Indus Water Treaty Effect: గత ఏడాది ఏప్రిల్‌లో జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి జరిగింది. 26 మంది పర్యాటకులు చనిపోయారు. దీంతో భారత ప్రభుత్వం సింధు జల ఒప్పందం రద్దు చేసింది. 1969లో జరిగిన ఈ ఒప్పందం నిలిపివేయడంతో మన దేశం నుంచి పాకిస్తాన్‌లోకి వెళ్లాల్సిన జలాలు ఆగిపోయాయి. అవసరం లేని సమయంలో వరదలు వస్తున్నాయి. తాజాగా ఒప్పందం నిలివేత ఎఫెక్ట్ పాకిస్తాన్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. చుక్క నీరు కూడా పాకిస్తాన్ దాటి వెళ్లడం లేదు. దీంతో దాయాది దేశంలో కరువు ఛాయలు కనిపిస్తున్నాయి.
భారత్ వ్యూహం, పాక్ సంక్షోభం
భారత్ పాక్‌పై ఉగ్రవాద కార్యకలాపాలకు ప్రతీకారంగా ఈ చర్య తీసుకుంది. పాకిస్తాన్‌లో సింధు, జెహ్లం, చెనాబ్ నదులపై ఆధారపడిన వ్యవసాయం, రోజువారీ జీవనం కష్టమవుతోంది. డ్యామ్‌ల నిర్మాణం, నీటి నిల్వలు భారత్‌కు ప్రయోజనకరంగా మారాయి. ఇప్పటికే పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్తాన్‌లో తాజాగా జల సంక్షోభం తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు.
వ్యవసాయంపై ప్రభావం..
పాకిస్తాన్ మొత్తం వ్యవసాయంలో చాలా వరకు సింధు జలాలపై ఆధారపడి సాగుతోంది. నీటి నిలిపివేతతో 30 నుంచి 40 శాతం వ్యవసాయం తగ్గే అవకాశం ఉంది. ఆహార భద్రత దెబ్బతినే ప్రమాదం ఉంది. నదీ ప్రవాహ మార్పులు డెల్టా ప్రాంతాల్లో ఉప్పు పెరగడం, జీవవైవిధ్య నష్టానికి దారితీస్తాయి. ఈ నేపథ్యంలో పాక్ అంతర్జాతీయ మధ్యవర్తిత్వం కోరవచ్చు. కానీ భారత్ దృఢంగా నిలబడుతుంది. ఒప్పందం పునరుద్ధరించే అవకాశాలు తక్కువ.
No water going to Pakistan..
Indus Water Treaty abeyance showing its effects pic.twitter.com/zuLeOiNrVI
— Frontalforce (@FrontalForce) January 5, 2026