https://oktelugu.com/

International Men’s Day 2024: మగజాతి ఆణిముత్యాలకు.. హ్యాపీ మెన్స్ డే!

ప్రతీ ఏటా అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని నవంబర్ 19న జరుపుకుంటారు. అయితే ఈ పురుషుల దినోత్సవాన్ని ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారు? దీని చరిత్ర ఏంటి? ఈ ఏడాది ఏ థీమ్‌తో ఏంటి? ఈ రోజు ఏం చేయాలి? అనే విషయాలు పూర్తిగా తెలుసుకుందాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 19, 2024 / 08:44 AM IST

    international mens day

    Follow us on

    International Men’s Day 2024: ఈ ప్రపంచంలో అన్నింటికి గుర్తింపు లభిస్తుంది. కానీ ఒక్క మగాడి కష్టానికి మాత్రం గుర్తింపు లభించడం లేదు. పుట్టినప్పటి నుంచి ఒక కొడుకుగా, అన్నయ్యగా, తమ్ముడిగా, భర్తగా, తండ్రిగా ఇలా అన్ని విధాలుగా ఎన్నో త్యాగాలు చేస్తారు. కుటుంబ బాధ్యతలు కోసం వారి ఇష్టాలను వదిలేసి జీవితాంతం కష్టపడతారు. కానీ ఎవరికి వీరి కష్టం కనిపించదు. అయితే పురుషులు చేసే సేవలకు గుర్తింపుగా ప్రతీ ఏడాది నవంబర్ 19న అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రతీ పురుషుడు తన కంటే కుటుంబం కోసం జీవితాంతం కష్టపడుతూనే ఉంటాడు. కానీ సమాజంలో పురుషులకు గుర్తింపు లభించదు. పురుషులు కష్టం, త్యాగం అన్ని విషయాల గురించి ఈ ప్రపంచానికి తెలియడానికి ప్రతీ ఏటా అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. అయితే ఈ పురుషుల దినోత్సవాన్ని ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారు? దీని చరిత్ర ఏంటి? ఈ ఏడాది ఏ థీమ్‌తో ఏంటి? ఈ రోజు ఏం చేయాలి? అనే విషయాలు పూర్తిగా తెలుసుకుందాం.

    అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని జరుపుకోవాలని 1992లో ప్రతిపాదించారు. కానీ ఐక్యరాజ్య సమితి 1999లో అనుమతి ఇచ్చింది. మొదటిసారి 1999లో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ట్రినిడాడ్ అండ్ టొబాగోలో జరిగింది. అప్పటి నుంచి ప్రతీ ఏడాది నవంబర్ 19న అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. పురుషులు కష్టానికి గుర్తింపుగా ఒక రోజు ఉండాలని కొందరు 1960 నుంచే పోరాటం మొదలు పెట్టారు. ఈ పోరాటానికి కొందరు జర్నలిస్టులు రచనలతో సపోర్ట్ చేయడంతో చివరకు ఐక్యరాజ్య సమితి 1999లో అధికారికంగా గుర్తించింది. అయితే ఈ అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా 80 దేశాలలో జరుపుకుంటున్నారు. ఇండియాతో పాటు చైనా, అమెరికా, ఘనా, నైజీరియా, సౌత్ ఆఫ్రికా, టాంజానియా, జింబాబ్వే, పాకిస్థాన్, బ్రెజిల్‌లో అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని ప్రతీ ఏడాది ఘనంగా జరుపుకుంటారు. అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని ఇండియాలో 2007 నుంచి జరుపుకోవడం ప్రారంభించారు. ఈ ఏడాది అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని పురుషుల ఆరోగ్య ఛాంపియన్స్ అనే థీమ్‌తో జరుపుకుంటున్నారు.

    ఈ అంతర్జాతీయ పురుషుల దినోత్సవం రోజు ప్రతీ మగాడికి విష్ చేయండి. ఒక ఆడదాని ప్రేమ, కష్టం కనిపిస్తుందేమో.. కానీ మగాడి కష్టం మాత్రం కనిపించదు.. ఎవరూ గుర్తించరు. వీరికి గుర్తింపు ఇచ్చేలా ఈ రోజు మెన్స్‌ను గౌరవిస్తూ.. సెలబ్రేట్ చేయండి. పురుషులపై వివక్ష చూపకుండా గౌరవించండి. వారికి గుర్తింపు ఇవ్వాలని అవగాహన కల్పిస్తూ చిన్న కార్యక్రమాలు నిర్వహించండి. అలాగే మీ తండ్రికి, సోదరుడు, భర్త ఇలా వారికి ఏవైనా చిన్న గిఫ్ట్‌లు ఇచ్చి వారి విలువను పెంచండి. ఈ రోజు వాళ్లతో సరదాగా గడపండి. మహిళా దినోత్సవం అయితే మీకు ఎంత గుర్తింపు ఇస్తారో.. అంతకంటే ఎక్కువగా వారికి మెన్స్ డే‌ను స్పెషల్‌గా చేయండి. ప్రపంచం మొత్తం ఒక పురుషుడికి గుర్తింపు ఇవ్వకపోయిన.. కుటుంబంలో ఉన్న వారు గుర్తింపు ఇస్తే పొంగిపోతారు. చివరిగా.. కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేసిన ప్రతీ మగజాతి ఆణిముత్యానికి హ్యాపీ మెన్స్ డే.