Joe Biden: ఎన్నికల వేళ భారత్‌పై బైడెన్‌ ప్రశంసలు.. వలసలపై కీలక సూచన

అమెరికా మిత్రదేశాలు భారత్, జపాన్‌పై జోబైడెన్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఈ నేపథ్యంలో వైట్‌హౌస్‌ వివరణ ఇచ్చింది. మిత్రదేశాలపట్ల అమెరికా అధ్యక్షుడికి అమితమైన గౌరవం ఉందని పేర్కొంది.

Written By: Raj Shekar, Updated On : May 3, 2024 11:59 am

Joe Biden

Follow us on

Joe Biden: భారత్‌తో పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఏడాది చివరల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. ఈ తరుణంలో అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ భారత్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. విదేశీయులను ఆహ్వానించడానికి భారత్‌ భయపడుతుందని చేసిన వ్యాఖ్యలపై కీలక వివరణ ఇచ్చారు. ఈమేరు వైట్‌హౌస్‌ ఒక ప్రకటన విడుదల చేసింది.

మిత్రదేశాలపై వ్యాఖ్యలు..
అమెరికా మిత్రదేశాలు భారత్, జపాన్‌పై జోబైడెన్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఈ నేపథ్యంలో వైట్‌హౌస్‌ వివరణ ఇచ్చింది. మిత్రదేశాలపట్ల అమెరికా అధ్యక్షుడికి అమితమైన గౌరవం ఉందని పేర్కొంది. ఈ క్రమంలో బైడెన్‌ చేసిన వ్యాఖ్యలు విశాల దృక్పథంలోనే అని వెల్లడించింది.

వలసలు లేకనే..
విదేశీ వలసదారులను తమ దేవంలోకి అనుమతించేందుకు భారత్‌ భయపడుతుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ బుధవారం(మే 1న) వ్యాఖ్యానించారు. చైనా, రష్యా, జపాన్‌ల పరిస్థితి కూడా ఇదే అని పేర్కొన్నారు. అందుకే వాటి ఆర్థిక వ్యవస్థలు వేగంగా వృద్ధి చెందడం లేదని తెలిపారు. అందుకు భిన్నంగా అమెరికా విదేశీ వలసదారులను స్వాగతిస్తుందని పేర్కొన్నారు. వారు దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమయ్యేందుకు సహకరిస్తున్నారని చెప్పారు.

వైట్‌హౌస్‌ దిద్దుబాటు..
అధ్యక్షుడు బైడెన్‌ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం కావడంతో వైట్‌హస్‌ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. భారత్‌ను అధ్యక్షుడు బైడెన్‌ గౌరవిస్తారని తెలిపింది. వలసదారులు దేశానికి ఎంత కీలకమో, వారు ఆర్థిక వ్యవస్థను ఎలా బలోపేతం చేస్తారో చెప్పారని తెలిపింది. ఈ వ్యాఖ్యలను విస్తృత అర్థంలో తీసుకోవాలని సూచించింది. భారత్, జపాన్‌తో తమకు బమైన సంబంధాలు ఉన్నాయని పేర్కొంది.

వలస విధానమే కీలకం..
ఇదిలా ఉంటే.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆదేశ వలస విధానమే కీలకంగా మారుతోంది. నవంబర్‌లో అధ్యక్ష ఎన్నికల్లో ఇది మరోమారు కీలక పాత్ర పోషిస్తుంది. 2021నుంచి ఏటా సగటున 20 లక్షల మంది సరిహద్దు నుంచి అమెరికాలో చొరబడుతున్నారు. దీనిని నివారించడానికి బైడెన్‌ అనుసరిస్తున్న విధానాలపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. డోనాల్డ్‌ ట్రంప్‌పైనా వలస విధానంపై విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.