Japan Great Tsunami Wall: జపాన్ పేరు చెప్పగానే మనసులో మెరిసే అత్యాధునిక సాంకేతికతలతోపాటు, విపత్తుల ముందు చూపే అసాధారణ ధైర్యం కూడా గుర్తొస్తుంది. ఈ దేశం గతంలో భూకంపాలు, సునీమాలు, అగ్నిపర్వతాల బ్లాస్టింగ్ కారణంగా అపార నష్టం చవిచూసింది. అందుకే, భవిష్యత్ ముప్పులను అడ్డుకోవడానికి అసాధారణ ప్రణాళికను అమలు చేసింది. సముద్రతీరాల్లో 395 కిలోమీటర్ల పొడవునా భారీ గోడ నిర్మించి, తమ ప్రాంతాలను మహా తరంగాల నుంచి కాపాడుకుంది.
కాంక్రీట్ గోడకు అదనపు బలం
ఈ రక్షణ వ్యవస్థ కేవలం ఇంజనీరింగ్ అద్భుతం మాత్రమే కాదు, ప్రకృతి సహాయంతో ముడిపడిన సమగ్ర పరిష్కారం. గోడకు సమీపంలో 9 మిలియన్ల చెట్లను నాటి, దట్ట అడవిని సృష్టించారు. సముద్ర అలల ఉద్ధృతిని మొదట కాంక్రీట్ అడ్డుకుంటుంది, ఆ తర్వాత చెట్లు అదనపు స్థిరత్వం అందిస్తాయి. ఈ డ్యూయల్ సిస్టమ్ పర్యావరణాన్ని కాపాడుతూ, విపత్తు ప్రభావాన్ని తగ్గిస్తుంది.
ప్రపంచానికి మార్గదర్శకం
ఈ మోడల్ మానవులు, ప్రకృతి సమన్వయంతో విపత్తులను ఎదుర్కోవచ్చని నిరూపిస్తోంది. జపాన్ పట్టుదల, ముందుచూపు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఇలాంటి సజనాత్మక విధానాలు భవిష్యత్ రక్షణలో కీలకం. విపత్తులను ఎదుర్కోవడంలో జపాన్ వారి ప్రణాళిక మరియు పట్టుదల ప్రపంచానికే ఆదర్శం.