Homeఅంతర్జాతీయంKA Paul Nimisha Priya Case: కేఏ పాల్ అడుగుపెట్టాడు.. యెమెన్ లో నిమిష ప్రియకు...

KA Paul Nimisha Priya Case: కేఏ పాల్ అడుగుపెట్టాడు.. యెమెన్ లో నిమిష ప్రియకు ఉరిశిక్ష ఆగిపోయిందట..

KA Paul Nimisha Priya Case: నిమిష ప్రియకు ఉరిశిక్ష ఎందుకు ఆగిపోయింది? ఆమె విషయంలో యెమెన్ ప్రభుత్వం ఒక్కసారిగా నిర్ణయం ఎందుకు మార్చుకుంది? కోర్టు కూడా యెమెన్ సిఫారసు కు ఎందుకు అంగీకరించింది? సేవ్ నిమిష ప్రియ యాక్షన్ కౌన్సిల్ పోరాటం ఫలించిందా? పరిహారానికి మృతుడి కుటుంబం ఒప్పుకుందా? విదేశాంగ శాఖ ఇంకా ఏమైనా గట్టి ప్రయత్నం చేసిందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఏమోగాని.. నిమిషప్రియకు విధించే ఉరిశిక్ష తాత్కాలికంగా వాయిదా పడటంలో కేఏ పాల్ కీలకంగా వ్యవహరించాడట. ఈ విషయం ఆయన డబ్బా ప్రచారం చేసుకోవడం లేదు. వాస్తవ విషయాలను బయటపెట్టాడు. దానికి సంబంధించిన బలమైన వీడియోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

యెమెన్ దేశంలో ఒక వ్యక్తి మరణానికి కారణమని అక్కడి ప్రభుత్వం భారత సంతతి నర్స్ నిమిష ప్రియ కు మరణ శిక్ష విధించిన విషయం తెలిసిందే. అక్కడి కోర్టు తీర్పు ప్రకారం ఈరోజు ఆమెను ఉరి తీయాలి. కానీ ఆ ఊరి వాయిదా పడింది.. భారత ప్రభుత్వం ఈ విషయంలో చొరవ తీసుకోవడం.. అన్ని మార్గాలు మూసుకుపోయినప్పటికీ విదేశాంగ శాఖ చివరి ప్రయత్నం చేయడంతో తాత్కాలికంగా యెమెన్ న్యాయస్థానం అక్కడి ప్రభుత్వ సిఫారసుతో నిమిషప్రియకు ఉరిశిక్షను తాత్కాలికంగా వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో కేరళ నర్స్ కు సంబంధించిన ఒక కీలక విషయాన్ని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వెల్లడించారు. ఆయన తన సోషల్ మీడియా హ్యాండిల్ వేదికగా ఒక కీలక వీడియోను పోస్ట్ చేశారు. దీంతో ఒక్కసారిగా కలకలం నెలకొంది.

Also Read: PV Legacy Event Delhi: సెల్ ఫోన్ తెద్దామంటే…బాబు మీదే జోకేశారట..!!

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు పోస్ట్ చేసిన వీడియోలో యెమెన్, హుతీ దేశాల ప్రభుత్వ పెద్దలు కనిపిస్తున్నారు. వారితో పాల్ భేటీ అయినట్టు.. మాట్లాడుతున్నట్టు ఆ వీడియోలో ఉంది.. ” మూడు రోజులపాటు కష్టపడ్డాను. రాత్రి పగలు ఇక్కడే ఉన్నాను.. నిమిషకు ఉరి శిక్ష పడకుండా కాపాడాను.. 8 సంవత్సరాలుగా నిమిషా ఇబ్బంది పడుతున్నప్పటికీ మోడీ ప్రభుత్వం పట్టించుకోలేదు. కేంద్ర ప్రభుత్వ పెద్దలు సిటీలో ప్రభుత్వం లేదని అంటున్నారు. అక్కడ ప్రభుత్వం ఉంది. హూతీ నగరంలో కూడా ప్రభుత్వం ఉంది.. ఇక్కడ ముస్లిం నాయకుడు మీ ఆరియన్ షేక్ అహ్మద్ ఎంత సహాయం చేశారు. యెమెన్ ప్రభుత్వ పెద్దలను కలిశాను. వారు కూడా తమ వంతు సహాయం చేశారు. మృతుడి కుటుంబానికి పరిహారం ఇవ్వడానికి హామీ ఇచ్చాను. పరిహారం కేంద్రం ఇస్తుందా? నన్ను ఇవ్వమంటారా” అంటూ పాల్ ప్రశ్నించారు..” వారం రోజుల్లోనే ఈ డబ్బులు ఇవ్వాలి.. నిమిష ప్రియకు ఉరిశిక్షను కేవలం తాత్కాలికంగా వాయిదా వేశారు. నేను మళ్ళీ యెమెన్ వస్తాను.. ఇక్కడ లీడర్లను కలుస్తానని” పాల్ వ్యాఖ్యానించారు. పాల్ కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కేరళ నర్స్ కు ఉరిశిక్ష వాయిదా పడటం వెనక కేఏ పాల్ ఉన్నాడని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version