Iran missile attack video: యుద్ధం అంటే నష్టం.. యుద్ధం అంటే రక్తపాతం.. యుద్ధం అంటే స్వార్థం.. యుద్ధం అంటే ప్రతీకారం.. వెనకటికి ఓ మహానుభావుడు రాసిన పంక్తులు అవి. ఇప్పుడు వీటిని ఎవరూ పట్టించుకోవడం లేదు. రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం రకరకాల ఎత్తులు వేస్తుంటారు. నచ్చని దేశాలపై మండిపడుతుంటారు. అవసరమైతే యుద్ధాలు చేస్తుంటారు. యుద్ధాలకు పిలుపునిచ్చే నాయకులు బాగానే ఉంటారు. కానీ అంతిమంగా ఆ భారాన్ని ప్రజలు మోస్తుంటారు. యుద్ధాన్ని సైనికులు చేస్తుంటారు. తమ ప్రాణాలను కాపాడుకోవడానికి యుద్ధానికి పిలుపునిచ్చిన నాయకులు బంకర్లలో దాచుకుంటారు.
నేటి నవీన కాలంలో సామ్రాజ్యవాదం విపరీతంగా పెరిగిపోతుంది. నాయకుల మధ్య స్వార్థం అధికమవుతోంది. అందువల్లే యుద్ధాలు చోటు చేసుకుంటున్నాయి. ఘర్షణలు సర్వసాధారణంగా మారిపోతున్నాయి. అందువల్లే ప్రపంచవ్యాప్తంగా విపత్కర పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ఇక ఇటీవల కాలంలో రష్యా – ఉక్రెయిన్ మధ్య చోటు చేసుకున్న యుద్ధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఈ యుద్ధం ముగిసిపోవడం లేదు. ఇప్పటికే భారీగా నష్టం చోటుచేసుకుంది. ప్రాణ నష్టం కూడా అదే స్థాయిలో సంభవించింది. అయినప్పటికీ ఇతర దేశాలు ఈ పరిణామం నుంచి పాఠాలు నేర్చుకోవడం లేదు.
Iranian missiles in action. Recorded from a Jeddah-bound PIA flight. pic.twitter.com/mj2GxmpwI4
— Mona (@MonaEssSays) June 17, 2025
ఆకాశంలో క్షిపణుల వాన
ఉక్రెయిన్ – రష్యా మధ్య జరుగుతున్న యుద్ధాన్ని మర్చిపోకముందే.. ఇరాన్ – ఇజ్రాయిల్ మధ్య విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ రెండు దేశాలు పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. ఏ మాత్రం తగ్గకుండా బాంబుల వర్షం కురిపించుకుంటున్నాయి. భారీగా ఆస్తి నష్టం జరుగుతున్నప్పటికీ రెండు దేశాలు ఏమాత్రం తగ్గడం లేదు. దీనికి తోడు ప్రాణ నష్టం కూడా అధికంగా చోటు చేసుకుంటున్నది. ఇక ఇటీవల ఇజ్రాయిల్ పై ఇరాన్ క్షిపణులతో దాడి చేసింది. ఇవన్నీ కూడా హై రేంజ్ క్షిపణులు కావడం.. వాటిని వెంట వెంటనే ప్రయోగించడంతో ఒకరకంగా ఇజ్రాయిల్ మీద బాంబుల వర్షం కురిసింది.
Also Read: Israel Iran war impact on India: భారత్–పాకిస్థాన్ యుద్ధానికి.. ఇజ్రాయెల్–ఇరాన్ వార్‌కు తేడా ఇదే!
అదే సమయంలో ఆకాశమార్గాన విమానాలలో వెళుతున్న ప్రయాణికులు తమ ఫోన్లలో ఆ దృశ్యాలను చిత్రీకరించారు. ఆకాశంలో క్షిపణులు వెళ్తున్న దృశ్యాలను చిత్రీకరించి సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేశారు.. ” సాధారణంగా ఆకాశంలో మేఘాలు ఏర్పడతాయి. సూర్యోదయం వల్ల వెలుతురు వాతావరణం ఏర్పడుతుంది. కానీ ఈసారి మాత్రం అంతకు భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. అన్నింటికీ మించి ఇరాన్ ప్రయోగిస్తున్న మిస్సైల్స్ వల్ల ఆకాశం రకరకాలుగా కనిపిస్తోంది. వాటి శబ్దం.. అవి వెళ్తున్న తీరు చూస్తుంటే నష్టం మామూలుగా ఉండదని అర్థమవుతుందని” నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.