https://oktelugu.com/

Kamala Harris : అమ్మే నాకు స్ఫూర్తి.. కమలా హారిస్‌ భావోద్వేగ పోస్ట్‌!

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇంకా కొన్ని గంటల సమయమే మిగిలి ఉంది. ఇప్పటికే 6 కోట్ల మందికిపైగా ఓటు వేశారు. మెజారిటీ ఓటరుల నవంబర్‌ 5న పోలింగ్‌ రోజు ఓటు వేయనున్నారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : November 3, 2024 / 11:34 PM IST

    Kamala Harris

    Follow us on

    Kamala Harris : అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్‌ 5 నజరుగనున్నాయి. మరో 48 గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. మరోవైపు ఎన్నికల ప్రచారం అక్టోబర్‌ 30తో ముగిసింది. దీంతో అధికార డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థి కమలా హారిస్, ప్రతిపక్ష రిపబ్లిక్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ హోరాహోరీగా ప్రచారం చేశారు. ప్రచారం ముగియడంతో ఇప్పుడు సోషల్‌ మీడియా వేదికగా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ట్రంప్‌ తన సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం ద్వారా చేసిన అమెరిన్లకు అనుకూలంగా చేసిన వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. ఇందులో భారత వ్యతిరేక వీడియో కూడా ఒకటి ఉంది. ఇక డెమొక్రటిక్‌ పార్టీ అబ్యర్థి కమలా హారిస్‌ కూడా తాజాగా ఎక్స్‌ వేదికగా ఓ పోస్టు చేశారు. ఈ పోస్టులో తన తల్లి శామాలా గోపాలన్‌ను గుర్తు చేసుకున్నారు. తల్లి ధైర్యం, ధృడ నిశ్చయాలే తనను ఇక్కడి వరకు తీసుకువచ్చాయని తెలిపారు. ఆమె స్ఫూర్తితోనే తాను జీవతంలో చాలా సాధించానని తెలిపారు.

    ఒంటరిగా అమెరికాకు..
    తన తల్లి శ్యామలా గోపాలన్‌ 19 ఏళ్ల వయసులో ఒంటరిగా భారత్‌ నుంచి అమెరికా వచ్చారని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హారిస్‌ చేసిన చాలా ప్రసంగాల్లో ఆమె తల్లి గురించి ప్రస్తావించడం గమనార్హం. శ్యామలా గోపాలన్‌ అమెరికాలో రొమ్ము క్యాన్సర్‌పై పరిశోధనలు చేశారు. కాలిఫోర్నియాలోని బర్కిలీ యూనివర్సిటీలో చదువుకుంటూ జమైకా నుంచి వలస వచ్చిన డొనాల్డ్‌ హారిస్‌తో పరిచయం ఏర్పడింది. అనంతరం ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. 1960లో కమల జన్మించారు. కమల వయసు ఐదేళ్లు ఉన్నప్పుడు డొనాల్డ్‌ హారిస్, శ్యామలా గోపాలన్‌ విడాకులు తీసుకున్నారు.

    తల్లి సంరక్షణలోనే..
    తల్లిదండ్రులు విడిపోయిన తర్వాత కమలా తన తల్లి శ్యామల వద్దనే పెరిగారు. ఇక డొనాల్డ్‌ మరో పెళ్లి చేసుకున్నారు. ఆయనకు పిల్లలు ఉన్నారు. ఇటీవల కమలా, డొనాల్డ్‌ పిల్లలు కలిసే ఉంటున్నారు. కమలా తరఫున ఆమె సవతి సోదరి కూడా ఎన్నికల ప్రచారం చేసింది. వ్యూహకర్తగా వ్యవహరిస్తోంది. కమలా ఎన్నికల్లో గెలిస్తే.. అమెరికా అధ్యక్షురాలు అయిన తొలి మహిళగా, తొలి భారత సంతతి మహిళగా, తొలి ఆఫ్రో, అమెరికన్‌ మహిళగా కూడా రికార్డు సృష్టిస్తారు.