Homeఅంతర్జాతీయంJoe Biden: జోబైడెన్‌ అధికార దుర్వినియోగం.. ట్రంప్‌ భయంతో చివరిరోజు అసాధారణ ఉత్తర్వులు

Joe Biden: జోబైడెన్‌ అధికార దుర్వినియోగం.. ట్రంప్‌ భయంతో చివరిరోజు అసాధారణ ఉత్తర్వులు

Joe Biden: అగ్రరాజ్యం అమెరికాకు కొత్త అధ్యక్షుడు వచ్చాడు. దేశానికి 46వ అధ్యక్షుడిగా పనిచేసిన జో బైడెన్‌(Jo biden)పదవీకాలం 2025. జనవరి 19తో ముగిసింది. దీంతో నవంబర్‌ 5న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన డొనాల్డ్‌ ట్రంప్‌(Donald Trump) 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. వైట్‌హౌస్‌లోని రొటుండా హాల్‌లో అ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆయనతోపాటు ఉపాధ్యక్షుడిగా భారత దేశ అల్లుడు జేడీ.వాన్స్‌ కూడా ప్రమాణం చేశారు. ఈ క్రమంలో జనవరి 19 జో బైడెన్‌కు చివరి రోజు. అధ్యక్ష పదవి నుంచి రిటైర్‌ అయ్యే కొన్ని గంటల ముందు బైడెన్‌ అసాధారణ నిర్ణయాలు తీసుకున్నాడు. రాబోయే ట్రంప్‌ ప్రభుత్వం నుంచి కొందరు కీలక వ్యక్తులన రక్షించడానికి క్షమాభిక్ష పెట్టారు. డాక్టర్‌ ఆంటోని ఫౌచీ రిటైర్డ్‌ జనరల్‌ మార్క్‌ మల్లీ, 2021, జనవరి 6న యూఎస్‌ అధ్యక్ష భవనంపై దాడిని దర్యాప్తు చేసి హౌకమిటీ సభ్యులకు క్షమాభిక్ష పెట్టారు.

ఎందుకిలా చేశారంటే..
ఇటీవల ట్రంప్‌ చేసిన కొన్ని హెచ్చరికల నేపథ్యంలో బైడెన్‌ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ట్రంప్‌ తాను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, ఆ తర్వాత తనను వ్యతిరేకించిన లేదా తన చర్యలపై దర్యాప్తు చేసిన వ్యక్తులు లక్ష్యంగా ఈ హెచ్చరికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్‌ ఎనిమీస్‌(Trump Enimes) లిస్ట్‌ రూపొందించారు. 2020 ఎన్నికల అవకతవకలను ప్రశ్నింనప్పుడు తనకు అండగా నిలిచినవారినే సలహాదారులుగా నియమించుకున్నారు. తనను సవాల్‌ చేసినవారిని శిక్షిస్తారని చాలా మంది భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్‌ బాధితులను రక్షించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు.

క్షమాభిక్ష పొందిన వ్యక్తులు వీరు..
డాక్టర్‌ అంటోనీ ఫౌచీ : దాదాపు 40 ఏళుల నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ అలెర్జీ అండ్‌ ఇన్షెక్షియస్‌ డిసీజెస్‌కు అధిపతిగా పనిచేశారు. 2022లో రిటైర్‌ అయ్యారు. కోవిడ్‌ మహహ్మారి విషయంలో బైడెన్‌కు సలహాదారుగా వ్యవహరించారు. మాస్కు ఆదేశాలు, టీకాలు వేయడం వంటి చర్యలకు మద్దతు ఇచ్చాడు. కన్జర్వేటివ్‌ల ఆగ్రహానికి గురయ్యాడు. ఫౌచీని ట్రంప్‌ తీవ్రంగా విమర్శించారు.

జనరల్‌ మార్క్‌ మిల్లె: ఈయన రిటైర్డ్‌ జనరల్‌. జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ మాజీ చైర్మన్‌ ట్రంప్‌ను చాలా సందర్భాల్లో బహిరంగంగా విమర్శించారు. ట్రంప్‌ చర్యలకు సంబంధించిన ప్రాథమిక ఆధారాలు అందించారు. దీంతో ట్రంప్‌తో మిల్లీకి సంబంధాలు దెబ్బతిన్నాయి.

జనవరి 6 కమిటీ సభ్యులు: ఈక ఈ కమిటీ అధ్యక్ష భవనంపై దాడిలో ట్రంప్‌ పాత్రను దర్యాప్తు చేసింది. ట్రంప్‌ను జవాబుదారీగా నిలబెట్టడంలో కీలకపాత్ర పోషించారు. దాడిలో ట్రంప్‌ ప్రమేయాన్ని ధ్రువీకరించారు. కమిటీ సభ్యులు ట్రంప్‌ మద్దతు దారుల నుంచి బెదిరింపులు ఎదుర్కొన్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular