Iran military strength secrets: ఇరాన్–అమెరికా–ఇజ్రాయెల్ వార్ 18 రోజులైనా ఉధృతి తగ్గడం లేదు. ఇజ్రాయెల్‌ను ఎదుర్కొనడానికి ఇరాన్‌కు పెద్ద వార్ బేస్‌లు కావాలి. కానీ అవేమీ లేకపోయినా ఇరాన్ అమెరికా, ఇజ్రాయెల్‌ను ఎదర్కొంటూనే గల్ఫ్ దేశాలపై దాడులు చేస్తోంది. తాజాగా బహ్రెయిన్‌లోని ఎత్తయిన భవనంపై దాడి చేసింది. అంటే ఇజ్రాయెల్ సైనిక శక్తి కూడా ఇంకా బలంగానే ఉంది. అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్మీ ఉన్న దేశం. సైన్యానికే ఒక ట్రిలియన్ డాలర్ల బడ్జెట్ ఖర్చు చేస్తుంది. దానివద్ద పెద్ద ఎత్తున ఆయుధాలు ఉన్నాయి. కానీ ఇరాన్ యుద్ధాన్ని దీర్ఘకాలం కొనసాగించడం ద్వారా అమెరికాపై ఒత్తిడి తేవడంతోపాటు ఆర్థికంగా దెబ్బతీయాలని చూస్తోంది. గల్ఫ్ దేశాలపై దాడి చేయడం, హార్మూజ్ జలసంధి మూసివేత ద్వారా ప్రపంచ దేశాలు అమెరికాపై ఒత్తిడి తెచ్చేలా యత్నిస్తోంది.
ఐఆర్‌జీసీనే ఇరాన్ ప్రధాన ఆయుధం..
ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్‌స్(ఐఆర్‌జీసీ) సుప్రీం లీడర్ నియంత్రణలో ఉంటుంది. దేశంలోనూ, దేశం వెలుపల ఆపరేషన్లు నడుపుతుంది. దీనికి స్వతంత్ర ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవీ బలగాలు ఉన్నా. తాజాగా బహ్రెయిన్ దాడి చేసింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ మరణం తర్వాత ఆయన కొడుకు మోజ్తాబా ఖమేనీ ఎన్నికయ్యారు. అయితే ఆయన కూడా గాయపడ్డాడని, రహస్యంగా రష్యా వెళ్లి చికత్స తీసుకుంటున్నాడని సమాచారం. అయినా ఐఆర్‌జీసీ యుద్ధం కొనసాగిస్తోంది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై హెచ్చరికలు ఈ బలాన్ని తెలియజేస్తున్నాయి.
కొండల కింద ఆయుధాలు..
ఇక ఇరాన్ మరో బలం పొడవైన, ఎత్తయిన కొండలు. ఈ కొండల కింద ఇరాన్ పెద్ద ఆయుధాగారం నిర్మించింది. ఇక్కడే అణు కార్యకలాపాలు కూడా నిర్వహిస్తోంది. మిస్సైళ్లు, లాంచర్లు, డ్రోన్లు ఇతర ఆయుధాలు ఇక్కడే ఉన్నాయి. ఇసుక దిబ్బల నుంచి ఆయుధాలను ప్రయోగిస్తోంది. ఇరాన్ మొత్తన్ని అమెరికా ధ్వంసం చేసినా ఆయుధాలను టచ్ చేయలేదు.
ఆర్థిక ఒత్తిడి వ్యూహం
అమెరికా, ఇజ్రాయెల్ సైనిక ఆధిక్యతకు మించి ఇరాన్ దీర్ఘయుద్ధంతో ఆర్థిక దెబ్బ తీయాలని చూస్తోంది. గల్ఫ్ దాడులు, జలసంధి అవరోధాలు ప్రపంచ ఆయిల్ సరఫరాను దెబ్బతీస్తూ అమెరికా మీద ఒత్తిడి పెంచుతాయి. ఈ పరోక్ష పోరాటం సంప్రదింపులకు దారి తీయవచ్చు.
ఇజ్రాయెల్ శాంసన్ వ్యూహం..
ఇక ఇజ్రాయెల్ తమపై దాడి చేస్తే సాంసన్ ప్లాన్ అమలుకు సిద్ధంగా ఉంది. ఇజ్రాయెల్‌పై ఇరాన్ అణుదాడి చేస్తే ఇరాన్ శాంసన్ ప్లాన్‌లో భాగంగా జలాంతర్గాములతో అణుదాడిని ప్రపంచదేశాలపై చేయడానికి సిద్ధంగా ఉంచింది. తాము నాశనమైతే ప్రపంచం మొత్తం నాశనం కావాలనేది ఇజ్రాయెల్ శాంసన్ వ్యూహం.
ఐఆర్‌జీసీ ఆధారంతో ఇరాన్ యుద్ధం ఉధృతంగా కొనసాగిస్తోంది. దీంతో ప్రాంతీయ అస్థిరత పెరుగుతుంది, రష్యా, చైనా మద్దతు బలపడవచ్చు. అయితే ఆర్థిక ఒత్తిడి ఇరాన్‌కు సవాల్‌గా మారవచ్చు. ఈ సంఘర్షణ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ఇంధన ధరలను మార్చే అవకాశం ఉంది.
