Israel Vs Iran: హమాస్‌ను అంతం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం ప్రారంభించి ఆరు నెలలు దాటింది. ఇప్పటికీ హమాస్ ఉగ్రవాదులను వెతికి పట్టుకుని మరీ చంపుతోంది. ఈ క్రమంలో హమాస్ చీఫ్ ఇస్మాయెల్ హనియా హత్యకు గురయ్యాడు. ఈ ఘటనతో ఇటు హమాజ్‌తోపాటు ఇరాన్ కూడా ఇజ్రాయెల్‌పై రగిలిపోతున్నాయి. హినియాను ఇజ్రాయెల్ బలగాలే చంపాయని ఇరాన్ కూడా అనుమానిస్తోంది. అమెరికా కూడా ఇందుకు సాయం చేసిందని భావిస్తోంది. ఫహద్, హనియా హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని, తాము చేసే దాడులు భయంకరంగా ఉంటాయని ఇరాన్ ఇప్పటికే హెచ్చరించింది. మరోవైపు యుద్ధం వస్తే ఇజ్రాయెల్‌కు ఏ సాయమైనా చేస్తామని అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇరాన్ ఆచితూచి వ్యవహరిస్తోంది ఇరాన్. మరోవైపు ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని ఉగ్రవాద సంస్థ హిజ్‌బుల్లా వ్యూహరచన చేస్తోంది. ఇందులో భాగంగా ఉత్తర ఇజ్రాయెల్‌లోని బీట్ హిల్లెల్ నగరంపై డజన్ల కొద్దీ కటియుషా రాకెట్లను ప్రయోగించింది. వాటిల్లో కొన్నింటిని ఇజ్రాయెల్ నిలువరించింది. ఇక ఈ దాడిపై హిజ్‌బుల్లా అధికారిక ప్రకటన చేసింది. కేఫర్ కేలా, డెయిర్ సిరియాన్‌పై ఇజ్రాయెల్ దాడి చేసిందని, ఫలితంగా ఆ ప్రాంతాల పౌరులు గాయపడ్డారని, అందుకే తాము కటియుషా రాకెట్లను ప్రయోగించినట్లు వెల్లడించింది. వరుస పరిణామాలపై ఇజ్రాయెల్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. పారిపోతామంటే ప్రాణభిక్ష పెడతామని, కాదంటే అంతు చూస్తామని హెచ్చరిస్తోంది. అమెరికా సాయం కూడా తీసుకుంటుంది.
ఇజ్రాయెల్‌కు అండగా అమెరికా
యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్‌కు రక్షణగా, దానికి సాయం చేసేందుకు ఆ ప్రాంతంలో అదనపు యుద్ధ నౌకలను, ఫైటర్ జెట్లను మోహరిస్తున్నట్లు అమెరికా రక్షణ శాఖ చెప్పింది. అదే సమయంలో ఇరాన్ మద్దతు ఇస్తున్న హిజ్‌బుల్లా ప్రాభవం ఎక్కువగా ఉన్న లెబనాన్‌ను ఖాళీ చేయమని పాశ్చాత్య దేశాలు తమ పౌరులకు సలహా ఇచ్చాయి. ఇప్పటికే అనేక విమానయాన సంస్థలు ఈ ప్రాంతానికి రాకపోకల్ని నిలిపివేశాయి.
భారతీయులను అప్రమత్తం చేసిన ఎంబసీ..
హిజ్‌బుల్లా లీడర్ ఫహద్ షుక్రు, హమాస్ చీఫ్ ఇస్మాయెల్ హరియా హత్య నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని ఇజ్రాయెల్‌లో ఉంటున్న భారతీయులను ఇండియా ఎంబసీ హెచ్చిరించింది. వెంటనే లెబనాన్ నుంచి వెళ్లిపోవాలని, తదుపరి ఆదేశాల వరకు అక్కడకు వెల్లొద్దని సూచించింది. మరోవైపు ఇజ్రాయెల్‌కు వెళ్లే.. ఇజ్రాయెల్ నుంచి వచ్చే విమానాలను ఎయిర్ ఇండియా రద్దు చేసింది. అమెరికా, స్వీడన్, యూకే దేశాలు కూడా లెబనాన్‌లో ఉంటున్న తమ దేశ పౌరులను అలర్ట్ చేశాయి. వెంటనే ఆదేశాన్ని వీడి రావాలని సూచించాయి.
ఇరాన్ వెనకడుగు..
ఇదిలా ఉంటే.. ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించిన ఇరాన్ ఇప్పుడు వెనక్కి తగ్గింది. గతంలో పలుమార్లు ఇజ్రాయెల్‌పై ఇరాన్ రాకెట్లు ప్రయోగించింది. కానీ అవి ఇజ్రాయెల్‌ను ఏమీ చేయలేకపోయాయి. ప్రస్తుత పరిస్థితిలో ఇజ్రాయెల్‌పై యుద్ధ విమానాలతో దాడి చేయలేదు. గ్రౌండ్ అటాక్ చేయలేదు. కేవలం మిసైల్స్ దాడి ఒక్కటే మార్గం. దీనికి హైపర్ సోనిక్ మిసైల్స్ కావాలి. ఇన్నాళ్లు దాచిన మిసైల్స్ బయటకు తీయాలి. గతంలో చేసిన దాడిని జోర్డాన్, పోలండ్, అమెరికా మధ్యలోనే ధ్వంసం చేశాయి . కొన్నింటిని ఇజ్రాయెల్ తిప్పి కొట్టింది. ఈ నేపథ్యంలో మరోమారు మిసైల్స్ ప్రయోగిస్తే అవి లక్ష్యం చేరతాయా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఆచితూచి వ్యవహరిస్తోంది.
రష్యా సాయంతో..
ఇజ్రాయెల్‌పై యుద్ధానికి ఇరాన్ రష్యా సాయం కోరుతోంది. రష్యా నుంచి సూపర్ సోనిక్ మిసైల్స్ తెప్పించే ప్రయత్నం చేస్తోంది. వీటినితో ఇజ్రాయెల్‌ను దెబ్బతీయాలని చూస్తోంది. అయితే ఇందులో సక్సెస్ అయితే ఇరాన్‌కు తిరుగు ఉండదు. కానీ, ఫెయిల్ అయితే మాత్రం ఇరాన్ పరిస్థితి దారుణంగా ఉంటుంది. ప్రపంచలో ఎవరూ ఆ దేశాన్ని పట్టించుకోరు. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్‌పై దూకుడు తగ్గించినట్లు తెలుస్తోంది.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: It seems that irans aggression against israel has decreased
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com