Site icon OkTelugu

Dhurandhar 2 premiere shows cancelled: ‘ధురంధర్ 2 ‘ ప్రీమియర్ షోస్ రద్దు..చివరి నిమిషం లో ఊహించని ట్విస్ట్ !

Dhurandhar 2 Telugu Collections Drop Reason

Dhurandhar 2 Telugu Collections Drop Reason

Dhurandhar 2 premiere shows cancelled: మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న ‘ధురంధర్ 2 : ది రివెంజ్'(Dhurandhar 2 : The Revenge) చిత్రం మరికొద్ది గంటల్లో విడుదల కాబోతుంది. గత ఏడాది విడుదలైన ‘ధురంధర్’ చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చిందో మనమంతా చూశాం. ప్రపంచవ్యాప్తంగా ఆ చిత్రానికి 1400 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. నెట్ ఫ్లిక్స్ లో కూడా ఈ చిత్రాన్ని ఆడియన్స్ ఎగబడి చూసారు. అలాంటి హిస్టారికల్ బ్లాక్ బస్టర్ కి సీక్వెల్ కాబట్టే , ఈ చిత్రానికి కనీవినీ ఎరుగని రేంజ్ భారీ అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. ఒక హిందీ హీరో సినిమా కోసం తెలుగు అభిమానులు ఇంతలా ఎగబడుతారని అసలు ఊహించలేదు. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు వెర్షన్ ప్రీమియర్ షోస్ రద్దు.

ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ ప్రాంతాల్లో ఈ చిత్రం తెలుగు వెర్షన్ కి భారీ రేంజ్ లో అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. కానీ కంటెంట్ డెలివరీ అవ్వకపోవడం తో మేకర్స్ ఈ చిత్రానికి ప్రీమియర్ షోస్ ని ఏర్పాటు చేయలేకపోతున్నారు. హిందీ వెర్షన్ కి సంబంధించిన కంటెంట్ కూడా పూర్తి స్థాయిలో డెలివరీ అవ్వలేదు. కేవలం ఫస్ట్ హాఫ్ కంటెంట్ మాత్రమే డెలివరీ అయ్యింది. అనేక ప్రాంతాల్లో హిందీ వెర్షన్ ప్రీమియర్ షోస్ కూడా రద్దు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే తెలుగు వెర్షన్ కి టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్లకు థియేటర్స్ యాజమాన్యాలు టికెట్స్ క్యాన్సిల్ చేసి , ప్రేక్షకుల డబ్బులను రీ ఫండ్ చేసేశారు. రేపు ఉదయం 10 గంటల తర్వాత కూడా తెలుగు వెర్షన్ రెడీ అయ్యేలా కనిపించడం లేదు. కచ్చితంగా సాయంత్రం వరకు తెలుగు వెర్షన్ రిలీజ్ అవ్వకపోవచ్చని అంటున్నారు విశ్లేషకులు. ఇంతటి హడావిడి మధ్య ఈ సినిమాని విడుదల చేయడం అవసరమా, ఒక్క రోజుకి వాయిదా వెయ్యొచ్చు కదా అని అంటున్నారు నెటిజెన్స్.

కానీ ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి వంద కోట్ల రూపాయలకు పైగా అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. కాబట్టి వాయిదా వేయడం కుదరదు అంటూ విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. అయితే తెలుగు ఆ ప్రీమియర్ షోస్ రద్దు అవ్వడం తో వాటిని ‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ చిత్రానికి కేటాయిస్తున్నారు. ఇది కలెక్షన్స్ పై చాలా పెద్ద ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇక ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు సభ్యులు A సర్టిఫికేట్ జారీ చేశారు. ఈ సర్టిఫికేట్ కూడా నిన్న సాయంత్రం వరకు రాకపోవడం గమనార్హం.

Exit mobile version