Homeఅంతర్జాతీయంIran US War: ఇరాన్‌తో యుద్ధం.. అమెరికా కొంప కొల్లేరే..

Iran US War: ఇరాన్‌తో యుద్ధం.. అమెరికా కొంప కొల్లేరే..

Iran US War: అకారణంగా ఇరాన్‌పై యుద్ధం ప్రకటించిన అమెరికా.. ఇప్పుడు యుద్ధం నుంచి ఎలా బయటకు రావాలని తంటాలు పడుతోంది. నెల రోజుల యుద్ధంలో అగ్రరాజ్యాం తీవ్రంగా నష్టపోయింది. ఇరాన్‌–అమెరికా గల్ఫ్‌ యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి అమెరికా ఎంత నష్టపోయిందనే ప్రశ్న ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయ అంశంగా మారింది. అమెరికా ఖాతా బుక్స్‌లో 13 మంది మరణించారని పేర్కొంది. ప్రైవేటు నిపుణులు, మీడియా సంస్థలు మాత్రం ట్రిలియన్‌ డాలర్ల నష్టం జరిగిందని అంచనా వేస్తున్నాయి.

అధికార లెక్కలపై మౌనం..
అమెరికా ప్రభుత్వం ఇప్పటి వరకు 11.3 బిలియన్‌ డాలర్ల ఖర్చు జరిగిందని, మరమ్మతులకు విధించి అదనంగా 5 బిలియన్‌ డాలర్లు అవసరమని అమెరికాకు చెందిన ఎన్‌బీసీ అనే మీడియా సంస్థ తెలిపింది. స్వతంత్ర అధ్యయనాల ప్రకారం యుద్ధం కోసం అమెరికా రోజుకు సగటున 2 బిలియన్‌ డాలర్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు సూచిస్తున్నాయి. మొదటి 6 రోజుల్లోనే 11–12 బిలియన్‌ డాలర్లు వెచ్చించినట్లు లెక్కలు వెల్లడించాయి. ప్రపంచ వ్యాప్తంగా నిపుణులు మొత్తం 30–35 బిలియన్‌ డాలర్ల వరకు ఖర్చు చేసిందని అంచనా వేస్తున్నారు. ఇది ట్రిలియన్‌ ప్రమాణంలో చిన్నదే అయినా, ప్రతి డాలరు భారీ బిల్లుగా ఉంది. అమెరికా ప్రజల్లో వ్యతిరేకత భారంగా మారడం భయంతో, పూర్తి వివరాలు ముసుగు పెట్టింది.

బేస్‌లు, విమానాలు ధ్వంసం..
ఇరాన్‌ ప్రతీకార దాడులు కువైట్‌ లోని అల్‌ అలీ సలీల్‌ బేస్, యూఏఈలోని ఎయిర్‌ బేస్‌లు, సౌదీ అరేబియాలోని ప్రిన్స్‌ సుల్తాన్‌ ఎయిర్‌ బేస్‌ మొదలైన ప్రధాన స్థావరాలను ధ్వంసమయ్యాయి. ఇరాన్‌ సైన్యం 1100 పాయింట్లలో వంద లక్ష్యాలను టార్గెట్‌ చేసినట్లు అంచనా వేసింది. ఎన్‌బీసీ ప్రకారం, యుద్ధ విమానాలు, రాడార్‌ టవర్లు, రన్‌వేలు, డిఫెన్స్‌ సిస్టమ్లు పూర్తిగా నాశనం అయ్యాయి. 1964 నాటి యుద్ధ విమానలు ఎస్‌ఎఫ్‌15 జెట్స్‌ కూల్చడం అమెరికా టెక్నాలజీ మీద ప్రపంచానికి షాక్‌ ఇచ్చింది. ఒక విమానం విలువ 100 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.929 కోట్లు) ఉంది.

మీడియా మౌనం..
ఎన్‌బీసీ, అమెరికా ఎంటర్‌ప్రైజ్‌ ఇనిస్టిట్యూట్‌ లాంటి సంస్థలు సాక్ష్యాధారాలతో నష్టం వివరించాయి. అమెరికా ప్రభుత్వం ఈ నివేదికలను ఖండించలేదు, సైన్యం కూడా తప్పు పట్టలేదు. ఇది అంతర్గత లెక్కలు నిజమే అని సూచిస్తుంది. ప్రెసిడెంట్‌ డొనాల్డ్‌ ట్రంప్‌ ఇప్పుడు మౌనం పాటిస్తున్నారు, కానీ ప్రజల్లో ప్రచారం మాత్రం బలంగా ఉంది. శాటిలైట్‌ ఫోటోలను బ్యాన్‌ చేసిన ప్యానెట్‌ ల్యాబ్‌ నిర్ణయం కూడా అసలు బాధ దాగి ఉందని సూచిస్తుంది. యుద్ధ ప్రాంతంలో ఫొటోలు తీయడం పూర్తిగా ఆపడం లేదు. కానీ అమెరికా నిర్ణయంతో స్పష్టత లోపిస్తోంది.

విమానాల వ్యాపారంపై ప్రభావం
అమెరికా ఆయుధ మార్కెట్‌ ప్రతిష్ఠ ప్రశ్నార్థకంగా మారింది. రఫేల్‌ యుద్ధ విమానాల వ్యవహారంలో అమెరికా పట్టు పెరిగింది, కానీ ఇరాన్‌ ప్రదర్శనలు ప్రపంచ దేశాల్లో అమరికా పరువు తీస్తున్నాయి. యుద్ధ పరిస్థితి నిరంతరం పెరిగితే, ఆయుధ అమ్మకాలు తగ్గుతాయి. ప్రతి సెకనుకు రూ.5.8 కోట్ల ఖర్చు (భారతీయ కరెన్సీలో) పెట్టడం ప్రజా సహనాన్ని పరీక్షిస్తోంది.

అమెరికా ప్రజలు సత్యాన్ని తెలుసుకోవాలి, లేదా రాజకీయ మాటలు మాత్రమే చూడాలి. ఇది తరువాతి ప్రపంచ యుద్ధాలపై ప్రభావం చూపుతుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular