F3 Release Date: విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్న చిత్రం ‘ఎఫ్ 3’ చిత్రం గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైంది. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది. ‘మే 27న సినిమాను రిలీజ్ చేస్తున్నాం. పిల్లలు పరీక్షలు ముగించుకోండి. పెద్దలు సమ్మర్ సందడికై తయారుకండి. ఫన్ పిక్నిక్‌కి డేట్ ఫిక్స్ చేశాం. ఈసారి రిలీజ్ డేట్‌లో మార్పు ఉండదు’ అని యూనిట్ పేర్కొంది. పైగా మేకర్స్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. అందులో భాగంగానే, ఇప్పటికే చిత్రంలోని మొదటి పాటను కూడా విడుదల చేశారు.

సంగీత సంచలనం దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన లబ్ డబ్ లబ్ డబ్బు అంటూ సాగిన ఈ పాట డబ్బు గొప్పతనాన్ని తెలియజేస్తుంది. రామ్ మిరియాల స్వరాలు ఈ పాటను చాలా ఎఫెక్టివ్‌గా మార్చాయి. ఇక ట్రెండీ బీట్ తో కూడిన ఈ పాట చాలా స్టైలిష్‌గా ఉంది. అలాగే భాస్కరభట్ల సాహిత్యం కూడా చాలా బాగుంది. ఇక ఈ పాటలో వెంకీ, వరుణ్ తేజ్ యూత్ ఫుల్ అవతార్ లో, ఉత్సాహంగా అమ్మాయితో డ్యాన్స్ చేస్తూ కనిపంచారు.

Also Read: హీరో తరుణ్ సునామీలో మహేష్ బాబు కొట్టుకుపోయాడా?
మొత్తానికి “ఎఫ్ 3” ఫస్ట్ సింగిల్ సినిమా పై కూడా అంచనాలను రెట్టింపు చేసింది. ఏది ఏమైనా దర్శకుడు అనిల్ రావిపూడికి బాక్సాఫీస్ లెక్కలు బాగా తెలుసు. ఆ లెక్కలకు అనుకూలంగానే ‘ఎఫ్ 3’ స్క్రిప్ట్ లో అదిరిపోయే కామెడీతో పాటు పక్కా మాస్ మసాలా అంశాలు కూడా కథకు అనుగుణంగా పెట్టాడని తెలుస్తోంది. సహజంగా అనిల్ రావిపూడి సినిమాల్లో మంచి హైలైట్ పాయింట్ ఏమిటంటే.. కామెడీ అంతా హీరోల పాత్రల్లో నుండి మాత్రమే పుట్టుకొచ్చేలా పాత్రలను డిజైన్ చేస్తాడు.
ఇక ఎఫ్ 3 సినిమాలో హీరోల పాత్రల విషయానికి వస్తే.. రేచీకటి ఉన్న వ్యక్తి పాత్రలో వెంకటేష్ నటిస్తున్నాడు. అలాగే, నత్తితో నానాపాట్లు పడే వ్యక్తి పాత్రలో వరుణ్ తేజ్ కనిపిస్తున్నాడు. ఈ సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్ లో సోనాలి చౌహాన్ తో పాటు ప్రగ్యా జైస్వాల్, అలాగే అంజలి కూడా నటిస్తున్నారు
Also Read: కొత్త ఫ్రెండ్‌తో ఎంజాయ్ చేస్తున్న సమంత.. ఆమె ఎవరంటే..?