Homeక్రీడలుక్రికెట్‌MS Dhoni retirement statement: ఐపీఎల్ కు ముందు రిటైర్ మెంట్ పై ధోని సంచలన...

MS Dhoni retirement statement: ఐపీఎల్ కు ముందు రిటైర్ మెంట్ పై ధోని సంచలన ప్రకటన

MS Dhoni retirement statement: ప్రతి ఐపీఎల్ సీజన్లో అదే ప్రశ్న.. అడిగే వాళ్ళు అడుగుతూనే ఉన్నారు. రాసే వాళ్ళు రాస్తూనే ఉన్నారు. పుకార్లు పుట్టించేవారు.. మసాలా దట్టించేవారు.. ఇలా చెప్పుకుంటూ పోతే కంటెంట్ సృష్టించే ప్రతి ఒక్కరికి ధోనినే కీలక దినుసు. అతని రిటైర్మెంటే ప్రధాన కథా వస్తువు.

ధోని రిటర్మెంట్ అవుతాడు.. ఇదే చివరి సీజన్.. ఇలా ప్రతిసారి ప్రచారం జరుగుతూనే ఉంది. సోషల్ మీడియా నుంచి ప్రధాన మీడియా వరకు ఇష్టానుసారంగా కథనాల పరంపర వస్తూనే ఉంది. అయినప్పటికీ ధోని రిటైర్ కావడం లేదు. పైగా 2025 సీజన్లో తాత్కాలిక సారధిగా ధోని వ్యవహరించాడు. జట్టు విజయాలను పక్కన పెడితే.. మైదానంలోకి దిగిన ధోని తన మునుపటి స్థాయిని ప్రదర్శించాడు. కొన్ని సందర్భాలలో జట్టు ప్లేయర్ల ఆట తీరు పట్ల అసహనం వ్యక్తం చేసినప్పటికీ.. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే విషయంలో మాత్రం ధోని ఎక్కడా కూడా వెనక్కి తగ్గలేదు.

తాజాగా చెన్నై జట్టు తమ ప్లేయర్లతో ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. చెపాక్ స్టేడియంలో భారీగా వచ్చిన అభిమానుల మధ్య చెన్నై ప్లేయర్లతో అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి చెన్నై ప్లేయర్లతో సహా.. తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులు హాజరయ్యారు. ఈ క్రమంలో ధోనిని తమిళ హీరో శివ కార్తికేయన్ ఇంటర్వ్యూ చేశారు. రిటర్మెంట్ కు సంబంధించి అనేక ప్రశ్నలు అడిగారు.. “సార్ మీరు రిటైర్ కావొద్దు.. జట్టు కోసం ఆడాలి” అని శివ కార్తికేయన్ అడిగితే.. “లేదు సార్.. క్రికెట్ అనేది ఒక వయసు వరకే పరిమితమవుతుంది. ఆ తర్వాత శరీరం సహకరించదు” అని ధోని బదులిచ్చాడు.. “60 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ కూడా సినిమాలు చేస్తారా” అని ధోని శివ కార్తికేయన్ ను ఉద్దేశించి ప్రశ్నించారు. “నేను 60 సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా సినిమాలు చేస్తాను.. మీరు కూడా అంత వయసు వచ్చినప్పటికీ కూడా ఐపీఎల్ ఆడాలి అని” శివ కార్తికేయన్ అన్నాడు.. దానికి సరే అని ధోని సమాధానం చెప్పాడు.. దీంతో ధోని రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడని.. కచ్చితంగా ఐపీఎల్ లో చాలా సంవత్సరాల వరకు వాడుతాడని అభిమానులు పేర్కొంటున్నారు.

గత ఏడాది కూడా ధోనికి ఇదే ప్రశ్న ఎదురైంది. ఆ సమయంలో ధోని చమత్కారంగా తన సమాధానం చెప్పాడు. తాను స్ట్రెచర్ మీద ఉన్నప్పటికీ చెన్నై యాజమాన్యం తీసుకొస్తుందని.. మైదానంలో ఆడిస్తుందని ధోని పేర్కొన్నారు. అప్పట్లో ధోని చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనం కలిగించాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version