https://oktelugu.com/

Ramulu Fish : ఈ చేప పేరు రామలు.. పులుసకు చెల్లెలి వరస.. తిన్నారంటే నా సామి రంగా.. అదిరిపోద్దంతే

గోదావరి జిల్లాల వాళ్లకు పులస అంటే విపరీతమైన ఇష్టం.. కాకపోతే ఆ చేప కొద్ది రోజులు మాత్రమే లభిస్తుంది. దానిని తినాలని.. దాని పులుసు హాయిగా జుర్రుకోవాలని ఎంతోమంది అనుకుంటారు. అందుకే పుస్తెలు విక్రయించైనా సరే పులస దక్కించుకోవాలని భావిస్తుంటారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 3, 2024 / 10:40 PM IST

    Ramulu Fish

    Follow us on

    Ramulu Fish :  పులస చేపలు ఒక్కసారి తింటే చాలు జన్మ ధన్యమైపోతుందని అనుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. పులస వలకు చిక్కింది అంటే చాలు జీవితం మారిపోతుందని భావించే మత్స్యకారులు చాలామంది ఉన్నారు. అయితే పులస చేప స్థాయిలోనే రుచి అందించి.. జిహ్వకు జీవితానికి సరిపడా సంతృప్తిని ఇచ్చే చేప మరొకటి కూడా ఉంది. దాని పేరే రామ చేప. ఇది పులస చేపకు చెల్లి అవుతుంది. రుచిలో పులుసను పోలి ఉంటుంది. గోదావరి జిల్లా వాళ్లకు రామలు చేపను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కానీ మిగతా వారికి రామ చేప అంటే తెలియదు. వినను కూడా విని ఉండరు. ఇంతకీ ఈ చేపలు ఎక్కడ లభిస్తాయి? వాటి వెనుక కథ ఏమిటో.. ఈ కథనంలో తెలుసుకుందాం..

    బొమ్మిడాయిల మాదిరిగా..

    రామలు చేపలు బొమ్మిడాయిల మాదిరిగా ఉంటాయి. ఇవి పశ్చిమగోదావరి జిల్లా ఉప్పుటేరు పరివాహ ప్రాంతాలలో లభిస్తాయి. సంవత్సరంలో రెండు లేదా మూడు నెలలు మాత్రమే ఇవి దొరుకుతాయి. దీపావళి తర్వాత ఇవి లభిస్తాయి . ఈ చేపలు ఆరు అంగుళాల వరకు పొడవు పెరుగుతాయి. అయితే రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది.. రామలు చేపల శాస్త్రీయ నామం లేబియో రోహితా. పశ్చిమగోదావరి జిల్లా ప్రాంతాలలో వీటిని రావలు అంటారు. కొన్ని ప్రాంతాలలో రావ, రావల చేపలు అని పిలుస్తారు. పశ్చిమగోదావరి జిల్లాలో సముద్ర తీరంలోని పై ప్రాంతాల్లో ఉప్పుటీలోకి బొండాడ, గొంతేరు, యనమదురు ఏర్లు ప్రవహిస్తాయి. వీటి ద్వారా నీరు సముద్రంలో కలిసే ప్రాంతంలో ఈ చేపలు పెరుగుతాయి. కాస్త ఉప్పు, కాస్త చప్పదనం రుచితో ఉండే నీటిలో ఈ చేపలు లభిస్తాయి. అందువల్లే వీటికి అద్భుతమైన రుచి ఉంటుంది. సెప్టెంబర్ ముగిసిన తర్వాత ఈ చేపలు లభ్యమవుతాయి. డిసెంబర్ వరకు ఈ చేపలు లభిస్తాయి . ఒక కిలో కు ఈ చేపలు 40 వరకు దొరుకుతాయి. అయితే వీటిని కిలోల మాత్రం తూచరు. విడిగాకుంటే ఒక్కో చేప ధర 25 రూపాయల వరకు ఉంటుంది. దీపావళి కాలంలో ఒక్కో చేప 30 రూపాయల వరకు పలుకుతుంది. ఈ చేపలను ఇక్కడి మత్స్యకారులు కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలకు విమర్శ చేస్తారు. వీటికి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో భీమవరం పరిధిలోని పలు చెరువులలో పెంచుతున్నారు. తయారీదారులు వీటి సీడ్ మే నెల చివరి వారంలో వేస్తున్నారు. ఆరు నెలలపాటు పెంచి ఆ తర్వాత విక్రయిస్తున్నారు. అయితే ఈ చేపలలో విపరీతమైన పోషకాలు ఉండడంతో మాంసాహార ప్రియులు ఎక్కువగా తినడానికి ఇష్టపడుతుంటారు. వీటిని తింటే క్యాల్షియం, అమైనో ఆమ్లాలు, ఇతర పోషకాలు శరీరానికి లభిస్తాయి. వీటిని తినడం దేహానికి మంచిదని వైద్యులు చెబుతున్నారు.

    పచ్చడి కూడా..

    కొందరు ఏడాది మొత్తం తినాలనే ఉద్దేశంతో ఈ చేపలను పచ్చడి పెట్టుకుని తింటారు. నూనెలో దోరగా వేయించి.. వాటికి ఉప్పు, కారం, మసాలాలు దట్టించి పచ్చడి పెట్టిస్తున్నారు. అలా చేయడంవల్ల ఆ పచ్చడి ఏడాది కాలం పాటు నిల్వ ఉంటుంది. ఫలితంగా రామలు చేపలను ఏడాది మొత్తం తినే అవకాశం లభిస్తుంది.