PM Modi Vizag Yoga Day: ఏపీలో ప్రధాని మోదీ( Prime Minister Narendra Modi) పర్యటనకు షెడ్యూల్ ఖరారు అయ్యింది. ఈనెల 21న విశాఖలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవం లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొని ఉన్నారు. ఆయన పర్యటన షెడ్యూల్ ను ప్రధానమంత్రి కార్యాలయం విడుదల చేసింది. ప్రధాని మోదీ భువనేశ్వర్ నుంచి విశాఖకు చేరుకోనున్నారు. ఒకరోజు ముందుగానే ప్రధాని విశాఖకు రానుండడం విశేషంగానే చెప్పుకోవచ్చు. వాస్తవానికి ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ పర్యటనకు సంబంధించి నెల రోజుల కిందటే ప్రకటన వచ్చింది. అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులకు ప్రారంభోత్సవానికి విచ్చేసిన ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. తాజాగా ప్రధానమంత్రి కార్యాలయం ఈ షెడ్యూల్ విడుదల చేసింది.
భువనేశ్వర్ నుంచి రాక..
ప్రధాని నరేంద్ర మోడీ ఈనెల 20న సాయంత్రం భువనేశ్వర్( Bhuvneshwar ) వస్తారు. అక్కడ నుంచి విశాఖపట్నం చేరుకుంటారు. ఆ రాత్రికి తూర్పునౌకాదళం గెస్ట్ హౌస్ లో బస్సు చేస్తారు. ఆ తరువాత రోజు జరిగే యోగా దినోత్సవం లో పాల్గొంటారు. ఈనెల 21 శనివారం ఉదయం 6:30 గంటల నుంచి 7:45 గంటల వరకు విశాఖ సాగర తీరంలో ఆర్కే బీచ్ లో జరిగే కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటారు. అనంతరం ఉదయం 11:50 గంటలకు విశాఖ నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్తారు. ప్రధాని మోదీ హాజరవుతుండడంతో విశాఖలో నిర్వహించే ప్రపంచ యోగా దినోత్సవ నిర్వహణకు సంబంధించి చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు.
Also Read: AP People Owe Gratitude to Modi?: ఏపీ ప్రజలు మోడీకి రుణపడి ఉండాలట
5 లక్షల మంది హాజరవుతారని అంచనా విశాఖలో( Visakhapatnam) జరిగే ప్రపంచ యోగా దినోత్సవ కార్యక్రమానికి దాదాపు 5 లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. వారందరూ యోగా చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికోసం విశాఖ రామకృష్ణ బీచ్ లో ప్రతి 1000 మందికి ఒక బ్లాక్ ఏర్పాటు చేస్తున్నారు. ఒక యోగ ట్రైనర్ ను అందుబాటులో ఉంచేలా ప్లాన్ చేశారు. ప్రధాని మోదీ పర్యటన దృష్ట్యా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే విశాఖలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. నావెల్ కోస్టల్ బ్యాటరీ నుంచి పార్క్ హోటల్ వర్క్ ర్యాట్ జోన్ గా ప్రకటించారు. ఈనెల 21 వరకు విశాఖ గగనతలంలో డ్రోన్లపై నిషేధం ఉంటుంది. మరోవైపు బీచ్ రోడ్డులో పోలీసుల నిఘా పెరిగింది. ఏపీ పోలీసులతోపాటు కేంద్రం నుంచి వచ్చిన బలగాలు భద్రతలో పాలుపంచుకుంటున్నాయి. మరోవైపు విశాఖలో యోగా దినోత్సవ ఏర్పాట్ల సమీక్షకు సీఎం చంద్రబాబు వచ్చారు. అధికారులకు కీలక సూచనలు చేశారు