spot_img
Homeఅంతర్జాతీయంIran last weapon: ఇరాన్‌ ఆఖరి అస్త్రం.. వాడితే వినాశనమే!

Iran last weapon: ఇరాన్‌ ఆఖరి అస్త్రం.. వాడితే వినాశనమే!

Iran last weapon: ఇరాన్, అమెరికా–ఇజ్రాయెల్‌ యుద్ధం మొదలై 22 రోజులైంది. ఇప్పటికీ ఎవరూ తగ్గడం లేదు. దీంతో యుద్దం ఇప్పట్లో ముగిసే సూచనలు కనిపించడం లేదు. మరోవైపు ఇరాన్‌ ప్రతీకార దాడులతో అగ్రరాజ్యానికి చుక్కలు చూపిస్తోంది. ఆర్థిక మూలాలను దెబ్బతీస్తోంది. అమెరికా తమ బలం అనుకున్న ఎఫ్‌–35 స్టెల్త్‌ విమానాన్ని కూల్చింది. అమెరికా ఊహించని డిగోగార్షియాపై మిస్సైల్‌ దాడి చేసింది. దీంతో ఇరాన్‌ సరికొత్త ఆయుధాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఇరాన్‌ వద్ద డర్టీ బాంబ్‌ తయారీ సామర్థ్యం ఉందనే ఆందోళనలు పెరుగుతున్నాయి. సాధారణ పేలుడు పదార్థాలతో రేడియోధార్మిక పదార్థాలను మిళితం చేసిన ఈ ఆయుధం విస్ఫోటక శక్తి తక్కువగా ఉన్నప్పటికీ, పరిసరాలను విషపూరితం చేస్తుంది. 60% శుద్ధి యురేనియం నిల్వలతో ఇరాన్‌ దీన్ని సులభంగా తయారు చేస్తోందని సమాచారం.

డర్టీ బాంబ్‌ లక్షణాలు
సంప్రదాయ అణుబాంబుల మాదిరిగా విధ్వంసక విస్ఫోటం లేని ఈ ఆయుధం రేడియేషన్‌ను వ్యాప్తి చేస్తుంది. గాలి, నీరు ద్వారా విషవాయువులు విస్తరించి, ప్రాంతాన్ని నిరంతరం విషపూరితం చేస్తాయి. ఇది ప్రజలను దీర్ఘకాలం ప్రభావితం చేస్తూ, ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేస్తుంది. అణు బాంబు తయారీకి 90% శుద్ధి అవసరమైతే, డర్టీ బాంబుకు 60% సరిపోతుంది. ప్రస్తుతం ఇరాన్‌ వద్ద 450 కిలోల 60 శాతం శుద్ధి చేసిన యురేనియం నిల్వలు ఉన్నాయి. ఇది డర్టీ బాంబు తయారీకి సరిపోతుంది. యుద్ధంలో చివరి దశలో తమ ఉనికి కాపాడుకోవడానికి ఇరాన్‌ దీన్ని ఉపయోగించే అవకాశం ఉందని అమెరికా, ఇజ్రాయెల్‌ ఇంటలిజెన్ష్‌ సంస్థలు సీఐఏ, మోసాద్‌ అంచనా వేస్తున్నాయి.

Also Read: ఇరాన్‌కు పాకిస్తాన్‌ అణు సహకారం.. ఖతార్‌ హెలిక్యాప్టర్‌ క్రాష్‌తో గుట్టు రట్టు!

ప్రపంచవ్యాప్త ఆందోళనలు
అమెరికా, ఇజ్రాయెల్‌ ఇటువంటి ముప్పును ఎదుర్కొనేందుకు ఇరాన్‌ అణు కేంద్రాలపై దాడులు చేస్తున్నాయి. డర్టీ బాంబ్‌ ప్రయోగం ప్రాంతీయ భద్రతను దెబ్బతీస్తుంది, చమురు రవాణా మార్గాలను ప్రభావితం చేస్తుంది. గల్ఫ్‌ దేశాలు ఈ బెదిరింపుపై ఆందోళన వ్యక్తం చేశాయి. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కూడా సవాలుగా మారుతోంది.

ఇరాన్‌ డర్టీ బాంబ్‌ను ఆఖరి మార్గంగా వాడితే, అంతర్జాతీయ సంఘాలు తీవ్ర చర్యలు తీసుకుంటాయి. ఇది యుద్ధాన్ని మరింత విస్తరింపజేసే అవకాశం ఉంది. అయితే, మతపరమైన నిబంధనలు ఇరాన్‌ను ఆపవచ్చు. ప్రపంచ దేశాలు రాడియోధార్మిక బెదిరింపును నివారించేందుకు కట్టడి చేయాల్సిన అవసరం ఉంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper
Exit mobile version