Pakistan: పాకిస్తాన్‌లో కశ్మీర్‌ రాజకీయం..

Pakistan పాకిస్తాన్‌ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అప్పులు చేయనిదే పూట గడవని పరిస్థితి. దేశంలో నిరుద్యోగం భారీగా పెరిగింది. ఉపాధి లేక యువత ఉగ్రవాదం వైపు చూస్తున్నారు.

Written By: Raj Shekar, Updated On : February 8, 2024 10:58 am

Pakistan

Follow us on

Pakistan: జమ్ము కశ్మీర్‌.. ఎవరు అవునన్నా.. కాదన్నా భారత దేశంలో భాగం. అయితే కశ్మీర్‌ను ఆక్రమించుకునేందుకు పాకిస్తాన్‌ 75 ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. తాజాగా పాకిస్తాన్‌లో పార్లమెంట్‌ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ పోటీ చేస్తున్న పార్టీలు ప్రజలకు ఏం చేస్తామో.. దేశాన్ని సంక్షోభం నుంచి ఎలా గట్టెకిస్తామో చెప్పకుండా.. కశ్మీర్‌ అంశాన్నే ఎన్నికల ఎజెండాగా మార్చుకున్నాయి. మనం పీవోకేగా పిలిచే.. ప్రాంతంతోపాటు, పాకిస్తానీలు ఐఓకే(ఇండయన్‌ ఆక్యుపైడ్‌ కశ్మీర్‌)గా పిలిచే అంశాన్ని ఎన్నికల్లో గెలుపు కోసం వాడుకుంటున్నారు.

తీవ్ర ఆర్థిక సంక్షోభం..
పాకిస్తాన్‌ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అప్పులు చేయనిదే పూట గడవని పరిస్థితి. దేశంలో నిరుద్యోగం భారీగా పెరిగింది. ఉపాధి లేక యువత ఉగ్రవాదం వైపు చూస్తున్నారు. చాలా మంది పేదరికంలో మగ్గుతున్నారు. దేశంలో పేదరికం స్థాయి పెరుగుతోంది. అయినా.. ఆ దేశం ఎన్నికలు నిర్వహిస్తోంది. అయితే ఎన్నికల్లో దేశాన్ని ఎలా సంక్షోభం నుంచి బయట పడేస్తాం.. యువతకు ఉపాధి ఎలా కల్పిస్తాం. పేదరికాన్ని ఎలా నిర్మూలిస్తామని చెప్పకుండా.. కేవలం కశ్మీర్‌ అంశాన్ని తీసుకుని సెంటిమెంటు రగిలిస్తున్నారు. భారత్‌ ఆర్టిక్‌ 370 రద్దుతో కశ్మీర్‌ ప్రజల స్వేచ్ఛను హరించింది. పీవోకేను ఆక్రమించాలని యత్నిస్తోందని ప్రచారం చేస్తున్నారు. దానిని అడ్డుకునే సత్తా తమకే ఉందని చెప్పుకుంటున్నారు. తెలంగాణలో ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌ తెలంగాణ సెంటిమెంటు రగిల్చినట్లు.. పాకిస్తాన్‌ పార్టీలు.. కశ్మీర్‌ అంశాన్నే.. సెంటిమెంటుగా అక్కడి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయి.