మొట్టమొదటి తెలుగు చిత్రం ‘శ్రీరామ రాజ్యం’. ఆ తర్వాత నేను అల్లు అర్జున్ మలయాళం డబ్ మూవీస్ చూస్తూ ఉండేదాన్ని. ఆ సినిమాలు చూసిన తర్వాత అల్లు అర్జున్ తెలుగు హీరో అనే విషయం నాకు తెలియదు. కేరళ కి సంబంధించిన హీరో అని అనుకున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది.
అల్లు అర్జున్ నటన, డ్యాన్స్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చిన అనశ్వర రాజన్, తెలుగు లో తనకు బాగా ఇష్టమైన చిత్రం ‘మగధీర’ అని చెప్పుకొచ్చింది. మగధీర తెలుగు సినిమా అని తెలుసుకొని ఆశ్చర్యపోయాను అంటూ ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఇకపోతే ఛాంపియన్ చిత్రం లోని ‘గిర్రా గిర్రా బొంగరానివే’ పాట ఎంత పెద్ద హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఈ పాటలో అనశ్వర రాజన్ డ్యాన్స్, ఎక్స్ ప్రెషన్స్ యూత్ ఆడియన్స్ కి తెగ నచ్చేసింది. ఈ సినిమా హిట్ అయితే, ఇక టాలీవుడ్ దర్శక నిర్మాతలు ఈమె డేట్స్ కోసం పోటీ పడుతారు అనుకోవచ్చు, చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.