Telangana Govt: తెలంగాణలో 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల(Six Garantees)తోపాటు అనేక హామీలు ఇచ్చింది. ఇవి కాంగ్రెస్ గెలుపులో కీలక పాత్ర పోషించాయి. అధికారంలోకి వచ్చి ఏడాదైనా కొన్నే హామీలు అమలు చేశారు. చాలా హామీలు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో విపక్షాలు అధికార కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తున్నాయి. మరోవైపు ప్రజల్లో కూడా వ్యతిరేకత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో జనవరి 26(January 26) నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌కార్డుల జారీకి ముహూర్తం పెట్టింది. ఈమేరకు ప్రజాపాలన, కులగణ వివరాలతో అర్హులను గుర్తించేందుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు అధికారులు సర్వే చేశారు. ఇక ఇప్పుడు గ్రామ/వార్డు సభల్లో ఈ సర్వేలోని అర్హుల వివరాలు ఆమోదిస్తారు. ఆ తర్వాత పథకాలు జనవరి 26 నుంచి అమలు చేస్తారు.
నిరంతర ప్రక్రియ..
ఇక పథకాల అమలు నేపథ్యంలో గతంలో దరఖాస్తు చేసుకోలేకపోయినవారు ఆందోళన చెందుతున్నారు. అర్హత ఉన్నా తమ పేర్లు జాబితాలో లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం వారికి కూడా శుభవార్త(Good News) చెప్పింది. గతంలో దరఖాస్తు చేసుకోలేకపోయినవారు ఈ నాలుగు పథకాలకు మళ్లీ దరకాస్తు చేసుకోవాలని సూచించింది. గ్రామ/వార్డు సభల్లో దరఖాస్తులు అందించాలని సూచించింది. దీంతో ఊరట లభించింది.
పథకాలు ఇలా..
రైతుభరోసా కింద సాగు యోగ్యమైన భూములకు ఎకరాకు రూ.6 వేల చొప్పున రెండు పంటలకు రూ.12 వేలు ఇస్తారు. ఇక ఇందిరమ్మ ఆత్యీ భరోసా పథకం కింద రూ.12 వేల చొప్పున రెండు విడతల్లో ఇస్తుంది. ఇక నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు, అర్హులకు తెల్ల రేషన్ కార్డులు జారీ చేస్తారు. ఇవన్నీ జనవరి 26 నుంచి ప్రారంభం అవుతాయి. కొత్తగా ఆరు లక్షల మందికి కార్డులు జారీ చేయనుండగా 40 లక్షల మందికి లబ్ధి కలుగుతుందని భావిస్తోంది.
జాబితాలో పేరు ఉండాలి..
ఈ నాలుగు పథకాలు పొందాలంటే లబ్ధిదారుల జాబితాలో పేరు ఉండాలి. ఈ జాబితాలను ప్రభుత్వం గ్రామ సభల్లో ఉంచుతుంది. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులకు సంబంధించిన లబ్ధిదారుల జాబితాలు గ్రామ సభలకు వచ్చాయి. వాటిలో పేర్లు లేనివారు జనవరి 21 నుంచి మరోసారి దరకాస్తులు స్వీకరిస్తారు.