HomeఫోటోలుAnchor Sravanthi: ట్రెండ్ మార్చిన యాంకర్ స్రవంతి... లంగా ఓణీలో కొంటె ఫోజులు! వైరల్ ఫోటోలు

Anchor Sravanthi: ట్రెండ్ మార్చిన యాంకర్ స్రవంతి… లంగా ఓణీలో కొంటె ఫోజులు! వైరల్ ఫోటోలు

Anchor Sravanthi: గ్లామరస్ యాంకర్స్ లో ఒకరిగా ఉన్న స్రవంతి చొక్కారపు ట్రెండ్ మార్చింది. సాంప్రదాయ కట్టులో తన ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చింది. యాంకర్ స్రవంతి లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

స్రవంతి చొక్కారపు(SRAVANTHI CHOKKARAPU) తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ఈ మధ్య పలు సినిమా ఈవెంట్స్ కి యాంకర్ గా వ్యవహరిస్తూ, అంతకంతకు తన పాపులారిటీ పెంచుకుంటూ పోతుంది. మరోవైపు ఇంస్టాగ్రామ్ లో గ్లామరస్ ఫోటోలతో నెటిజెన్స్ ని హీటెక్కిస్తోంది. స్రవంతికి ఇంస్టాగ్రామ్ లో భారీ ఫాలోయింగ్ ఉంది. లక్షల్లో నెటిజెన్స్ ఆమెను అనుసరిస్తున్నారు. స్టార్ యాంకర్స్ గా ఉన్న శ్రీముఖి(SREEMUKHI), రష్మీ గౌతమ్ లకు స్రవంతి పోటీ ఇస్తుంది అనడంలో సందేహం లేదు.

స్రవంతి రాయలసీమలో గల కదిరిలో జన్మించింది. నటి కావాలనే కోరికతో మోడలింగ్ వైపు అడుగులు వేసింది. హైదరాబాద్ కి వచ్చిన తొలినాళ్లలో చాలా ఇబ్బందులు పడిందట. యూట్యూబ్ యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టింది. దర్శకుడు రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసి ఫేమస్ అయ్యింది. ఈ క్రమంలో కొందరు స్టార్స్ ని ఇంటర్వ్యూ చేసే ఛాన్స్ దక్కించుకుంది స్రవంతి. జబర్దస్త్ తో పాటు కొన్ని బుల్లితెర షోలలో స్రవంతి సందడి చేసింది.

Also Read: ఇండస్ట్రీ ని సాధించాల్సిన ఎన్టీఆర్ ఆ ఒక్క సినిమాతో పాతాళానికి పడిపోయాడా..?

ఇక ప్రేమ వివాహం చేసుకున్న స్రవంతి అనేక సమస్యలు ఎదుర్కొందట. పేరెంట్స్ తిరస్కరణకు గురైందట. భర్త వ్యాపారంలో నష్టపోవడంతో ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయని స్రవంతి ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది. స్రవంతి బిగ్ బాస్ షోలో కూడా పాల్గొనడం విశేషం. బిగ్ బాస్ నాన్ స్టాప్ లో స్రవంతి ఛాన్స్ దక్కించుకుంది. ఇది ఓటీటీ షో. అయితే స్రవంతి ఆశించిన స్థాయిలో రాణించలేదు. మేల్ కంటెస్టెంట్స్ కి సేవలు చేస్తూ, గేమ్ మీద దృష్టి తగ్గించింది. దాంతో ప్రేక్షకులు తొందరగానే ఇంటికి పంపేశారు.

ప్రస్తుతం యాంకర్ గా స్రవంతి నిలదొక్కుకున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇక పొట్టి దుస్తులు ధరించి హాట్ ఫోజుల్లో మైండ్ బ్లాక్ చేసే స్రవంతి.. ట్రెండ్ మార్చింది. సాంప్రదాయ లంగా ఓణీ ధరించి సరికొత్తగా దర్శనం ఇచ్చింది. స్రవంతి లేటెస్ట్ ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో వైరల్ అవుతున్నాయి. లంగా ఓణీలో మీరు అద్భుతం అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular