Smart Jodi Season 3: ప్రియాంక జైన్ తెలుగులో పలు సీరియల్స్ చేసింది. అయితే బిగ్ బాస్ షోతో మరింత పాపులారిటీ రాబట్టింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో ప్రియాంక జైన్ కంటెస్ట్ చేసింది. స్ట్రాంగ్ ప్లేయర్ గా ఫైనల్ కి వెళ్ళింది. ఓ టాస్క్ లో భాగంగా ప్రియాంక జైన్ హౌస్లో తన జుట్టు షోల్డర్స్ వరకు కట్ చేసుకుంది. ప్రియాంక చాలా వరకు కామ్ గా ఉండేది. నామినేషన్స్ సమయంలో మాత్రం ఫైర్ అయ్యేది. శోభా శెట్టి, ప్రియాంక, అమర్ దీప్ స్టార్ మా సీరియల్స్ లో నటించారు. దాంతో వీరికి స్టార్ మా బ్యాచ్ అనే పేరు పడింది.
Also Read: ఎన్టీయార్ ప్రశాంత్ నీల్ మూవీ బ్యాక్ డ్రాప్ ఇదేనా..? తారక్ ఎందుకు అన్నీ ఇలాంటి సబ్జెక్ట్స్ చేస్తున్నాడు..?
వీరు ముగ్గురు ఒక గ్రూప్ గా గేమ్ ఆడేవారు. అది ప్రియాంకకు మైనస్ అయ్యింది. అయితే ప్రియాంక ఫైనల్ కి వెళ్లడం విశేషం. బిగ్ బాస్ హౌస్లో ప్రియాంక తన ప్రియుడి ప్రస్తావన తెచ్చింది. సీరియల్ నటుడు శివ కుమార్ తో రిలేషన్ లో ఉన్నట్లు వెల్లడించింది. ఫ్యామిలీ వీక్ లో ప్రియాంకను కలిసేందుకు హౌస్లోకి శివ కుమార్ ఎంట్రీ ఇచ్చాడు. ఇక కెమెరాలు ఉన్నాయన్న విషయం మరచి, తోటి కంటెస్టెంట్స్ ముందే శివ కుమార్ తో రొమాన్స్ చేసింది ప్రియాంక.
హౌస్లోనే పెళ్లి చేసుకుందామని మారాం చేసింది. నువ్వు బయటకు వచ్చిన వెంటనే వివాహం చేసుకుందామని శివ కుమార్ అన్నాడు. కాగా శివ కుమార్-ప్రియాంక ఒకే ఇంట్లో కలిసి జీవిస్తున్నారు. వారు సహజీవనం చేస్తున్నారు. వివాహం మాత్రం చేసుకోవడం లేదు. దీనిపై విమర్శలు తలెత్తాయి. ఈ క్రమంలో వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. చాలా గ్రాండ్ గా వివాహం చేసుకోవాలి అనేది ప్రియాంక కోరిక. అలాగే పెళ్లి ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. డబ్బులు సమకూర్చుకోవాల్సి ఉంది. అందుకే వివాహం ఆలస్యం అవుతుంది, అన్నారు.
కాగా స్టార్ యాంకర్ ఓంకార్ హోస్ట్ చేస్తున్న ఇస్మార్ట్ జోడి సీజన్ 3 లేటెస్ట్ ఎపిసోడ్లో ప్రియాంక-శివ కుమార్ పాల్గొన్నారు. ఓ రొమాంటిక్ సాంగ్ కి పెర్ఫార్మన్స్ ఇచ్చారు. సాంగ్ ముగిశాక.. పెళ్ళికి ముందే అన్నీ ఎంజాయ్ చేస్తున్నారని, ఓంకార్ వారిని ఉద్దేశించి అన్నారు. దాంతో షోలో ఉన్న బుల్లితెర స్టార్స్ అందరూ నవ్వేశారు . నా ఉద్దేశం వేరు అని ఓంకార్ కవర్ చేసే ప్రయత్నం చేశాడు. ‘మీరు ఏమనుకుంటున్నారో మేము కూడా అదే అనుకుంటున్నాం’ అని యాంకర్ లాస్య కౌంటర్ ఇచ్చింది. ఆ పరిస్థితి నుండి ఎలా బయటపడాలో తెలియక.. శివ కుమార్, ప్రియాంక కూడా నవ్వేశారు.
Also Read: రాజమౌళి నెక్స్ట్ మరో మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారా..? ఆ స్టార్ హీరోలను రంగంలోకి దించుతున్నాడా..?
