https://oktelugu.com/

సైడ్ డ్యాన్సర్ గా చేసిన ఈమె ఇప్పుడు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్.. గుర్తుపట్టారా?

7G బృందావన్ కాలనీ సినిమాలో మొదటి పాట (మేం వయసుకు వచ్చాం) లో కాజల్ అగర్వాల్ బ్లూ డ్రెస్ వేసుకొని హీరో పక్కన సైడ్ డ్యాన్సర్ గా కనిపిస్తుంది. కానీ ఈ విషయాన్ని ఎవరూ గుర్తుపట్టరు.

Written By:
  • Srinivas
  • , Updated On : May 3, 2024 / 12:05 PM IST

    kazal agarwal

    Follow us on

    7G బృందావన్ కాలనీ సినిమా గురించి ఎవరైనా మరిచిపోతారా? ఈ సినిమా ఇచ్చిన కిక్కు అంతా ఇంతా కాదు. ఈ మూవీ రెండో పార్ట్ గా కూడా వస్తుందని ఇటీవల ప్రకటించారు. 7G బృందావన్ కాలనీ సినిమాలో ప్రధానంగా రవి కృష్ణ, సోనీ అగర్వాల్, సుమన్ శెట్టి, చంద్ర మోహన్, సుధ తదితరులు నటించారు. కానీ ఇందులో మొదటి పాటలో ఓ సైడ్ డ్యాన్సర్ కనిపిస్తుంది. ఆమె ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా ఆకట్టుకుంటోంది. ఆమె ఎవరో తెలుసా?

    సినిమా ఇండస్ట్రీలో చాలా మంది సైడ్ క్యారెక్టర్ నుంచి వచ్చిన వాళ్లే. ఎన్నో ఆశలతో పరిశ్రమలోకి వచ్చిన చాలా మంది సరైన అవకాశాలు రాకపోవడంతో చిన్న పాత్రలు అయినా సరే చేయడానికి ముందకు వస్తారు. అలా చిన్న క్యారెక్టర్ లో నటించి స్టార్లు అయిన వారు ఎందో మంది ఉన్నారు. త్రిష, అనసూయ లాంటి వాళ్లు కూడా సైడ్ పాత్రల్లో కనిపించి ఆ తరువాత స్టార్ అయిన వాళ్లే. వీరిలాగే మరో హీరోయిన్ సైడ్ పాత్రలో కనిపించి ఆ తరువాత స్టార్ అయింది. ఆమెనే కాజల్ అగర్వాల్.

    7G బృందావన్ కాలనీ సినిమాలో మొదటి పాట (మేం వయసుకు వచ్చాం) లో కాజల్ అగర్వాల్ బ్లూ డ్రెస్ వేసుకొని హీరో పక్కన సైడ్ డ్యాన్సర్ గా కనిపిస్తుంది. కానీ ఈ విషయాన్ని ఎవరూ గుర్తుపట్టరు. కానీ చాలా రోజుల తరువాత కాజల్ ను గుర్తించడంతో చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాజల్ ‘లక్ష్మీ కల్యాణం’ అనే చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఆ తరువాత ‘చందమామ’ సినిమాతో స్టార్ అయింది. ఆ తరువాత అగ్రహీరోలందరితో నటించిన కాజల్ పెళ్లయిన తరువాత హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తోంది.