Junior NTR Afghanistan Craze: #RRR చిత్రం గ్లోబల్ వైడ్ గా సెన్సేషన్ సృష్టించిన తర్వాత , ఆ చిత్రం లో హీరోలుగా నటించిన ఎన్టీఆర్(Junior NTR) , రామ్ చరణ్(Global Star Ram Charan) లకు గ్లోబల్ వైడ్ గా గొప్ప రీచ్ కూడా వచ్చింది. ఈ సినిమా తర్వాత అసలు ఎవరు వీళ్లిద్దరు ?, వీళ్ళు చేసిన గత సినిమాలు ఏంటి ?, వీళ్ళ హిస్టరీ ఏంటి? అని తెలుసుకోవడానికి గూగుల్ లో పెద్ద ఎత్తున వెతకడం మొదలు పెట్టారు. అలా వెతికిన తర్వాత వీళ్ళు హీరోలు గా నటించిన కొన్ని సూపర్ హిట్స్ ని తెలుసుకొని , వాటిని యూట్యూబ్ లో చూడడం మొదలు పెట్టారు. అలా జూనియర్ ఎన్టీఆర్ కి ఆఫ్ఘనిస్తాన్ దేశం లో ఎంతటి క్రేజ్ ఉందో తెలిసింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే ఒక ప్రముఖ యూట్యూబర్ ఆఫ్ఘనిస్తాన్ కి టూర్ వెళ్లగా, అక్కడ ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్లడం కోసం బస్సు ఎక్కాడు. ఆ బస్సులో తన పక్కనే కూర్చున్న ఒక కుర్రాడు ఎన్టీఆర్ కెరీర్ లో సూపర్ హిట్ గా నిల్చిన ‘అరవింద సమేత ‘ చిత్రాన్ని చూస్తున్నాడు. అతనితో కాసేపు ముచ్చటించిన యూట్యూబర్ కి కొన్ని షాకింగ్ నిజాలు తెలిసాయి. ఎన్టీఆర్ సినిమాలు అంటే నాకు చాలా ఇస్తామని , ఆయనకు నేను పెద్ద వీరాభిమానిని అంటూ చెప్పుకొచ్చాడట ఆ ఆఫ్ఘనిస్తాన్ కుర్రాడు. ఈ దేశం లో నేనొక్కడినే ఎన్టీఆర్ ఫ్యాన్ కాదని , ఆయనకు ఇక్కడ వేల సంఖ్యలో అభిమానులు ఉన్నారని ఆ కుర్రాడు చెప్పుకొచ్చాడు. అరవింద సమేత చిత్రం హిందీ డబ్ వెర్షన్ కి యూట్యూబ్ లో 200 మిల్లియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ రేంజ్ వ్యూస్ కేవలం ఇండియన్స్ చూస్తే రాలేదు, ఇలా పక్క దేశానికీ సంబంధించిన వాళ్ళు చూడబట్టే వచ్చాయి.
కేవలం ఈ ఒక్క సినిమాకు మాత్రమే కాదు , మన తెలుగు సినిమాలకు హిందీ లో ఆ వందల మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రావడానికి కారణం ఇతర దేశాల నుండి మన సినిమాలను వీక్షించడం వల్లే అని అంటున్నారు విశ్లేషకులు. ఇక ఎన్టీఆర్ కొత్త సినిమాల విషయానికి వస్తే , ప్రస్తుతం ఆయన ప్రశాంత్ నీల్ తో ‘డ్రాగన్’ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జూన్ 11 న విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ వీడియో ని వచ్చే నెల 20 న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయబోతున్నారు మేకర్స్. ఇప్పటికే ఈ చిత్రం పై అంచనాలు వేరే లెవెల్ లో ఉన్నాయి , ఇప్పుడు గ్లింప్స్ వీడియో విడుదల తర్వాత ఆ అంచనాలు వేరే లెవెల్ కి చేరుకునే అవకాశాలు ఉన్నాయి.