https://oktelugu.com/

Donald Trump : ట్రంప్ కనుక ఓడితే… రచ్చరచ్చే.. అల్లర్లకు పెద్ద ప్లానే వేశాడుగా..!

 ట్రంప్ అంటేనే ఓ కాంట్రవర్సీ. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడుతాడో కనీసం ఆయనకే తెలియదు. అలాగే.. ఆయన చేతలు కూడా అలానే ఉంటాయి. అంతేకాదు.. ప్రజలను ఆకట్టుకోవడంలో, ప్రత్యర్థులకు చుక్కలు చూపించడంలోనూ ఆయన పంథా వేరు. ఎన్నికలు ఎందుకు.. తాను గెలిచినట్లు ప్రకటించేయండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Written By:
  • Srinivas
  • , Updated On : November 4, 2024 / 12:17 AM IST

    Donald Trump

    Follow us on

    Donald Trump :  అమెరికా ఎన్నికలకు కౌంట్ డౌన్ షురూ అయింది. మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ మధ్య పోటీ నెక్ టు నెక్ అన్నట్లుగా జరుగుతోంది. అటు సర్వేలు సైతం అవే వెల్లడిస్తున్నాయి. గెలుపు ఎవరిదా అని ఎటూ తేల్చలేని పరిస్థితే ఉంది. అటు ఓటర్లు సైతం ఎవరి వైపు నిలుస్తున్నారా అని అర్థం కాకుండానే ఉంది. సర్వేలకు కూడా అంచనా దొరకడం లేదు. అందులోనూ ఈ సారి గతంలో ఎన్నడూ లేని విధంగా ఇరు పార్టీల మధ్య పోటీ కనిపిస్తున్నట్లు ట్రెండ్స్ కూడా చెబుతున్నాయి. అయితే.. ఇదే క్రమంలో ఒకవేళ ట్రంప్ కనుక ఓడిపోతే పరిస్థితి ఏంటన్న చర్చ నెట్టింట జరుగుతోంది.

    ట్రంప్ అంటేనే ఓ కాంట్రవర్సీ. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడుతాడో కనీసం ఆయనకే తెలియదు. అలాగే.. ఆయన చేతలు కూడా అలానే ఉంటాయి. అంతేకాదు.. ప్రజలను ఆకట్టుకోవడంలో, ప్రత్యర్థులకు చుక్కలు చూపించడంలోనూ ఆయన పంథా వేరు. ఎన్నికలు ఎందుకు.. తాను గెలిచినట్లు ప్రకటించేయండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఆయన అమెరికా అధ్యక్షుడిగా కొనసాగిన విషయం తెలిసిందే. కానీ.. ఆ తదుపరి ఎన్నికల్లో ఆయన ఓటమిని చూశారు. దాంతో మరోసారి అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే.. ఒకవేళ ఈసారి కూడా ఫలితాలు తారుమారై ఆయన కనుక ఓడిపోతే పరిస్థితి ఏంటనేది అంచనా వేయకుండా ఉంది. ఆయన ఓటమికి ట్రంప్ అంత ఈజీగా అంగీకరిస్తారా.. అన్న చర్చ సైతం నడుస్తోంది.

    అంతేకాదు.. నవంబర్ 5న జరిగే ఎన్నికల్లో హారిస్‌పై గెలవకుంటే ఫలితాలను అంగీకరించేదే లేదని ఇప్పటికే ట్రంప్ ప్రకటించారు. ఒకవేళ కనుక మనం ఓడిపోతే ప్రత్యర్థులు మోసం చేసినట్లే భావించాలని మద్దతుదార్లతో చెప్పుకొచ్చారు. దీంతో ఫలితాల వేళ ట్రంప్ ఏం చేయబోతున్నారనేది చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు.. ఒకవేళ ఎన్నికల్లో ఓటమి పాలైతే ఫలితాలను వివాదాస్పదం చేసేందుకు కూడా ట్రంప్ రెడీ అయిపోయారట. న్యాయస్థానాలను ఆశ్రయించేందుకు అన్ని రకాల సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఆయన న్యాయస్థానాలను సైతం ఆశ్రయించారు. ఓటర్లు కాని వారు ఓట్లేస్తున్నారని ఆరోపించారు. అటు ప్రపంచ కుబేరుడు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కూడా ఈ ప్రచారంలో చాలా వరకు ముందు ఉన్నారు. ట్రంప్ కోసం ఆయన ‘ఎక్స్’ ఓ స్థాయిలో వినియోగిస్తున్నారు. ట్రంప్ చేస్తున్న ఆరోపణలకు మరింత ప్రచారం కల్పిస్తున్నారు. ఓటర్లు కాని వారు ఓట్లు ఎలా వేస్తారన్న విషయాన్ని అమెరికన్లు నమ్మేలా ఆయన ఈ ప్రచారానికి దిగారు.

    మరోవైపు.. ఓట్ల లెక్కింపు కోసం కూడా ట్రంప్ వేల మందిని రెడీ చేశారట. వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించారు. ఫలితాలు ఒకవేళ తేడాగా వస్తే ఏం చేయాలో కూడా వారికి శిక్షణ ఇస్తున్నారు. ఇంతలోనే ఇటీవల బ్యాలెట్ బాక్సులకు నిప్పులు పెట్టడం కూడా చూశాం. ఆ పని ఎవరు చేసినప్పటికీ ఫలితాల వేళ మాత్రం అమెరికాలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉండబోతున్నాయో ఇప్పుడే అర్థం అవుతోంది. అటుఇటుగా ఫలితాలు వస్తే అల్లర్లూ జరిగే అవకాశం లేకపోలేదని ప్రచారం నడుస్తోంది.