2026 March SUV Sales: ప్రస్తుత కాలంలో కారు కొనాలని అనుకునేవారు SUV సెగ్మెంట్ ను ఎక్కువగా కోరుకుంటున్నారు. విశాలమైన స్పేస్ తోపాటు ధర కూడా అందుబాటులో ఉండడంతో చాలామంది వీటికి మొగ్గు చూపుతున్నారు. దీంతో ఇటీవల మిగతా వాటి కంటే SUV కార్ల అమ్మకాలు ఎక్కువగా జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఎస్ యు వి అమ్మకాలు 4. 5 మిలియన్లు ఉండగా.. ఇప్పుడు అది 4.8 మిలియన్లకు చేరుకుంది. ఇందులోనూ 2026 మార్చి నెలలో ఈ కార్ల సేల్స్ దాదాపు 50 వేల చేరువలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితేSUV సేల్స్ లో నెంబర్ వన్ గా Mahindra కంపెనీ నిలువగా ఆ తర్వాత మరికొన్ని కంపెనీలు తమ ఉత్పత్తులను విక్రయించాయి. ఏ కంపెనీ ఎన్ని సేల్స్ చేసిందో ఇప్పుడు చూద్దాం..
SUV వేరియంట్ లను మార్కెట్లోకి తీసుకు రావడంలో Mahindra ఎప్పటికీ అగ్రస్థానంలో నిలుస్తూ ఉంటుంది. ఇందులో భాగంగా 2026 మార్చి నెలలో కూడా అదే స్థానంలో కొనసాగింది. ఈ కంపెనీకి చెందిన స్కార్పియో N కారు మార్చి నెలలో 14,578 సేల్స్ చేసుకుంది. ఇదే కారు 2025 మార్చి నెలలో 13913 విక్రయాలు జరుపుకుంది. గత ఏడాదితో పోలిస్తే ఈ కారు 4.78 వృద్ధిని సాధించినట్లు తెలుస్తోంది. ఈ కంపెనీకి చెందిన మరో కారు XUV7XO సైతం అత్యధిక విక్రయాలు జరుపుకుంది. దీనిని 2026 మార్చి నెలలో 9210 మంది వినియోగదారులు కొనుగోలు చేశారు. గత ఏడాది ఇదే నెలలో ఈ కారులో 6,851 సేల్స్ చేసుకుంది. ఏడాదిలో ఈ కారు 34.43 శాతం వృద్ధిని సాధించింది.
Mahindra తర్వాత Toyota కంపెనీ suv విక్రయాల్లో నెంబర్ టు స్థానాన్ని సాధించింది. ఈ కంపెనీకి చెందిన ఫార్చునర్ కారు మార్చి నెలలో 37 95 సేల్స్ చేసుకుంది. గత ఏడాది మార్చి నెలలో ఈ కారును 3392 మంది కొనుగోలు చేశారు. ఏడాదిలో ఈ కారు 11.88 శాతం వృద్ధిని సాధించింది. ఆ తర్వాత మళ్లీ Mahindra కంపెనీకి చెందిన XEV 95 కారు 3,254 యూనిట్ల సేల్స్ చేసుకుంది. అయితే ఈ కారు ఈ సంవత్సరమే మార్కెట్లోకి వచ్చింది. ఇది గత నెలతో పోలిస్తే 8.31 శాతం వృద్ధిని సాధించింది.
కేవలం సాంప్రదాయ కార్లు మాత్రమే కాకుండా ఎలక్ట్రిక్ వేరియంట్ కార్లు కూడా అత్యధిక సేల్స్ లో భాగం అయ్యాయి. ఇందులో భాగంగా Tata కంపెనీకి చెందిన Harrier EV కారు మార్చి నెలలో 2,826 యూనిట్ల సేల్స్ చేసుకుంది. గత ఏడాది ఇదే నెలలో 1,265 యూనిట్ల అమ్మకాలు చేసుకుంది. ఏడాదిలో ఈ కారు 123.40% వృద్ధిని సాధించింది.
ఇలా suv కార్లకు మార్కెట్లో అత్యధిక డిమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మొత్తంలో మహేంద్ర తన మూడు కార్లతో టాప్ 5 లో నిలిచింది.