Employee: కరోనా పుణ్యమాని జాబ్ చేసే ప్రతి ఒక్కరూ ఇంట్లో నుంచి పనిచేయాల్సి వచ్చింది. కుటుంబ సభ్యుల మధ్య ఉంటూ సరదగాగా పనిచేయడానికి అందరూ ఇష్టపడేవారే. కానీ ఇక్కడున్న ఇబ్బందులు మాములుగా లేవు. అయితే వర్క్ ఫ్రం హోం తో చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొన్నా.. కొంత మంది మాత్రం ఈ అవకాశాన్ని తమకు అనుగుణంగా వినియోగించుకున్నారు. కొందరు వర్క్ ఫ్రం హోంతో తీవ్రంగా నష్టపోతే .. మరికొందరు మాత్రం కోట్ల రూపాయలు సంపాదించారు. అయితే ఇలా సంపాదిండానికి వారు పెద్ద సాహసమే చేయాల్సి వచ్చంది. యూరప్ కు చెందిన ఓ వ్యక్తి వర్క్ ఫ్రం హో ను ఉపయోగించుకొని 5 కంపెనీల్లో జాబ్ చేశాడు. ఇలా ప్రతీ కంపెనీ నుంచి జీతం పొంది కోట్ల రూపాయలు సంపాదించాడు. అదెలాగో ఒకసారి చూద్దాం..

2020 కరోనా ప్రభావం అన్ని రంగాపై పడింది. ముఖ్యంగా వేతన జీవులకు కోలుకోలేని దెబ్బ తీసింది. కరోనా పేరుతో కొన్ని కంపెనీలో బారం తగ్గించుకునేందుకు ఉద్యోగలకు ఉద్వాసన పలికారు. అయితే అత్యవసరమైన ఉద్యోగులను మాత్రం తమ వద్దే ఉంచుకొని వారితో వర్క్ ఫ్రం హోం విధానాన్ని పెట్టారు. వర్క్ ఫ్రం హోం ద్వారా కొంతమంది ముందు హర్షం వ్యక్తం చేశారు. ఎందుకంటే కార్యాలయాలకు వెళ్లి కరోనాబారిన పడే కంటే ఇంట్లో నుంచి పనిచేయడం సేఫ్ అని భావించారు. ఇక కళ్లెదుటే కుటుంబ సభ్యులతో గుడుపుతూ పనిచేసుకోవచ్చని ఫీలయ్యారు.
అయితే రాను రాను వర్క్ ఫ్రం హోంతో చాలా మంది ఉద్యోగులు తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. మానిసకంగా.. ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారు. వర్క్ ఫ్రం హోం విధానంతో తమ పెట్రోల్ ఖర్చు తగ్గించని అనుకున్నా..ఇంటర్నెట్, కాఫీ ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. అలాగే విద్యత్ బిల్లు తడిసి మోపడైంది. దీంతో ఉద్యోగులకు వచ్చే సాలరీలో సగం వరకు ఖర్చులకు వెళ్లిపోయింది. దీంతో తమకు వర్క్ ఫ్రం హోం వద్దు బాబోయ్ అని తమ గోడు వినిపించారు. అయితే ప్రస్తుతం కరోనా తీవ్రత పెద్దగా లేకపోవడంతో కార్యాలయాలకు అనుమతినిస్తున్నారు.
వర్క్ ఫ్రం హోంతో కొందరు ఇలాంటి అనుభవాలు ఎదుర్కొంటో ఓ యువకుడు మాత్రం పరిస్థితిని తనకు అనుగుంగా మార్చుకున్నాడు. వర్క్ ఫ్రం హోం ద్వారా ఇంట్లో ఉండి కార్యాలయానికి సంబంధించిన పనులు చేయాల్సి ఉంటుంది. అయితే ఓ యువకుడు 6 కంపెనీల్లో జాబ్ పొందాడు. ఒక కంపెనీకి తెలియకుండా మరో కంపెనీకి తన సేవలను అందించాడు. అలా ప్రతీ కంపెనీ నుంచి పెద్ద మొత్తంలో జీతం పొందాడు. ఇలా అ యువకుడు నెలకు రూ.5 కోట్ల వరకు ఆర్జించినట్లు అతడే రెడిట్ బ్లాగులో రాశారు. యూరప్ కు చెందిన ఆ వ్యక్తి వివరాలు తెలపడానికి మాత్రం ఇష్టపడలేదు.
సాధరణంగా ఒక కంపెనీకి ఫుల్ టైం వర్క్ చేసి.. మిగతా కంపెనీలకు పార్ట్ టైం చేస్తూ కొంత ఆదాయాన్ని ఆర్జిస్తారు. కానీ ఈ యువకుకు ఆరు కంపెనీలకు ఫుల్ టైం వర్క్ చేస్తూ అన్నింటినీ మేనేజ్ చేశాడు. దీంతో అతడు కొద్ది రోజుల్లోనే కోటీశ్వరుడయ్యాడు. అయితే తాను ఇలా 40 ఏళ్ల వరకే ఇలా చేస్తానని తన బ్లాగులో చెప్పుకొచ్చాడు. 40 ఏళ్ల తరువాత ఏదో ఒక కంపెనీలో లేదా.. రిటైర్మెంట్ తీసుకొని వ్యాపారం చేస్తానని అంటున్నాడు. అయితే భవిష్యత్ సంగతి ఎలా ఉన్నా అతడి తెలివిని మాత్రం అందరూ మెచ్చుకుంటున్నారు. జాబ్ చేయాలన్నతపన ఆ యువకుడికి తప్పన ఉండడంతోనే ఇలా చేస్తున్నాడని కొందరు అంటుండగా.. మరికొందరు మాత్రం అత్యాశకు పోతే ఆరోగ్యంపై దెబ్బ పడుతుందని అంటున్నారు.